Hay Ranga (హేరంగ) | Lyrical Song-107 | Sri Krishnashtami Spl | Krishna Devotional

  Рет қаралды 103,049

Gnanavaahini channel

Gnanavaahini channel

Жыл бұрын

యోగులకే ఈశ్వరుడైన యోగీశ్వరుడు, దేవతలకే దేవుడైన దేవాదిదేవుడు, సర్వ జగత్తుకు వర్తించే జ్ఞానమును బోధించిన జగద్గురువైన శ్రీ కృష్ణుడు, గీతాచార్యునిగా మారి గీతను బోధించునప్పుడు "నీవు మోక్షమును కూడా సన్యసించు" అను "మోక్షసన్యాసయోగము" ద్వారా సర్వ జీవులకూ ప్రబోధించి, ఒకే ఒక్క జ్ఞానమును మాత్రము శ్రద్ధతో "గురువు" వద్దనుండి అడిగి ఇప్పించుకొనమన్నాడు.
"నీవు జ్ఞానమును కూడా ఆంక్షలతో అడగవద్దు" అని తెలియజేసినాడు. అనగా, నాకు ఫలానా జ్ఞానమే కావాలి, ఫలానా పాత్రనుండే కావాలి, ఫలానా విషయమే కావాలి అను ఆంక్షలతో, ముందే నిర్ణయించుకున్న చిత్తముతో, నిర్బంధించుకున్న భావములతో కూడి జ్ఞానమును అడగవద్దు అన్నాడు.
"నాకు ఆకలైతావుంది" అని అడిగితే సరిపోతుంది కానీ, నాకు "పలావు పెట్టు" అనో, లేక "నాకు ఫలానా పాత్రలోనే వడ్డించు" అనో అన్నదాతను అడిగితే, అతను నీ కోరికను తీర్చలేకపోవచ్చు. అదేవిధముగా దేవుణ్ణి "నాకు జ్ఞానము కావాలి, నా జ్ఞాన తృష్ణ తీర్చు" అని అడిగితే సరిపోతుంది. ఎందుకనగా దేవుడు సర్వమూ తెలిసినవాడు, ఎవరికి ఎప్పుడు ఏ విధముగా జ్ఞానమును అందించాలో, ఎంత అందించాలో ఆయనకు సర్వమూ తెలుసు. ఆయనను "జ్ఞానము అడుగుకొనడమే" మన పని. అందుకొరకు మన సంపూర్ణ శ్రద్ధను "గురు జ్ఞానముపై" వెచ్చించవలెను.
అలా శ్రద్ధతో దేవుని రంగును (అనగా ఆత్మ జ్ఞానమును) మనపై చల్లమని (మనకు ప్రసాదించమని) ఆ గురువును అడుగుకొనునదే ఈ గీతం యొక్క ఉద్దేశ్యం.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం !!!
కృష్ణం ౧౦౦ (వందే) జగద్గురుమ్ !!!
TEAM:
----------
Lyricist - Srinath Shreshti (Janagam, TS)
Singer - Nandhini & Group
Music - N R Chaitanya Kumar Hyd.
Video Composition - Subbu
Tuning, Review & Coordination - Siva Krishna Kogili
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
LYRICS:
-----------
పల్లవి:
-----
హే రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై
శ్రీ రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై
నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణా
ఈ దేహములో నువు ఆడించే నీ జీవులమే కృష్ణా
ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై
మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై
కోరస్:
శ్రీ రంగ హరె శ్రీ కృష్ణ హరె శ్రీ రంగ హరే ...
శ్రీ రంగ హరె శ్రీ కృష్ణ హరె శ్రీ రంగ హరే ...
చరణము 1 :
------------
వేణువు సాక్షిగ త్రైతం నేర్పిన వెన్నెల వెలుగూ నీవేగా
జీవుల శ్వాసకు ఊపిరి నిచ్చన వన్నెల వైనం నీవేగా
రేపటి పొద్దుకు రాతలు రాసే ఆత్మవు తండ్రివి నీవేగా
మాయా మల్పుల మర్మం తెల్పిన గీతాచార్యుడు నీవేగా
తీరని జన్మల వేదన ఆపి జ్ఞాన రంగు జల్లవా
లోకం మార్చె యోగం నేర్పె త్రైత రంగు జల్లవా
కృష్ణా.... నీ లీలలు తెలుపవా..
కృష్ణా.... నీ దారిని చూపవా..
హే రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై
శ్రీ రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై
ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై
మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై
కోరస్:
శ్రీ రంగ హరె శ్రీ కృష్ణ హరె శ్రీ రంగ హరే ...
శ్రీ రంగ హరె శ్రీ కృష్ణ హరె శ్రీ రంగ హరే ...
చరణం 2 :
--------------
దేవుడు ఇచ్చిన గ్రంథము అనగా జ్ఞానం నిండిన రంగేగా
జీవుల విందుకు వాక్యము అనగా రంగడు ఇచ్చిన రంగేగా
యోగం కొరకు గురువును వేడగ మార్గం చూపే రంగేగా
మోక్షం ఒసిగే దేవుని రుజువుకు నింగిలొ తారా రంగేగా
రణముల రంగము దాటే వరకు జ్ఞాన రంగు జల్లవా
తరముల కర్మము వీడే వరకు త్రైత రంగు జల్లవా
కృష్ణా.... నీ లీలలు తెలుపవా..
కృష్ణా.... నీ దారిని చూపవా..
హే రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై
శ్రీ రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై
నీ జ్ఞానముతో మా జీవితమే ముడిపడినది కృష్ణా
ఈ దేహములో నువు ఆడించే నీ జీవులమే కృష్ణా
ఓ రంగ రంగుల మల్లె జ్ఞాన రంగు ఇవ్వు మా కొరకై
మా రంగ రంగుల మల్లె త్రైత రంగు జల్లు మా తలపై
కోరస్:
శ్రీ రంగ హరె శ్రీ కృష్ణ హరె శ్రీ రంగ హరే...
శ్రీ రంగ హరె శ్రీ కృష్ణ హరె శ్రీ రంగ హరే...

Пікірлер
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 24 МЛН
НЫСАНА КОНЦЕРТ 2024
2:26:34
Нысана театры
Рет қаралды 1,6 МЛН
Советы на всё лето 4 @postworkllc
00:23
История одного вокалиста
Рет қаралды 4,7 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
O Chakradhari - Jasvinder Dhani,Raayancha | Audio Song | Bhakti Sagar Telugu
6:13
Chamatkara Atma | Dt : 26-06-2010 | Thraitha Siddantham
1:00:10
Thraitha Siddantham
Рет қаралды 48 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,3 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 196 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 288 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 759 М.
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Жандос ҚАРЖАУБАЙ
Рет қаралды 108 М.