Рет қаралды 690,478
Music composed by Sri Vedavyas #AnandBhattar Garu
#KALIYUGAMETULAINA #KALADUGAA_NEEKARUNA
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 70
( #కలియుగమెటులైన_కలదుగా_నీకరుణ.....)
🙏 ఓం నమో వేంకటేశాయ.🙏
అందరికీ శుభ శనివారము
✍️ --- మీ వేణుగోపాల్
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 70 కి శుభ స్వాగతం
✍️ ..మీ వేణుగోపాల్.
తర ణంబులు భవజలధికి,
హర ణంబులు దురితలతల,
కాగమముల కా
భర ణంబు, లార్తజనులకు
శర ణంబులు, నీదు దివ్య
చర ణంబు లిలన్
✍️ పోతన భాగవతము
భావం ః--
నీ దివ్య పాదపద్మ స్మరణములు సంసార సాగరమును దాటింప చేయునట్టివి.🌹
పాపములు పోగొట్టునట్టివి.🌹
వేదములకే ఆభరణములగునట్టివి.🌹
ఆర్త జనులకు శరణ్యములైనట్టివి, 🌹
ఆపదలందు ఆదుకొనునట్టివి🌹
కదా స్వామి !! 🙏
కావున నిరంతరము నీ చింతనయందు ఉండు భాగ్యమును అనుగ్రహించు నారాయణా !! 🙏🙏
అని పోతనామాత్యులు భాగవతములో ప్రార్ధించినట్లుగా , అన్నమయ్య కూడా తనకు ,
నారాయణుడైన శ్రీ వేంకటేశ్వరుడి కృప ఉంటే , ఇక మిగతావి ఎలా ఉన్నా , ఏమయినా, దిగులేలేదు అని పాడుతున్నారు , స్వామిపై భరోసాతో. 🙏
మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము. 🙏
🌺స్వామీ , ఈ కలి కాలము, ఎలా అయినా ఉండనీ,
ఎన్ని దోషములున్నా, నాకు ఏం నష్టము?
నాకు నీ చల్లని కరుణ ఉన్నది రక్షగా.🙏
ఓ కమలనయనా!! ఓ శ్రీ హరీ !!అందరికీ ప్రభువైనవాడా!! నాకు అదియే చాలును.🙏🌺
🌺నా పాపములు ఎంత ఉన్నా , నాకు చింత లేదు స్వామి. చిత్తశుధ్ధితో నీ నామ మంత్రమును పట్టుకున్నాను కదా . ఇక అవి అన్నిటినీ నీవే మాయం చేస్తావు .ఇక నాకు దిగులేల నీ నామ జపము చేస్తున్నప్పుడు. 🙏🌺
🌺నాకు ఎంత కోపము వచ్చిననూ నాకు ఆపద కలుగదుకదా, ఎందుకంటే నా మనస్సులో స్థిరముగా నిన్నే ఉంచుకున్నాను కదా . నీవే నా చెయ్యి పట్టి నన్ను శాంతపరిచి , మంచి త్రోవ నడిపించెదవు. 🙏🌺
🌺ఇక ఈ లౌకిక జీవనములో , ఈ ధరణిపై , నా ఇంద్రియములు నన్ను ఎంత వెంటాడి తరుముతున్నా, నాకేమి భయము లేదిక .ఎందుకంటే నేను నీ శరణాగతిని వేడుకున్నాను కదా.🙏🌺
🌺కర్మలు అనే తాళ్లు నన్ను చుట్టి కట్టి పడేసినా నేను తాపత్రయ పడను ,ఎందుకంటే ఆ బంధనాలను చిటికెలో త్రుంచ గల శక్తి ఉన్న నీపై , నేను సదా భక్తి భావము పెంచుకుని ఉన్నాను .నువ్వే వాటి నుంచీ నన్ను విముక్తుడను చేస్తావు .🙏🌺
🌺నేను ఇహమునా పరమునా ఏమీ కోరుకోనవసరంలేదు. నీ సంకీర్తనయే చేయుచున్న నాకు , ఎక్కడనైనా నా మంచి చెడ్దలన్నీ నీవే చూస్తావు కదా .🙏🌺
🌺 ఓ శ్రీ వేంకటేశ్వరా !! ఇక నా తపములన్నియూ ఫలియింప చేయటానికి , నాకు సన్మార్గ నిర్దేశము చేయటానికి , దిక్కుగా మీ ప్రియ సతి , కమలప్రియ అయినా మా అలమేలుమంగమ్మ అనుగ్రహం ఉన్నది కదా .ఇక నాకేంకావాలి. ఇదియే నాకు చాలు .🌺🙏
ఓం శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 70 )
✍️ -- మీ వేణుగోపాల్
ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -- 70
KALIYUGAMETULAYINAA... KALADUGAA NEE KARUNA...
🌺No Matter Where This Kali Age Is Destined,
I Have Your Grace, It is Enough,
Oh Lotus Eyed Lord !! Oh Hari !! Oh Hari !!
Oh Lord Of The Lords !!🌺🙏
🌺No Matter How Many Sins ,
I Have Accumulated,
I Obtained Your Holy Name
To Clear Off All My Sins.🌺🙏
🌺No Matter How Much Angry I am ,,
To Put It Aside And Be At Peace , You Are There To Hold Me Rightly As You Are In My Heart Always.🌺🙏
🌺No Matter In this World
How Much My Senses Chase Me Up, To Guide My Mind in The Right Path , I Have Already Sought Your Refuge.🌺🙏
🌺No Matter How ,
The Ropes Of My Karmas Fasten Me Up, To Release Me , From These Karmic Bonds
I Always Have My Devotion For You.🌺🙏
🌺To Bestow Everything In Present And Future Worlds
And To Fulfill All My Desires,
I Have Your Holy Names
To Sing And Praise Your Glory.🌺🙏
🌺Aptly At The Right Time , Oh Lord Sri Venkateswara !!
To Make My Penance For You Fruitful ,
To Show Me The Right Path ,I Have The Grace Of Your Consort KamalaDevi ( Sri Maha Lakshmi ).🌺🙏🙏
OM NAMO ALAMELUMANGA
OM NAMO VENKATESAYA
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
✍️ ---VENUGOPAL
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
🌹 సంకీర్తన 🌹👇👇
ప||
కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ |
జలజాక్ష హరిహరి సర్వేశ్వరా ||
చ||
పాప మెంత గలిగిన బరిహరించేయందుకు |
నాపాల గలదుగా నీనామము |
కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు |
చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు ||
చ||
ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను |
సరి గావగద్దుగా నీ శరణాగతి |
గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ |
నిరతి గలదుగా నీ భక్తి నాకు ||
చ||
హితమైన యిహపరా లిష్టమైనవెల్లా నియ్య |
సతమై కలదుగా నీసంకీర్తన- |
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ |
గతి గలదుగా నీకమలాదేవి ||