ఓ మైగాడ్, స్వాతికిరణం లో ఇవన్నీ గమనించలేదే? | Un noticed gems of Swathi kiranam | Nanduri Srinivas

  Рет қаралды 186,612

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 343
@mynamesss2188
@mynamesss2188 Жыл бұрын
నిజం గురువు గారు , కే విశ్వనాథ గారి చిత్రాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, నా చిన్నప్పుడు మా తల్లి తండ్రులు ఇలాంటి చిత్రాలే చూపించేవారు భాహుసా అదే కాబోలు ఈ ప్రస్తుత కాలంలో కూడా నేను balanced గా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను కాళిగా , వాకింగ్ లో, కార్ డ్రైవింగ్ లి లో ఇటువంటి పాటలే వింటుంటాను ఆ ఆనందమే వేరు అండి. జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@user-zc24
@user-zc24 Жыл бұрын
అన్నయ్యా నమస్కారం. చాలా బాగా చెప్పారు. అల్పుడనైన నాకు స్మార్ట్ఫోన్ వచ్చినప్పుడు నుండి వినే అనేక కొత్త పాటలతో పాటు రోజు వినే పాట "ఆనతినీయరా హరా". అప్పట్లో ఆ పాదాలకి కనీస అర్ధాలు తెలియవు, స్వరాలు అసలు తెలియవు. కానీ ఏదో తన్మయత్వం, నన్ను నేనే మరిచిపోయేవాన్ని. కాలక్రమంలో అలా అర్ధాలు స్ఫూరించి శివుడికోసం అని తెలిసింది. దాన్ని ఆ గురు, శిష్యులకు, నలుగు పిండిని వినాయకుడిని చేసిన అమ్మకు ప్రతీకగా అంత అద్భుతంగా అన్వయించారా అని రొమాంచితం అయింది. తర్వాత తర్వాత మిగతా పాటలు, వాటి సాహిత్యంలో ఎన్ని ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయో అవగతమవుతున్నాయి..... కళాతపస్వి విశ్వనాథ్ గారికి, జ్ఞానపీఠ్ సినారె గారికి, kv మహదేవన్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, వాణి జయరాం గారికి, మీకు పాదాభివందనం 🙇
@99913o
@99913o Жыл бұрын
మీరు ఎలాంటి మంచి సినిమాలూ,వాటి అర్ధాలు చెప్పి ఉండకపోతే నా జీవితం తెల్సుకోలేక పోయేవాళ్లం .ఇంత మంచి విలువయిన మాటలు మాకు చెప్పినందుకు మీకు సాథ కోటి దాన్యవాదాలు😢💐💐💐💐💐🙏🙏☺️
@padmakrishna1710
@padmakrishna1710 Жыл бұрын
ఈ సినిమా ఎన్ని సార్లు చూసామో లెక్క లేదు.అలాగే ఈ శ్లోకం అన్నే సార్లు చూసం,విన్నాం.ఆ పిల్లాడు అచ్చు గుద్దినట్టు మా పెద్దన్నయ్య లానే ఉంటాడు.👏👏👏👌👌👌🙏🙏🙏🙏
@shyamalaravada
@shyamalaravada Жыл бұрын
అధ్బుతమైన విశ్లేషణ చేసారు.. చాలా మంచి సినిమా... ఈవిధంగా నైనా.. విశ్వనాథ్ గారిని..మీ తండ్రి గారిని తలచుకుని..మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు..🙏🙏🙏
@rajaninarla9600
@rajaninarla9600 Жыл бұрын
video చివరికి వచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయ్ గురువుగారు 🙏🙏🙏
@prdy6871
@prdy6871 3 ай бұрын
నమస్తే సార్ మీరు వీడియో చివర్లో చెప్పినది నాకు నిజంగా జరిగింది. నేను వీణ నేర్చుకుతున్నప్పుడు ఈ సినిమా విడుదల అయింది. మా గురువుగారు ఆ సినిమా చూసి నాతో ఆ గురువు శిష్యునితో ఆలా చేసాడు కానీ నేను నీతో ఆలా చేయను అన్నారు. అప్పుడు నాకు అర్ధం కాలేదు కానీ ఇప్పుడు నాకు అది ఒక అద్భుతంగా అనిపిస్తుంది ఉంటుంది.
