ఈపాట నిత్యనూతనం. ఎన్నిసార్లు విన్నా యింకా వినాలనే వుంటుంది. విజయగారూ మీగానం అద్భుతం. మీగళం యీపాటలోని సమస్త భావాన్ని ఆవిష్కరించింది. గానం, గాత్రం మధురం.మధురాతి మధురం.
@niranjanayyagari61638 ай бұрын
Jaiho mata sri anasuya
@srimannarayanamurthymallap84522 жыл бұрын
సంగీతం సాహిత్యం గానం త్రివేణీ సంగమమైన సుమధుర గీతం. శ్రీమతి విజయశ్రీ పాడిన తీరు భావయుక్తంగా ఉన్నది.
@anand27473 жыл бұрын
చాలా బాగుంది..మనసు లీనమయ్యేలా మధురం గా,భావ గాంభీర్యం గా ఉంది.. ఎన్ని సార్లు విన్నా బోర్ లేదు..
@yannakulanagaadilakshmi6947 Жыл бұрын
Om Sri matre namaha
@emanivenkatasatyanarayanam73553 жыл бұрын
పాట అద్భుతంగా పాడావు విజయా! నాకు చాలా ఇష్ట మైన పాట.
@chinnadevinandigama84544 жыл бұрын
Song chala baga padaru amma Liric chala bagundi Jayaho matha
@srikanthbukka7803 Жыл бұрын
జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరీ శ్రీ పరాత్పరి
@narayanamurthymogalapalli45993 жыл бұрын
జయహోమాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి.
@nagarajudindu779110 ай бұрын
Jai ho mata sri anasuya raja rajeswari sri paratpari
@SAVITHRIDEVIR Жыл бұрын
This song written by my father Sri Ravinuthala Ramachandra Rao.
@srikanthbukka7803 Жыл бұрын
జయహో మాత
@kondamudisubbarao493610 ай бұрын
ఔను.అమ్మ చే ప్రభావితుల గ్రంథంలో నాన్న గారి చాప్టర్ లో ఈ పాట రిఫర్ చేశాను నేను నేనైన నేను అమ్మ ప్రభావితులు భాగం 76 సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు | సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే || శ్రేయోభిలాషి, స్నేహితుడు, శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సాధువు, దురాచారి-వీళ్ళందరిపట్ల సమబుద్ధి కలిగినవాడే సర్వోత్తముడు. వాదనలలో కరకు కరవాలాలు దూసే నైజం. ప్రతిపక్షవాదనలను తుత్తినియలు చేయగల సామర్ధ్యం. ఎదుటి వారికి తేరిపారా చూస్తేగానీ దృష్టికి సరిపోని శరీర దారుఢ్యం. అయితే ఇవన్నీ కోర్టు ఆవరణకు పరిమితం. హితులకు స్నేహితులకు హితభాషి. మృదు భాషి. ఎంతటి వారినైనా సౌమ్యంగా తన వెంట నడుపుకు పోగలిగిన నైపుణ్యం వీరిసొత్తు. నమ్మిన వారికి కొంగుబంగారం నమ్మని వారికీ ప్రయోజనాలు పంచగల సహృదయుడు. అందుకే అందరితోసఖ్యం ఆయన నైజం. అందుకే న్యాయ స్థానాలవారే కాదు. ధార్మిక సంస్థలు వారికి న్యాయ కత్వం బాధ్యత లు అప్పగించటానికి ముందుకు వచ్చే వారు. ఆగ్రహావేశాలు సంయమించి సమస్యలు పరిష్కరించాల్సి వస్తే వీరికి అప్పచెప్పేవారు. వీరూ అంతే చాచచక్యంగా ఆ సమస్యలు సద్దుమణిగేలా చేసే వారు. ఇంతటి కార్యశీలి సాహిత్య సేవ చేయటం అమ్మ ను సర్వం లో చూడగలటం ఎంతో అభినందనీయం. ఆయన వ్రాసిన ఈ గేయం చూడండి "నేన నేనైన నేను -అన్ని తానైన తల్లిని ఏరీతి నర్చించు -అమ్మ ను -ఏ కరణి భజియింతునో// భక్తి భావముతోడ-సుమము లిద్దామన్న పూలన్ని తానయానే అమ్మ! పూదావి తానాయెనే వాగ్రూపమున యేవో-కైతలల్లుదామన్న అక్షరము తానాయెనే అమ్మ ! అర్ధమే తానాయెనే గో క్షీరములతోడ-సేవించుదామన్న క్షీరాబ్ది నుదయించెనే-అమ్మ! క్షీరదా తా నాయెనే ఈ తనువు-ఈ మనసు యీ చరాచరజగము తనవైన తల్లిని-తానైన అమ్మ ను,ఏ విధిని పూజింతునో//". వీరు ఏ మహాభక్తుని భక్తికి తీసిపోలేదు. ఏ మహాకవి భావపరిపక్వతకూ తీసిపోని భావపరిపుష్టి. ,ఆయన శ్రీ రావినూతల రామచంద్ర రావు గారు. ఒంగోలు లో న్యాయ వాది వృత్తి. ప్రవృత్తి లోకహితం ధార్మిక కార్యక్రమాల నిర్వహణ. పేదల న్యాయ వాదిగా పేరుపడ్డారు. కోర్టు క్లైయింట్సకు కూడా తన ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసేవారు అమ్మ బిడ్డకదా. వారు 1950 దశకం ప్రాంతాలలో హిందూ కళాశాల లో డిగ్రీ చేశారు . ఆయన తన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ తరుచూ అనేవాడు రామకృష్ణ అన్నయ్య ఆ కాలేజి లో చదువుతున్నప్పుడు తనూ ఆ కాలేజీ లోనే చదువుకున్నానని. కానీ అన్నయ్య తో పరిచయం లేదని. ఉంటే అమ్మ దర్శనం ముందే జరిగేదని. ఆ మేరకు నష్ట పోయానని. అయినా అమ్మ కరుణించింది Late better than Never అని. అమ్మ సేవ చేసుకునే భాగ్యం కలిగించి శ్రీ విశ్వజననీ పరిషత్ ,మాతృశ్రీ విద్యాపరిషత్ అధ్యక్షులను చేసింది. తన పెద్ద మనిషి తరహాతో ఆ పదవికి వన్నెతెచ్చాడు. అమ్మ కు సంతృప్తిగా సేవచేసి అమ్మ మెప్పునందుకోవటానికి అమ్మ దగ్గర కు తరలి వెళ్ళాడు 1994 సంవత్సరం లో. ఆ వెళ్ళటం ఎంత చిత్రం గా జరిగిందో చూడండి. ఆ రోజు జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మ సేవచేసుకుని,జిల్లెళ్ళమూడి లో జరిగిన ఒక అనుగ్రహ సదస్సు లో పాల్గొని ఒంగోలు వెళ్లి అమ్మ కోసం ప్రయాణం కట్టాడు. కుటుంబ రూపంలో అమ్మ సేవ కొనసాగుతూనే ఉన్నది. జయహోమాత. ---కొండముది సుబ్బారావు
@emanivenkatasatyanarayanam73556 жыл бұрын
Best of the best songs. Both in knowledge and devotion. Just hearing itself is a great pious deed.