ఇంతమంది మీద చర్యలు తీసుకుంటాం అంతమంది మీద చర్యలు తీసుకుంటాం అనడమే గాని ఏ ఒక్కరి మీదైనా ఈ చేతగాని కూటమి ప్రభుత్వం చిన్న చర్య అయినా తీసుకుందా? తీసుకోదు, తీసుకునే దమ్ము కూడా లేదు; లేకుంటే కళ్ళ ముందే ఇన్ని రుజువులు కనబడినాగాని వారిని శిక్షించడానికి ఇంకా మీనమేషాలు లెక్క పెట్టాలా? ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు గారు తాను వీరిని శిక్షించరు, శిక్షించే దమ్మున్న పవన్ కళ్యాణ్ గారి కాళ్లకు నోటికి కళ్లెం వేస్తున్నారు. ఇలా అయితే రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసినా కూటమి ప్రభుత్వం పై ప్రజలకు నమ్మకం పోయి వచ్చే ఎన్నికల్లో మళ్ళా కష్టాల్లో పడే ప్రమాదం ఉంటుంది.