@gayatrigayathri9622
@gayatrigayathri9622 Жыл бұрын
I am a teacher, used to sing this slokam in Jyothi prajwalanam time many times I sang (in our school) thankyou Sreenivas garu
@nsatya7556
@nsatya7556 Жыл бұрын
దసరా నవరాత్రులు 5వరోజు మహా చండీ దేవి అలంకారం తో దర్శనం నవదుర్గల ఆలయం దక్షిణ భారత దేశంలో ఏకైక ఆలయం - పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి లో ఉంది . నవదర్గా పరివార సమేతంగా - శ్రీ నవదుర్గ , శ్రీ చక్ర సహిత శ్రీ కనకదుర్గా అమ్మవార్ల ఆలయం ఉంది . విజయదశమి రోజున రధోత్సవం కన్నుల పండుగగా జరుపుకుంటారు 🙏.
@tvmadhaviadhikary4117
@tvmadhaviadhikary4117 Жыл бұрын
భలే బాగా చెప్పారు సర్..నేను కూడా only విశ్వనాథ్ గారి సినిమాలు మాత్రం చూసేదాన్ని.. ఏమి directions, స్టోరీస్...ఇంకా ఆయన సఖం అయిపోయింది..నిజంగా..
@suryaprabhakethanapalli4811
@suryaprabhakethanapalli4811 Жыл бұрын
చాలా బాగా వివరించి చేపారు గురువుగారు. Dr. విశ్వనాథగారి లాంటి వారు మళ్ళీ పుట్టారు. మహానుభావుడు 🙏
@laxmisrinivas7424
@laxmisrinivas7424 Жыл бұрын
ధన్యవాదం బాగా చేపారు ఇది నిజంగా society ki మంచిది 🙏
@bhaskarvd1570
@bhaskarvd1570 Жыл бұрын
ప్రతి పాట అమృతా ధార గురువు, గారు🙏🙏🙏🙏🙏
@vmadhavipasupulati280
@vmadhavipasupulati280 Жыл бұрын
You will not believe me Sir, just yesterday I was discussing the same with my husband. Very happy to watch this video. This means a lot to us. Thank you.
@kirankumar5034
@kirankumar5034 Жыл бұрын
శ్రీ మాత్రే నమః ఈ సినిమా లో అమ్మవారి కరుణ కటాక్షం వల్ల సంగీతం లో ఎంతో ఉన్నత స్థాయి కి వెళ్ళాడు ఆ బాలుడు నాకైతే గురుచరిత్ర లో బట్టలు ఉతికే అతన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరు జన్మలో రాజు అయినట్లు ఈ బాలుడు కూడా అమ్మవారి పదాలు దగ్గరికి చేరుకొని ఉంటడేమె
@user-lt9fl8xf8j
@user-lt9fl8xf8j Жыл бұрын
మంజునాధ్ నటించిన మాల్గుడి డేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
@vishalikovuri
@vishalikovuri Жыл бұрын
C narayan reddy gaaru rasina sruthi neevu, shivani song assalu super sir paata gurichi cheparu direction gurinchi chepparu rasina writer gurinchi sarigga chepaledentandi
@sujatha3953
@sujatha3953 Жыл бұрын
Guruvugaariki పాదాభివందనాలు. చాలా చాలా మంచి సినిమా.నేను కూడా ఎన్నోసార్లు చూసాను బాగా నచ్చుద్ది.శ్రీ మాత్రే నమః
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 Жыл бұрын
ఈ శ్లోకం కోసం నేను ఎంతో శ్రమ పడి వెదికాను. అదికూడా స్వాతికిరణం ప్లే లిస్ట్ లో దొరకలేదు. ఆ అమ్మవారి అనుగ్రహంతో ఈ రోజు మీలాంటి పుణ్యాత్ముల కృప వలన దొరికింది . చాలా సంతోషిస్తున్నాను.
