జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి? | How Jyotirlingas were created? | Dharma Darshan Telugu

  Рет қаралды 5,310

Dharma Darshan

Dharma Darshan

Күн бұрын

జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి? | How Jyotirlingas were created? | Dharma Darshan Telugu
భూమిపై జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో పన్నెండు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నవి.
అవి సోమనాథ్లోని సోమనాథ లింగము, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి లింగము, ఉజ్జయిని లోని మహాకాల లింగము, నర్మదా నదీతీరంలోని ఓంకారేశ్వర లింగము, దేవఘర్ లోని బైద్యనాథ్ లింగము, భీమశంకరంలోని భీమశంకర్ లింగం, రామేశ్వరములోని రామనాథస్వామి లింగము, ద్వారకలో నాగేశ్వరలింగము, వారణాసిలోని విశ్వేశ్వరలింగము, త్రయంబకేశ్వరంలోని త్రయంబకేశ్వర లింగము, కేదార్నాథ్ లోని కేదారేశ్వరలింగము, శంభాజీ నగర్ లోని ఘృష్ణేశ్వర లింగము.
అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడ్డాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
బ్రహ్మ మరియు విష్ణువు ఒకనాడు కలహించుకుంటుండగా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వారి వాదులాటకుగల కారణాన్ని అడిగాడు. వారు ఇద్దరు ఎవరికీ వారు నేను గోప్ప అంటే నేను గోప్ప అని వాదించుకుంటున్నారు అని తెలుసుకున్నాడు.
ఈ వాగ్వాదానికి తెరదించాలని ముల్లోకాలను మించే విధంగా జ్యోతిని ప్రజ్వలించే లింగాకారంలో ఏర్పడ్డాడు. ఆ లింగానికి ఆది మరియు అంతం కనిపెట్టడానికి బ్రహ్మ, విష్ణు చెరొకవైపు దూసుకువెళ్లారు. అయితే బ్రహ్మ విష్ణువుల్లో ఏ ఒక్కరూ లింగాకారం మొదలు కానీ చివరలను కానీ కనుక్కోలేకపోతారు. విష్ణువు ఓటమిని నిజాయతీగా అంగీకరిస్తారు కానీ బ్రహ్మ అబద్దం ఆడుతాడు. ఇది గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపిస్తాడు.
తమ ఇద్దరికంటే ఆ పరమేశ్వరుడే గోప్ప అని గ్రహించారు బ్రహ్మ మరియు విష్ణు. ఈ జ్వాలా స్థంభ రూపం లో నిన్ను పూజించడం మాకు సాధ్యం కాదు కావున నీవు శాంతించి మా అర్చనలందుకో అని ప్రార్థిస్తారు. విష్ణు ప్రార్థనతో శాంతించిన పరమేశ్వరుడు ఆ అనంతమైన లింగస్వరూపాన్ని ఉపసంహరించుకున్నారు. మరుక్షణమే ఆ ప్రదేశంలో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఏర్పడింది. లింగోద్భవం జరిగిన ఆ సమయమే మహాశివరాత్రి పర్వదినం అయింది.
శివలింగ రూపం లో అవతరించిన పరమేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి శివనామస్మరణతో ఇంకా పంచాక్షరీ మంత్రంతో అర్చించారు బ్రహ్మ విష్ణువులు.
వారి భక్తి ప్రపప్తులకు సంతోషించిన ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్షమై వారిని అనుగ్రహించాడు.
సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివసించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతిఒక్కరు తనని పూజించడానికి వీలుగా కోట్లానుకోట్ల శివలింగాలుగా వెలిసాడు.
వీటిల్లో దాదాపుగా అన్ని ప్రతిష్టించినవే కాగా కొన్ని మాత్రమే శివుడు తనకి తానుగా స్వయంగా లింగరూపుడై వెలసినవి. వీటిల్లో అత్యంత ప్రాముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర లింగపురాణంలో వ్యాసమహర్షి వివరించారు.

