Рет қаралды 751,978
తెలుగు రాష్ట్రాల్లో భూసమస్యలు, వివాదాలు పెరుగుతున్నాయి. భూరికార్డులో తప్పులు...ఎంతకాలం నుండో ఆగిపోయిన భూసర్వేల కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి. కాలం చెల్లిన చట్టాలతో సత్వర పరిష్కారం దొరక్క రైతులు, ప్రజలు, అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. వివాదాలకు ముఖ్యమైన కారణాలు అనేకం ఉన్నా....అందులో ప్రధానమైనది హద్దుల సమస్య ! మరి ఈ హద్దుల సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి, అందులో కీలక అంశాలను భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మనకు వివరిస్తారు.
#BoundaryDisputes