@Gani2S
@Gani2S Жыл бұрын
మీ వీడియోలు మాకు లభించడం నిజంగా మా పూర్వ జన్మ సుకృతం. ధన్యవాదాలు గురువు గారు. మీ నాన్న గారి లాగానే మా నాన్న గారు కూడా మాకు ఎన్నో నైతిక విలువలను నేర్పారు. నేను కూడా మా నాన్న గారి గురించి ఈ రోజు మా చిన్న నాటి గురువు గారితో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నాను. శ్రీ మాత్రే నమః 💐💐💐🙏🙏🙏 జై సీతారామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
@veereshamlekkala1117
@veereshamlekkala1117 Жыл бұрын
గురువు గారు మీ లాంటి వారు దొరకడం మా అందరి అదృష్టం..
@HELLTRUTHS
@HELLTRUTHS Жыл бұрын
మన నోటితో మంత్రాలు పలుక కూడదు మంత్రం జపించే ముందు శుద్ది చేసుకోవాలి అని విన్నాను దానినే ముఖ శోధన అంటారు అని, దయచేసి ముఖ శోధన మంత్రం తెలియ చేయండి...
@nithyaanil5963
@nithyaanil5963 Жыл бұрын
Me నాన్నగారిని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది.గురువుగారు.
@sampathnarayanan5250
@sampathnarayanan5250 Жыл бұрын
now i understand the scenes after your explanation, its hard for ordinary brains like mine to even analyze this kind of hidden information in a movie. Hats off to you.
@Narasimha.targetCgl2024.
@Narasimha.targetCgl2024. Жыл бұрын
🙏🙏🙏na 21 years lo oka 20 times aina chusi vunta e cinema evey kadu all sri k viswanath gari movies anni sarlu chusanoo..am cinemas sir meeru cheppina anni vishayalu ne cinema chusinapudu naku baga manasuloki vellai evanni normal people ki ardam ayyela avarina chepitey bagunnu pedda vallu ani anipinchedi e cinemas chusi nenu kalla neru pettukuntaa antha leenam avutha e movies lo sankarabharanam kosam chaganti garu adbutangaa chepparu ippudu swatikiranam mee noti nundi...truley antha knowledge vunda viswanath gari movies lo okko scene oka jeeavitanney marchagaladu antha gnanam oka 21 years boy ga ne evi chepitey antha nuvvu musalodivi ra babu patakalam manishivi antaru ..manasu petti chustey manishini anti total society ni marchagala cinemas evi..am movies grateful to our sri k viswanath garu..mana adrustam manam antha punyam chesi vuntamoo e movies telugu lo teesaru sri k viswanath garu..i am totally connected with these movies ne anni moral values antha cultural values antha sahityam antha bhakthi antha respect mana culture patla pergindoo e movies valla na life pi na mind set pi antho effect chupinchai e movies ne lifelong e values e culture continue chesta future lo na pillalaki e movies chupista vallaki a values anni nerpistha oka cinema jeevithanney marchestundi..🔥 i am very proud to be a sri k viswanath movie fan not a fan he is a guru and he teaches us with cinemas and our his sishyas...idantha ma nanamma chinnapati nundi e movies chupinchi pecharu mammalini... amey present matho lekapovachu she is a illiterate but she teaches us values with these cinemas not olny sri k viswanath movies she saw us all black and white cinemas and explains us those scenes which helps to our life and how to strong in difficult situations in our life with cinema scenes..idantha ippudu alochistey antha vichitranga vundo anti nanamma cinemas dwara intha nerpinda ani..ila anni movies prati scene vishlashinchey alavatu aindi chinnapatti nundi..nijanaga sri k viswanath gari movies chustu notes narstey adi oka life ki sarpada knowledge ivvagala book avvudi ...anto nanduri garu me matalu vini agaleka na abhiprayam cheppa idi mee varaku cherutundo ledo telidu 😅...lastly i request all the parents meeru pillalalanu valla grandparents nundi duram cheyakandi vallu mottam jeevitanni chadivesi vuntaru vallu chadastamtho kadu valla anubhavam tho matladataru vallu pillalani strong cheyagalaru alanti situation aina adurkoney strength ivvagalaru so vallani variki duram cheyakandi..🙏
