Meera Geetam (మీరా మదిలో) | Lyrical Song- 104 | Moharam Spl | Krishnashtami Spl | Krishna Devotional

  Рет қаралды 92,720

Gnanavaahini channel

Gnanavaahini channel

Күн бұрын

ఈ గీతము ఒక వ్యక్తిని పొగడుటకు వ్రాసినది కాదు, పరమాత్మయైన భగవంతునిపై, జీవాత్మయైన ఒక భక్తుడు పొందగల్గు మహా "భక్తి"ని ఘనపరచుటకు వ్రాసినది.
ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరో భక్తుల గాథలు మనము వినే ఉంటాము. వారందరిలోనూ తన అచంచలమైన కృష్ణభక్తితో ముక్తిని సాధించగలిగిన "మీరాబాయి" కొంత ప్రత్యేకత కల్గినదనియే చెప్పవచ్చును. ఆమె భక్తి స్థాయికి ఆ శ్రీ కృష్ణుడే కరిగిపోయి, తాను వ్యక్తిగా లేని సమయములో కూడా తనయొక్క ధర్మ సూత్రములకు అతీతముగా ఆమెకు కనపడినాడు, వినపడినాడు, ఆమెను ఆదరించినాడు అంటే ఏమాత్రమూ అతిశయోక్తి కాదు.
పూర్వ జన్మల సుకృతబలముతో జన్మించిన ఆమె, శ్రీ కృష్ణ తత్వముపై స్థిరస్థాయిగా నిలిచిపోయే భక్తిభావమును స్వంతము చేసుకొన్నది. హృదయము పులకించిపోయేలా పురుషోత్తముడైన ఆ శ్రీ కృష్ణునిపై 13 వేలకుపైగా భక్తిపాటలను పాడిన ఘనత ఆమెకు దక్కినది. అది ఆ భగవంతుడే ఆమె భక్తిని మెచ్చి, ఆమెను హృదయముతో ఎన్నుకొని ఇచ్చిన "వరము".
"మీరా బాయి" అను పేరును గమనించిన యెడల, "మీ" అనగా నేను అని "రా" అనగా నాశనము అని అర్థము కలదు. "బా" అనగా భగవదాత్మగా భావించి "యి" అనగా ఆయనపై "యిష్టము"గా అన్వయించిన యెడల ఏమి గ్రహించవచ్చుననగా! భగవదాత్మపై పూర్ణ ఇష్టత కలిగిన భక్తుడు, క్షరుడైన తాను అక్షరుడైన ఆత్మలో కలిసిపోయి పురుషోత్తమునిగా మారవలెననే ధ్యాసతో, (మీరా - నేను లేకుండా పోవలెనననే ధ్యాసతో), తాను పూర్వము పొందిన ధర్మాలకు అతీతమైన (మహాధర్మమైన) మహాభక్తియోగమును పొందగలడు.
భక్తి కల్గిన జీవాత్మ, ఆత్మ జ్ఞానము తెలిసి సంపూర్ణ ధర్మాచరణ కల్గిన పిదప, పూర్ణగురువైన భగవంతునికి పూర్ణ శిష్యునిగా మారి, ధర్మములకు కూడా అతీతమైన "భగవంతుని భజియించుట", "ఆయన తత్వములో తరించుట" అను అద్భుతమైన ఆనందమును కూడా పొందవచ్చుననే సూత్రము ఈ "మీరా గీతము" మనకు చెప్పకనే చెబుతున్నది.
భక్తియోగములో మీరా బాయి యొక్క స్థాయిని అందరికీ ప్రకటించిన జగద్గురుదేవులైన "శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులవారు", ఆమె వ్రాసిన మీరాగీతమును కూడా తెలుగులోనికి అనువదించి ఆమె భావశ్రేష్ఠత్వమును గొప్పగా ప్రచురితము చేసినారు. కావున, అందరమూ అట్టి భావమును పొందుటకు భగవంతునిపై పూర్ణ యిష్టము కల్గియుందాము, ఆయననే గొప్పగా భజించుదాము, ఆయననే పెద్దగా కీర్తించుదాము, ఆయనకై ఏకేశ్వరోపాసన చేసి, ఆయనలోనికే ఐక్యమైపోదాము.
సర్వం శ్రీ జగద్గురు కృష్ణార్పణమస్తు !!!
TEAM:
----------
Lyricist - Siva Krishna Kogili
Singer - Nandhini
Music - N R Chaitanya Kumar
Editing - Saleem
Production - Gnanavaahini Team
Presented By - Gnanavaahini Channel
