Рет қаралды 54
ఈ జన్మ ప్రజాసేవకు అంకితం - కుoచెం
కడప జిల్లా వాసులు రాయలసీమ రాష్ట్ర పార్టీ జాతీయ అధ్యక్షులు డా. కుoచెం వెంకట సుబ్బారెడ్డి మరియు వేంపల్లి మండలం గిడ్డంగివారిపల్లి గ్రామానికి చెందిన ఓబులరెడ్డి సోమసుందర్ రెడ్డి భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ పరిధిలో ఉన్నటువంటి ఇండియన్ ఎంపైర్ యూనివర్సిటీ నుండి గత ఆగస్టు 28 న తమిళనాడు రాష్ట్రం హోసూరు లో గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి కి చెందిన శ్రీ సత్యదేవా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం వారు వీరికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ప్రతినిధులు శ్రీ సుబ్బారావు గారు ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యానులు, స్థానిక ఆధ్యాత్మికవేత్తలు, పుర ప్రముఖులు, అభిమానులు వీరిని పూల మాలలు, దుశ్శాలువ లతో సత్కరించారు. వీరు చేసిన సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుoచెం మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశామని, ఈ జన్మ ప్రజాసేవకే అంకితం ఇస్తున్నానని తెలియజేశారు. కార్యక్రమం అనంతరం శ్రీమతి రుక్మిణమ్మ & శ్రీ పద్మనాభరెడ్డి దంపతులు అన్నదానము చేశారు.