@sangeethaatmakuri6868
@sangeethaatmakuri6868 Жыл бұрын
చాల ధన్యులం మేము మీ సంతోషాన్ని మీ దుఃఖన్ని మాకు చెప్పారు ❤
@prekha4914
@prekha4914 Жыл бұрын
Need to release Vishwanath gari movies in theatres,we will take our children
@jaswanthdasari7799
@jaswanthdasari7799 Жыл бұрын
Sruthi neevu gathi neevu song and sangeetha sahitya samalankrithe two beautiful songs dedicated to goddess Saraswati Devi in this movie
@applecherry364
@applecherry364 Жыл бұрын
ఈ సినిమా లో తొలి పొద్దు పొడిచింది తలుపు తీయరా ప్రభు అనేపాట నాకు చాలా ఇష్టం
@smedisetti
@smedisetti Жыл бұрын
Nanduri Srinivas garu in this video climax especially when you said you father now became photo on a wall I got tear in my eyes. My humble pranamams to you and your father. 🙏🏻
@sravanthivadallamudi4054
@sravanthivadallamudi4054 Жыл бұрын
Namaste Guruvugaru....నాకు మీ నాన్న గారి ఫొటొ చూడగానే మీ పాప కి ఆయన పోలికలు బాగా ఉన్నాయు అనిపించింది....
@sailajars4862
@sailajars4862 Жыл бұрын
Mee video kooda aa cinema antha abhutham ga anipinchindi guruvu garu..... Chivarlo naaku kooda kanneellu kaaripoyayi..... Meeru dhanyulu......mee lanti guruvulu dorikina memu kooda dhanyulam.....🙏🏻 Srimathre Namaha 🙏🏻🙏🏻🙏🏻
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమహా 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@aadhyaANR
@aadhyaANR Жыл бұрын
Ma amma kuda baga chusevaru e movies appudu maku chudali anipicha ledhu kani mi videos chusaka nenu malli e movies chusa andi mi valla ma jivithalu chala marai andi miku koti vandhanalu 🙏🙏🙏
@karvimanasam
@karvimanasam Жыл бұрын
Mi nannagaru Anna maata akshara satyam....అనుభవించిన వారికి తెలుస్తుంది ఈ నిజం.. ఆ మాట neraverali అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను
@whencat4705
@whencat4705 Жыл бұрын
Viswanath gari cinemalu chala chala progressive andi.. swarnakamalam lo oka poor ghanapati pension kosam veltey ayyani oka officer vedhava helana chese scene mana samajaniki addam pattindi...asala saptapadi lo heroine husband ki tana bharya lo ammavaru kanapadatam kaniyyandi ...ila comment chestey oka 1000 lines aitadi yendaro mahanu bhavulu andariki vandanalu
@ahainfinitejoy
@ahainfinitejoy Жыл бұрын
One can be wondered by this pay off which implies the greatness of K.Vishwanath sir's direction: 1:08:10; in this movie at this duration the temple shown was the temple in kanchi. That means in this movie gangaadharam family is residing at kanchi. 2:10:08; lyrics of jaligaa jaabilamma-"Kanchikellipoyeve Kathalanni..." as per story also gangaadharam is saying that -"Don't worry amma! I will go back to my place". Also there is a deep inner meaning as per gangaadharam lines which convey the sense -"my life story will also be ended. Don't worry Amma!". Because there is a saying in Telugu -"Katha Kanchiki.Manam intiki", which convey a philosophical truth that every story will be ended at Kanchi,the divine place where all dieties exist because God is the ultimate destination of everyone's life, so kanchi is the ultimate destination of every story.
@krishnapriya859
@krishnapriya859 Жыл бұрын
మీరు మీ నాన్న గారి గురించి చెప్తుంటె మాకు కళ్ళ నీళ్లు వస్తున్నాయి.