LYRICS:
-----------
సాకీ:
---
కృష్ణ ప్రేమలో పెరిగిన మీరా...
కృష్ణ ధ్యాసనే మరిగిన మీరా...
కృష్ణ తత్త్వమై కరిగిన మీరా
ఆ మీరా భావము గ్రహియించారా...! /2/
పల్లవి:
----
మీరా మదిలో ఏముందో తెలిసినవారు ఎవరంట
గిరిధారిని ఘన పరిచేలా పాడేవారు ఎవరంటా
మీరా మదిలో ఏముందో తెలిసినవారు ఎవరంట
గిరిధారిని ఘన పరిచేలా పాడేవారు ఎవరంటా
మీరా మదిలో ఏముందో తెలిసినవారు ఎవరంట
చరణము 1:
------
సర్వదేహములు ధరించి భరించు వానిని చూసిన మీరా
సకల కర్మలను హరించి తరించు జ్ఞానము పొందిన మీరా
సర్వకార్యములకు తలొంచి స్థిర చిత్తముగా నిలచిన మీరా
సర్వ ధర్మములను వరించి త్యజించు వారికి శిక్షణ మీరా
ఆ మీరా భావము గ్రహియించారా...ఆ మీరా భావము గ్రహియించారా...
ఆత్మగ తనలో నిండిన కృష్ణుని వలచిన మీరా హృదయమును
తనువే జ్ఞానపు ఆవేశముతో తలచిన పొంగే రుధిరమును
ధరణిలొనెవ్వరు పొందగలేని జ్ఞానామృతముతో పరవశము
పరులెవ్వరు మరి గాంచగలేని పరమానందపు అభినయము
అది మీరా భక్తి నిదర్శనము
ఆ మీరా మదిలో ఏముందో తెలిసినవారు ఎవరంట
గిరిధారిని ఘనపరిచేలా పాడేవారు ఎవరంట
మీరా మదిలో ఏముందో తెలిసినవారు ఎవరంట ...
చరణము 2 :
------
కర్మభారములు కడతేరే కృష్ణతత్వమును కాంచిన మీరా
వ్యర్థచింతలను విడనాడే విరించి చింతన చేసిన మీరా
విశ్వమంతటికి ఒకడేయైన విశ్వేశ్వరునే వలచిన మీరా
పురుషోత్తమునే భర్తగనెంచి పరమార్థమునే పొందిన మీరా
ఆ మీరా భావము గ్రహియించారా...ఆ మీరా భావము గ్రహియించారా...
తనభారములే కృష్ణార్పణమై కృష్ణభావమే తనదవగా
తనప్రాణములే ప్రభుకంకితమై ప్రబోధామృతం వరమవగా
అంతరాయమే లేనేలేని అంతర్యామియె చింతనగా
స్వంతము అంటు ఏదీలేని సర్వసమర్పణే యోగముగా
అది మీరా ముక్తికి సాధనగా...ఆ...ఆ...
ఆ మీరా మదిలో ఏముందో తెలిసినవారు ఎవరంట
గిరిధారిని ఘన పరిచేలా పాడేవారు ఎవరంట
మీరా మదిలో ఏముందో తెలిసినవారు ఎవరంట ...
భజనయే ఆమెకు సాధనమూ... కన్నీరే తన పూజనమూ... ఆత్మార్పణమే నైవేద్యమూ...
ఆ మహాభక్తికి ఈ గీతం అంకితమూ... ఆ మహాభక్తికి ఈ గీతం అంకితమూ...
మీరా మదిలో ఏముందో తెలిసినవారే ఘనులంట
గిరిధారిని గుర్తించే భక్తిని ఎరిగినవారే ఘనులంట...
అంతము:
-------------
ప్రబోధ కృష్ణుని పొందిన మీరా భక్తే గొప్పదట
ఆనంద కృష్ణుని పొందిన మీరా ముక్తే చేరేనట
యోగీశ్వరునే పొందిన మీరా జన్మే ధన్యమట ...ఆ జన్మే ధన్యమట ...
ఆ మీరా గీతము యోగీశ్వరుడే ప్రకటన చేసెనుగా
మరి ఉత్తమయోగము అదియేనంటూ ప్రగతిని చూపెనుగా

Пікірлер
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 105 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
Chamatkara Atma | Dt : 26-06-2010 | Thraitha Siddantham
1:00:10
Thraitha Siddantham
Рет қаралды 50 М.
Sri Saibaba Varnamala
18:49
Chintu videos SVSK
Рет қаралды 299 М.
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 105 МЛН