మనస్తత్వం తో పాటు మానవత్వం కూడా వెల్లివిరిసింది కథలో
@bhogarao_Katha_Sravanthi17 күн бұрын
🙏
@VedamurtyNVS-zs2li17 күн бұрын
కధా గమనం చాలా బాగుంది. రచయిత కి అభినందనలు. సంక్రాంతి పండుగ కి సందర్భోచితం గా పప్పు భోగారావు గారు పల్లెటూరి యాసతో డేగ కూతలతో మంచి రక్తి కట్టించారు. అభినందనలు.
@bhogarao_Katha_Sravanthi17 күн бұрын
🙏
@bhogarao_Katha_Sravanthi17 күн бұрын
బలరామ స్వామి గారి చాలా చక్కగా వర్ణించారు. కోళ్ల పందాన్ని దాని ముందు వెనకాల పరిశ్రమను , ఆరాటాన్ని కళ్ళకు కట్టినట్లు రచించారు. పెంపుడు జంతువులతో అందాన్ని డేగకు పడమటయ్యకు గల బంధాన్ని చక్కగా చూపించారు. గెలుస్తామో లేదు అనేకుతూహలం అది కనిపించకపోయేసరికి పడిన ఆరాటం, అది కనిపించిన తర్వాత దానికి ఏమవుతుందో అనే బాధ ఈ సంఘటనలు చాలా చక్కగా చెప్పారు సరే గెలిచాడు డబ్బుని డేగని ఈ పోలీసుల సన్నివేశం అడుగడుగునా ఉత్కంఠగా, ఎలాగైతేనే చివరికి డబ్బు పోగొట్టుకున్న డేగని దక్కించుకున్న పడమటయ్యకు సంతోషం మిగిలింది. కోడిపందాలని మనసుతో చూడగలిగినట్లు రచించిన రచయితకి సూరిబాబు పడమటయ్యల మనోభావాలని చక్కని యాస భాషతో వినిపించిన భోగా రావు గారికి ధన్యవాదాలు. T. సావిత్రి.
@bhogarao_Katha_Sravanthi17 күн бұрын
“డేగ”కథ బాగుంది. కనుమ పండుగ తరువాత ముఖ్యంగా కోడిపందేలు ఆటమొదలు అవుతుంది.ఈ ఆట ఎప్పుడూలేని విధంగా కోట్లరూపాయల పందాలతో జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక జూదాక్రీడగా జరుగతుంది. తగవులు, ప్రతీకాలు, కక్షలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చరిత్రలో జరిగిన సంఘటనలు వింటే మనకు విధితం అవుతుంది. బోబ్బిలి యుద్ధం, పల్నాటుయుద్ధం కొడిపందాల ద్వారా ఆయుద్దాలు జరిగినట్లు చరిత్ర చెపుతుంది. పడమటయ్యకు, సూరిబాబుకు మధ్య వచ్చే వైశమ్యాలు అలాంటివే. రకరకాల పందాలతో డబ్బు పోగొట్టుకోవడం, వ్యక్తిగతకక్షలు పెరిగిపోవడం సమాజంలో మనం చూస్తూ ఉంటాము. ఇది నేరమణి తెలిసిన ఎవ్వరూ తగ్గడం లేదు.రచయిత శ్రీ బోడ్డేడ బాలరామస్వామి గారికి కృతజ్ఞతలు 💐🙏వినిపించిన శ్రీ పప్పు భోగారావు గారికి ధన్యవాదములు 💐💐🙏🙏 పడాల సన్యాసిరావు
@bhogarao_Katha_Sravanthi17 күн бұрын
అనాదిగా సంక్రాంతి పండగ మూడు రోజులు గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందేలు, పొట్టేలు పందేలు ఎడ్ల బళ్లు లాగడం వంటి వినోద పందేలలో లక్షల రూపాయలు చేతులు మారడం సాధారణమే.గ్రామాలంట రాజకీయ పార్టీల కారణంగా గ్రూపులతో ఇటువంటి పందేలకు మరింత ప్రాముఖ్యత ఏర్పడుతుంది. అలాగే సూరిబాబు, పడమటయ్య లాంటి వారిమద్య ఎప్పటి నుంచో నడుస్తున్న వైషమ్యం సంక్రాంతి పండగ కోడిపందేల సమయంలో బయట పడి పడమటయ్య డేగ పందెం కోడిని ఎంతో శ్రమతో పెంచి పందెంలో పోగొట్టుకున్న డబ్బును సంపాదించినా దురదృష్టం కొద్దీ పోలీసులకు చిక్కినా తన పెంపుడు పందెం కోడి డేగ ప్రాణాలను రక్షంచడం కోసం పందెంలో సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకోవల్సి వచ్చింది. డేగ పందెం కోడి కథను చక్కటి గ్రామీణ యాసలో రాసిన బొడ్డేడ బలరామస్వామి గారికి అదే యాసలో చదివి వినిపించిన శ్రీ భోగారావు గారికి అభినందనలు. కందర్ప మూర్తి.
@bhogarao_Katha_Sravanthi17 күн бұрын
అనాదిగా సంక్రాంతి పండగ మూడు రోజులు గ్రామీణ ప్రాంతాల్లో కోడి పందేలు, పొట్టేలు పందేలు ఎడ్ల బళ్లు లాగడం వంటి వినోద పందేలలో లక్షల రూపాయలు చేతులు మారడం సాధారణమే.గ్రామాలంట రాజకీయ పార్టీల కారణంగా గ్రూపులతో ఇటువంటి పందేలకు మరింత ప్రాముఖ్యత ఏర్పడుతుంది. అలాగే సూరిబాబు, పడమటయ్య లాంటి వారిమద్య ఎప్పటి నుంచో నడుస్తున్న వైషమ్యం సంక్రాంతి పండగ కోడిపందేల సమయంలో బయట పడి పడమటయ్య డేగ పందెం కోడిని ఎంతో శ్రమతో పెంచి పందెంలో పోగొట్టుకున్న డబ్బును సంపాదించినా దురదృష్టం కొద్దీ పోలీసులకు చిక్కినా తన పెంపుడు పందెం కోడి డేగ ప్రాణాలను రక్షంచడం కోసం పందెంలో సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకోవల్సి వచ్చింది. డేగ పందెం కోడి కథను చక్కటి గ్రామీణ యాసలో రాసిన బొడ్డేడ బలరామస్వామి గారికి అదే యాసలో చదివి వినిపించిన శ్రీ భోగారావు గారికి అభినందనలు. Kandarpa Murthy