@PavanDBAhere
@PavanDBAhere Жыл бұрын
ee cinema enno sarlu chusa kani, ee roju mee video tho inkoka konam lo alochimpachese laga chepparu Guruvu garu. mee padalaki satha koti vandanaalu 🙏
@padmalathaj6066
@padmalathaj6066 Жыл бұрын
Guruvu garu🙏 ee video chusunte 2 cinemala anubhutu malli kalpincharu 😅 😭😭 Parents memories manaku tudivaru Untai . SriVishnuroopaya namah Sivaya 🙏🙏
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 Жыл бұрын
E cinema nenu e madye chusanu anta goppa cinema chudatam meru inka ah cinema goppatanam cheptam chala anandam ga undi andi ,,thanks andi 😊😊
@TimK-m9r
@TimK-m9r Жыл бұрын
Very nostalgic experience in life with your father. Great movie
@kanakalakshmithulugu3239
@kanakalakshmithulugu3239 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే 🙏🙏🙏
@ParamacharyuniVaibhavam
@ParamacharyuniVaibhavam Жыл бұрын
ee slokam nannu chala akarshinchedi, bala untundi... idhe kadu konni movies lo titles mundu puja lo vache slokam chala baguntai... anduloo okati jayam subhadam devi, srichakra stitaam varaam ane untundi slokam....
@karukollavasu6250
@karukollavasu6250 Жыл бұрын
సూపర్ మూవీ స్వామి బట్ one సాంగ్ జాలిగా జాబిలమ్మ రై రై యంత రేప
@muniswamacharyn8133
@muniswamacharyn8133 Жыл бұрын
Guruvagariki pranamamalu🙏 Viswanathgari cinemalu oka viswavidhya nilayam! Gurthuchesi sanniveshalutho patu sangitharthamulu vivarinchinanduku danyosmi.Because of ur father u have scaled to spiritual heights!
@sadanandamkandukuri1972
@sadanandamkandukuri1972 Жыл бұрын
ఈ సినిమా ఎన్నోసార్లు చూశాం గురువుగారు. పరవశించా.. మీరు చెప్తుంటే ఇంకా ఆనందంగా ఉంది
@chinnanaresh206
@chinnanaresh206 Жыл бұрын
మీ ఈ వీడియో చూసిన తర్వాత మూవీ మొదటి సారి చూశాను నా కంటి నుండి కన్నీరు కారుతూనే ఉంది గంగాధర్ చనిపోయిన తర్వాత. రాధిక గారు పాత్రలో జీవించారు మమ్ముట్టి గారు పాత్రలో జీవించారు. కళాతపస్వి కే విశ్వనాధ్ గారికే సాధ్యం ఈలాంటి మూవీ డైరెక్ట్ చేయడం
@dedeepyarudravaram2224
@dedeepyarudravaram2224 Жыл бұрын
శివాని, భవాని, శర్వాణి అనే పాట గురువు గారికి నచ్చినా ,, అహంతో ఒప్పుకోకుండా అదే పాటను స్టేజ్ పైన పాడి మెప్పు పొంది కూడా శిష్యుని విద్వత్తుని సహించకపోవటమా...గరువుగారూ...🙏🙏🙏
@Speakingheart7
@Speakingheart7 Жыл бұрын
Emaindi Deni gurinchi cheptunaru detailed ga cheppandi what happened evarni antunaru
@k.lakshmi1711
@k.lakshmi1711 Жыл бұрын
guruvugaru gariki 🙏🙏🙏🙏 Dasara subhakankshalu💐💐💐💐🌺. maa husband vaalla grand father valla modayi bharya ki puttina koduku ki puttina chinna koduku ante second chani poyi 3 weks kaavastundi maaku emmanna mailu leka antu untunda , memu Pooja chesukovacha Leda ??? memu gudiki vellavacha,???? Navaratullu ayipotunnayi ....waiting for your answer pl reply
@vedalamahalakshmi5161
@vedalamahalakshmi5161 Жыл бұрын
😊
@vedalamahalakshmi5161
@vedalamahalakshmi5161 Жыл бұрын
🙏
@kameswarigudimetla1935
