Рет қаралды 8,990
శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఈ భువి పైకి వచ్చినప్పుడు తొట్ట తొలిగా పుట్టలో వున్న శ్రీ స్వామివారికి తన క్షీరధారలను కురిపించి ,ఆకలి దప్పులను తీర్చిన గోమాత 'గౌతమీ ధేనువు'....అంతటి విశిష్టత కలిగిన గోమాతలను తొలిగా తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంత వున్న 'శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం' వద్ద తొలిగా దర్శించి ,పూజించి ...శ్రీ వేంకటాచల యాత్రను ప్రారంభించి,తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం ....తిరుమలలో శ్రీ స్వామి పుష్కరిణీ స్నానం ...శ్రీ ఆదివరాహ స్వామివారి దర్శనం ....పిదప శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించి ....ఆ దేవదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం ....ఓం నమో వేంకటేశాయ🙏🏻