ఇంత గొప్ప పాటని అందరూ పాడుకునే విధంగా karoke అందించిన మీకు..హృదయ పూర్వక ధన్యవాదములు..🎉🎉🎉
@chrajeshwari7916 Жыл бұрын
అద్భుతమైన పాట . వీనుల విందు గా వుంది S. P. బాలు గారికి , కోడి రామకృష్ణగారికి ప్రణామములు. మరపురాని సినిమా . శాశ్వతం గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే సినిమా . 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagalakshmikanaparthi91163 ай бұрын
రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయ అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ చాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా..ఆ..ఆ... నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్య సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా..ఆ..ఆ... రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ ధన్యమయ్యా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య
@RafeeqMohammad-io5ro4 ай бұрын
Oka Muslim ne chepthunna e song ante naaku chala eshtam chala sarlu ontariga unnappudu paduthununta great track sir..🙏🙏🙏🙏
@muralijillela76003 ай бұрын
Mohammad bhay హిందూ ముస్లిం భాయి భాయి అందరూ నిల ఉంటే మనకు కావాల్సింది ఇంక ఏమీలేదు