@kameswarigudimetla1935 Жыл бұрын
ఈ సినిమాలో ప్రతిపాటా ఒక అద్భుతం
@gouravaramchayadevi9196
@gouravaramchayadevi9196 Жыл бұрын
Chaalaa baaga chepparu Srinivas garu
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
Nice info sir Culcutta కాళీ మాత స్థల పురాణం అసలు టెంపుల్ ఎందుకు famous video cheyandi
@ammuludailyvideos1043
@ammuludailyvideos1043 Жыл бұрын
గురువూ గారూ నమస్కారం... మా ఇంటి దగ్గర దుర్గమ్మ నీ పెట్టారు. మా పాప 11th month మా పాప కి కుమారి పూజ చేశారు. మీరు 2 to 10 years లోపు పిల్లలకీ చేయాలి అని చెప్పారు. మరీ మా పాప కి 11th month లోనే చేశారు... గురువూ గారూ plzzzzzz దయచేసి reply ఇవ్వండి....e comment evvarina chusina teliste చెప్పండీ 🙏🙏🙏
@vasanthik4121
@vasanthik4121 Жыл бұрын
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమః 🌺🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺🌺
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤
@anuradhapusapati5455
@anuradhapusapati5455 Жыл бұрын
Jai Saraswathi Mata 🙏🏻🙏🏻🙏🏻 excellent video thanks for sharing Guruvugariki Padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻
@devarasettykrishnapriya2477
@devarasettykrishnapriya2477 Жыл бұрын
Guruvu gaaru, chaala baaga chepparu . Meeru ‘Shruthi shruthi’ dialogue chaala proper ga imitate chesaru… 😊
@manchalamuralikrishna-oy8dh
@manchalamuralikrishna-oy8dh Жыл бұрын
----- ॐ ----- ANR, Anjali Devi - Jayaberi Movie శుక్లాం బ్రహ్మ-విచార-సార-పరమామ్ ఆద్యాం జగద్-వ్యాపినీం వీణాపుస్తకధారిణీం అభయదాం జాద్ద్యా-అంధకారా-అపహామ్ | హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధి-ప్రదాం శారదామ్ ॥
@manchalamuralikrishna-oy8dh
@manchalamuralikrishna-oy8dh Жыл бұрын
Hello
@padmaneti6799
@padmaneti6799 Жыл бұрын
Beautiful interpretation andi 🙏
@lalithakameswari66
@lalithakameswari66 Жыл бұрын
Cannot forget those movies..every scene I remember..songs are superb
@raki9827
@raki9827 Жыл бұрын
Thank you very Swamy for Slokam and lots of insights. Thanks a lot. 🙏🙏🙏
@talaripavani1991
@talaripavani1991 Жыл бұрын
గురువు గారికి నా నమస్కారములు 🙏🙏 గురువు గారు నాకు ఒక్క సందేహం దేవి నవరాత్రుల సమయంలో yevaraina kaalam cheste yetuvanti phalitham untundhi, Dayachesi na sandehanni vivarinchagalarani prarthana శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏
@monikavenigalla8114
@monikavenigalla8114 Жыл бұрын
Its my favourite one from years😊😊😊.Nenu b tech lo miss avvakunda nerchukuni gudi lo kuda padanu guruvu garu,akkada peddavaru vini chala santhoshincharu.even my friends liked it alot.
@sreegvalli5982
@sreegvalli5982 Жыл бұрын
Sree pada Rajam saranam prapadye....meeru cheppina prati maata okko animutyam...nenu first chusina k viswanath gari movie swathi kiranam....ee movie naku tega nachesindi....ee movie lo telimanchu kuriaindi ane song kosam chudanu...movie aipoyaka okate edchanu...prati pata oka animutyam....adbutamaina sahityam....