Пікірлер: 15
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
భూమిపై జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికి వాటిలో పన్నెండు మాత్రమే ప్రాముఖ్యతను సంతరించుకున్నవి. అవి సోమనాథ్లోని సోమనాథ లింగము, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి లింగము, ఉజ్జయిని లోని మహాకాల లింగము, నర్మదా నదీతీరంలోని ఓంకారేశ్వర లింగము, దేవఘర్ లోని బైద్యనాథ్ లింగము, భీమశంకరంలోని భీమశంకర్ లింగం, రామేశ్వరములోని రామనాథస్వామి లింగము, ద్వారకలో నాగేశ్వరలింగము, వారణాసిలోని విశ్వేశ్వరలింగము, త్రయంబకేశ్వరంలోని త్రయంబకేశ్వర లింగము, కేదార్నాథ్ లోని కేదారేశ్వరలింగము, శంభాజీ నగర్ లోని ఘృష్ణేశ్వర లింగము. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడ్డాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రహ్మ మరియు విష్ణువు ఒకనాడు కలహించుకుంటుండగా ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి వారి వాదులాటకుగల కారణాన్ని అడిగాడు. వారు ఇద్దరు ఎవరికీ వారు నేను గోప్ప అంటే నేను గోప్ప అని వాదించుకుంటున్నారు అని తెలుసుకున్నాడు. ఈ వాగ్వాదానికి తెరదించాలని ముల్లోకాలను మించే విధంగా జ్యోతిని ప్రజ్వలించే లింగాకారంలో ఏర్పడ్డాడు. ఆ లింగానికి ఆది మరియు అంతం కనిపెట్టడానికి బ్రహ్మ, విష్ణు చెరొకవైపు దూసుకువెళ్లారు. అయితే బ్రహ్మ విష్ణువుల్లో ఏ ఒక్కరూ లింగాకారం మొదలు కానీ చివరలను కానీ కనుక్కోలేకపోతారు. విష్ణువు ఓటమిని నిజాయతీగా అంగీకరిస్తారు కానీ బ్రహ్మ అబద్దం ఆడుతాడు. ఇది గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని శపిస్తాడు. తమ ఇద్దరికంటే ఆ పరమేశ్వరుడే గోప్ప అని గ్రహించారు బ్రహ్మ మరియు విష్ణు. ఈ జ్వాలా స్థంభ రూపం లో నిన్ను పూజించడం మాకు సాధ్యం కాదు కావున నీవు శాంతించి మా అర్చనలందుకో అని ప్రార్థిస్తారు. విష్ణు ప్రార్థనతో శాంతించిన పరమేశ్వరుడు ఆ అనంతమైన లింగస్వరూపాన్ని ఉపసంహరించుకున్నారు. మరుక్షణమే ఆ ప్రదేశంలో మొట్టమొదటి జ్యోతిర్లింగం ఏర్పడింది. లింగోద్భవం జరిగిన ఆ సమయమే మహాశివరాత్రి పర్వదినం అయింది. శివలింగ రూపం లో అవతరించిన పరమేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి శివనామస్మరణతో ఇంకా పంచాక్షరీ మంత్రంతో అర్చించారు బ్రహ్మ విష్ణువులు. వారి భక్తి ప్రపప్తులకు సంతోషించిన ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్షమై వారిని అనుగ్రహించాడు. సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివసించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతిఒక్కరు తనని పూజించడానికి వీలుగా కోట్లానుకోట్ల శివలింగాలుగా వెలిసాడు. వీటిల్లో దాదాపుగా అన్ని ప్రతిష్టించినవే కాగా కొన్ని మాత్రమే శివుడు తనకి తానుగా స్వయంగా లింగరూపుడై వెలసినవి. వీటిల్లో అత్యంత ప్రాముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర లింగపురాణంలో వ్యాసమహర్షి వివరించారు.
@gopalmudhiraj7468
@gopalmudhiraj7468 8 ай бұрын
🙏🙏🙏
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
Hara Hara Mahadeva 🙏🏼 Please subscribe and support us 🙏🏼
@gangavarapuvenkateshwarlu79
@gangavarapuvenkateshwarlu79 8 ай бұрын
🌹🙏🌹🕉🕉
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
Hara Hara Mahadeva 🙏 Please subscribe and support us 🙏🏼
@shoot2kill277
@shoot2kill277 8 ай бұрын
OM NAMAHA SHIVAYA 🙏🙏🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏🙏🏼🙏
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
Please subscribe and support us 🙏
@roopasai506
@roopasai506 8 ай бұрын
Puranalu gurinchi KZbin channel lo a content kinda vasthundi.
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
Meeru adigina prasna ardham kaledhu andi...
@roopasai506
@roopasai506 8 ай бұрын
@@DharmaDarshanTelugu miru you tube lo content post chesthunaru kada avi a catagory ani aduguthunanu .ante people and blogs na .how to ani ountai kada andi vatilo puranalu .bhagavathgeetha
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
People and Blogs ye andi... Specific ga ayithe Informational and educating
@RamCharan14324
@RamCharan14324 8 ай бұрын
తెలుగు సరిగా రాదా ?
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
ఏదైనా తప్పు గమనిస్తే చెప్పండి, సరిచేసుకుంటాము.
@manuvadubbaka1425
@manuvadubbaka1425 8 ай бұрын
Miru bhraama antunnaru brahmma andi
@DharmaDarshanTelugu
@DharmaDarshanTelugu 8 ай бұрын
Tadupari videos lo sarichesukuntam andi... Teliyachesinanduku dhanyavaadalu. Subscribe cheskoni support cheyandi. 🙏🏼
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 550 М.
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,6 МЛН