@pavankumarjvvs4653
@pavankumarjvvs4653 Жыл бұрын
శ్రీ రంగం టెంపుల్ గురించి చే పెట్టండి గురువు గారు
@luckyiyengar3973
@luckyiyengar3973 Жыл бұрын
Sruti neevu gati neevu ee naa kruti neevu bharati saranagati neevu bharati
@DurgaPrasad-ms5ms
@DurgaPrasad-ms5ms Жыл бұрын
గురువు గారు స్వాతి కిరణం సినిమా అంటే కళాతపస్వి కె విశ్వనాథ్ గారు కెవి మహదేవన్ గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు శ్రీమతి వాణీ జయరాం గారు కూడా తన గాత్రంతో ప్రాణం పోశారు ఆనతినీయరా హరా.... అనే పాట అందుకు ఉదాహరణ
@vprasannakumari730
@vprasannakumari730 Жыл бұрын
Ee cinema ante naaku chala ishtam guruvu garu ee paata chala sarlu vinnanu ,ardam maatram meru cheppake telisindi 🙏🙏🙏.
@sumathicirivelu7794
@sumathicirivelu7794 Жыл бұрын
Chala amogham ga chepparu viswanath gari gurinchi guriji kallallo nillu thirigay Sri mathre namaha
@vijayachirravuri1686
@vijayachirravuri1686 Жыл бұрын
🙏🙏ఓం శ్రీ మాత్రే నమః🙏🙏
@శ్రీచాగంటి-య3య
@శ్రీచాగంటి-య3య Жыл бұрын
గురువుగారు కి పాదాభివందనం 🙏🙏🙏
@ederamanamma8683
@ederamanamma8683 Жыл бұрын
🙏 swamy . Na manassu spandana Mee video dwara vinnatlu undi swamy .
@durgapavani7167
@durgapavani7167 Жыл бұрын
Excellent narration guruvu garu
@revathialuri774
@revathialuri774 Жыл бұрын
Adbhutam Guruvugaru Mee vyakyanam. Meeku krutagnatalu.
@hemalatha927
@hemalatha927 Жыл бұрын
Sir. Mee paadhalaku namaskaram. Goosebumps only n nothing else. Hope God gives me the strength to take care of my parents n in-laws.
@Teatysweety2022
@Teatysweety2022 Жыл бұрын
Nijam guruvugaru amma nanna leni lotu thiranidhi naku ma thammudiki 22, 25 yrs ki ah badha kaligindhi😢we miss them a lot
@ramakrishna5814
@ramakrishna5814 Жыл бұрын
Shree Gurubhyo Namah.... Meeru... Maaku.... Dorikina.... aanimuthyam.... ❤❤❤❤❤.... Shri Maathre Namah....
@muralidharreddyb8227
@muralidharreddyb8227 Жыл бұрын
Sruthi nevu gathi nevu keertana kuda entho bhakthibhavana kalugutundi...🙏🙏🙏
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
K vishwananth gaaru laa Nanduri gaaru kooda trend setter..tourch bearer Please upload more more traditional సాహిత్యం వున్న song ki meanings upload cheyandi Senior n t rama rao gaaru kanna mundu film songs ki kooda meaning cheppandi great lyrics ...atleast Mee wife channel lo upload cheyandi
@venugaddalavlogs6691
@venugaddalavlogs6691 Жыл бұрын
సినారె (నారాయణ రెడ్డి) గారు.. మా తెలంగాణ లో అదీ.. మా కరీంనగర్ లో పుట్టడం మా అదృష్టం... తాను కాలం చేసినపుడు మన ఆంధ్ర మీడియా కనీసం తాను తెలంగాణ వారు అని కరీంనగర్ కు చెందిన వారని కూడా చెప్పలేదు...చెప్పడానికి ఏదో వెత్యసం చూపించారు...ఇందుకు కదా...మేము ప్రత్యేక రాష్ట్రం కోరుకుంది అనిపిస్తుంది...అప్పట్లో కనీసం మా ఊరి పేర్లు కూడా టీవీలో రకపోవు...అంతెందుకు...కనీసం వాతావరణ న్యూస్ కూడా తెలంగాణ కు సంబంధించి చెప్పక పోవు.... అప్పుడప్పుడు అనిపిస్తుంది.... ఇలా... థాంక్యూ గురు గారు సినారె గారిని గుర్తు చేసినందుకు
@shobhap127
@shobhap127 Жыл бұрын
Adbhutam guruvu garu
@jaiveer9438
@jaiveer9438 Жыл бұрын
Guruvu garu Lalita Sahasranamaniki ardham cheppandi
@samyukthagatla
@samyukthagatla Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
@MNVSPR
@MNVSPR Жыл бұрын
గురువు గారు మీ విశ్లేషణ 👏👏🙏🙏
@SankarMahadevan-iv2gm
@SankarMahadevan-iv2gm Ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి
@SrishakthiBharatavarsha
@SrishakthiBharatavarsha Жыл бұрын
Meeto paatu maaku kuda okkasari aa mahaniyudini thaluchukune adhrustam kaliginchi nanduku, krutagnulam.Srimathre namaha🙏🙏🙏
@rajeshgupta-rr7fz
@rajeshgupta-rr7fz Жыл бұрын
You are simply superb Guruvu Garu 🙏🙏
@venkatsaikushwanthp5455
@venkatsaikushwanthp5455 Жыл бұрын
Sri matre namaha🙏🙏🙏guruvugaru
@sarithagantyada8393
@sarithagantyada8393 Жыл бұрын
Swamy naku ee cinema inka patalu kuda chala ishtam swamy enni sarlu tv lo vachina chustanu
@Nagaprudhvi999
@Nagaprudhvi999 Жыл бұрын
What an analysis 🙏🏻🙏🏻
@sanjaykarthik2793
@sanjaykarthik2793 Жыл бұрын
Vaishnavi, bhargavi, vaagdevi kuda andaru vinandi, super meaning untundi
@thatmathnerdteachesphysics5180
@thatmathnerdteachesphysics5180 Жыл бұрын
గురువుగారు దక్షిణామూర్తి స్తోత్రం పై వీడియో చెయ్యండి..🙏
@lovarajuayinaparti1062
@lovarajuayinaparti1062 Жыл бұрын
అవును గురువు గారు దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం మామీద దయతో చేయగలరు , ఓం నమో అరుణాచల శివ
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 sree mathre namaha 🙏🙏🙏 sree gurubhoyo namaha
@vijayakadali9786
@vijayakadali9786 Жыл бұрын
ఎక్సలెంట్ వీడియో నండూరి గారు
@akhilbhavani8364
@akhilbhavani8364 Жыл бұрын
guruvu garu ki na padhabivandanalu🙏🏻🙏🏻
@nalinikrishna6374
@nalinikrishna6374 Жыл бұрын
Vaishnavi,Bhargavi,vagdevi,tripurambikey,vindhyavilasi varahi trigunathmikey,Etc mampahi mahaniye mantramikey mampahi matangi mayathmikey ee song vintey Ney oka santosham daniki related Ani anukuntunam guruvu garu
@venuvempati8876
@venuvempati8876 Жыл бұрын
మీరు పొరబడుతున్నారు. ఆనతినీయరా పాటకు జాతీయ అవార్డు వచ్చింది అండీ, వాణీ జయరాం గారికి.
@Shyamazha
@Shyamazha Жыл бұрын
Nanduri garu 🙏 This is related to activation of Sushumna naadi and 7 chakaras. It also describes everything in a very sequential manner. As and when the athman enlightens like a thousand suns, the cool moon in the 1st chakra will get activated and then there is the sequential growth and final attainment of the amalgam of the 3 shaktis, to become sivashakthaikyam.
@seethamahalakshmikakani2382
@seethamahalakshmikakani2382 Жыл бұрын
K విశ్వనాథ్ గారి సినిమాలన్నిట్లో శంకరాభరణం తల అయితే...స్వాతికిరణం తలమానికం.
@satyamahi953
@satyamahi953 Жыл бұрын
Aanimuthyaalu laati maatalu chepparu
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 21 МЛН
Из какого города смотришь? 😃
00:34
МЯТНАЯ ФАНТА
Рет қаралды 2,6 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 36 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 32 МЛН
Vishnu sahasranamam by M S subba laxmi || Vishnu sahasranama Full
30:03
Bhakti paatalu
Рет қаралды 1,3 МЛН
Swathi Kiranam Telugu Movie Full Songs ♫ jukebox ♫ Mammutty,Radhika
51:11
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 21 МЛН