No video

#mallemkonda

  Рет қаралды 13,191

Ontari Yatrikudu

Ontari Yatrikudu

Күн бұрын

దట్టమైన అటవీ ప్రాంతం… పక్షుల కిలకిలారావాలు… జలపాతాల గలగల ధ్వనులు … ఆ అరణ్యంలోని చెట్టుపుట్టగుట్ట అన్నీ శివనామస్మరణ చేస్తున్నట్లుగా భాసిస్తుంది… అణువణువూ ఆ మహాశివుని దివ్యస్వరూపంగానే దర్శనమిస్తుంది. ఈ గిరి శిఖరం పూలమాల ఆకారంలో ఉండటం విశేషం. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని పేరు. ఈ శిఖరం మీద కాశీవిశ్వనాథుడు, మల్లెం కొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి. ఆలయం నుంచి మరో 4 కిలోమీటర్లు నడిచి వెళితే… రామసరి జలపాతం మార్గాయాసాన్ని మర్చిపోయేలా చేస్తుంది.
మరో మకర జ్యోతి లా కనిపించే మల్లెం కొండ:
కడప జిల్లా గోపవరం దగ్గర ఆహ్లాదమైన ప్రక్రుతి మధ్య మల్లెం కొండ ఉంది .కార్తీక మాసం లో ప్రతి రోజు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొండల మధ్య చరియ లో ‘’తేజో వంత మైన కాంతి ‘’కనిపించటం విశేషం .ఈచరియ లో ముడి రసాయన పదార్ధం ఏదో ఉండి ఉంటుందని దానిపై సూర్య కిరణాలు పడినప్పుడు ఈ కాంతి వస్తుందని భావిస్తున్నారు .ఇక్కడి స్వామిమల్లీశ్వరుడి నే మల్లయ్య అంటారు .స్వామిని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు స్తానిక కధనం . మల్ల య్య కొండ గా పిలువబడి ఇప్పుడు మల్లెం కొండ అయింది .
కాకులు కనిపించని కానలు:
సాధారణంగా అడవుల్లో జంతువులు, క్రూరమృగాలు, పక్షులు నివసిస్తాయి. కాని ఈ ప్రాంతంలో మాత్రం కాకి కాని, పులి కాని కనిపించదు. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఏపి చెట్లు కూడా కనిపించవు. ఇందుకు సంబంధించిన స్థానిక కథనం ఇలా ఉంది… కొండమీద వెలసిన శివుడు, మల్లెం కొండయ్య, అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామపెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట.
అంతవరకు మొండి గోడల మధ్యన కొలువుతీరిన ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా, పైకప్పు నిర్మాణం ప్రారంభించారు. అయితే, పై కప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోతుండటంతో ఇది ఎలా జరుగుతోందో తెలుసుకుందామని కాపు కాశారట. అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది. దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని, ఏపి చెట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట. తాను మల్లెం కొండేశ్వరుడినని, తనకు కానీ ఇక్కడున్న శివుడికి కానీ ఆలయానికి పై కప్పు వేయరాదని చెప్పాడట. అంతేకాకుండా తనను కట్టి వేయడానికి సహకరించిన ఏపి చెట్లు ఈ అడవుల్లో కనిపించకూడదని శపించాడట. మల్లెం కొండయ్యను బంధించినప్పుడు ఓ కాకి ఆయన కళ్లను పొడవబోయిందట. దాంతో ఆ అరణ్యంలో కాకి కానరాకూడదని శపించాడట.
పులి కనిపించని అడవి:
ఈ పర్వత ప్రాంతంలో నివసించే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకోవడానికి అడవికి వచ్చేవాడట. అక్కడ సంచరించే పులులు అదను చూసి గోవులపై దాడి చేశాయట. ఆ గిరిజనుడు శివునితో తన గోడు చెప్పుకున్నాడట. శివుడు ఈ అరణ్యంలో పులులు సంచరించరాదని ఆఙ్ఞాపించాడట. అందుకే ఈ అరణ్యంలో నేటికీ పులి కనిపించదు.
రాముడు సైతం…
శ్రీరామచంద్రుడు రావణసంహారం అనంతరం సీతతో కలసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడట. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండిపోయాడట. అప్పుడే మల్లెంకొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. ఈ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లోనూ నీటి గుండాలను ఏర్పాటు చేశారట.
కొండమీద మల్లెంకొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే 5 కిలోమీటర్లు దట్టమైన అటవీప్రాంతంలో కొండకోనలు దాటుకుంటూ వెళ్లాలి. కాలినడక తప్ప మరో మార్గం లేదు. దాంతో సంవత్సరంలో ఒక్కశివరాత్రి రోజే.. భక్తులు ఈ ఆలయానికి వెళ్లేవారట. దశాబ్దం క్రితం సుబ్బారాజు గారు ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి, తాగునీరు, సోలార్‌లైట్లు, వంటసామగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతివారం వెళుతున్నారు. కార్తీక పౌర్ణమి కి మూడు రోజులపాటు ఉ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు.
ఎలా వెళ్లాలంటే…
నెల్లూరు-కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. కడప జిల్లా బద్వేల్‌ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి కొండకు నడిచి వెళ్లాలి. కడప నుంచి బద్వేల్‌కు, బద్వేల్‌ నుంచి బ్రాహ్మణపల్లెకు బస్సు సౌకర్యం ఉంది. కడప నుంచి 60 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి బద్వేల్‌ వెళ్లే బస్సులో పి.పి.కుంట వరకు వెళ్లి, అక్కడ నుంచి బ్రాహ్మణపల్లెకు మరో బస్సులో వెళ్లాలి. పి.పి.కుంట నుండి మల్లెంకొండ దిగువ వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.

Пікірлер: 54
@telugubudgettraveller
@telugubudgettraveller Жыл бұрын
నవల చదువుతున్న అనుభూతి వుంటుంది మీ వీడియో చూస్తుంటే...మీ నేరేషన్..అద్బుతం...మీతో ఒక్క సారి అయినా ట్రెక్ చేయాలని వుంది.
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
sure brother
@user-xl6od8re3p
@user-xl6od8re3p Жыл бұрын
ఓం నమ: శివాయ 🙏🙏
@pssastri5696
@pssastri5696 Ай бұрын
Good
@Sha.Goud9
@Sha.Goud9 Жыл бұрын
Climate కు తగినట్టు సెలవు రోజు వీడియో పెట్టినందుకు థాంక్స్ అన్న.. అందమైన ప్రకృతిలాగే అందమైన వీడియో పెట్టినవ్.. ❤️from bhagyanagar
@macnx3637
@macnx3637 9 ай бұрын
Your life dhanyam bro...I also want to see the forests like this...
@user-fn3kv4fh6u
@user-fn3kv4fh6u Жыл бұрын
Very Beautiful. But Tack care.
@sunusunu4683
@sunusunu4683 Жыл бұрын
ఓం నమశ్శివాయ అద్భుతం అన్న
@gopithageeru9256
@gopithageeru9256 Жыл бұрын
Super video's bro manchi location
@macnx3637
@macnx3637 Жыл бұрын
Janma lo gurtundipoye experiences bro meevi...Naku elantivi cheyyalani chala aasa
@jaymin9776
@jaymin9776 Жыл бұрын
Background music remove chei brother natural sounds as it is pettu chala baaga untadi
@manauritravel1169
@manauritravel1169 Жыл бұрын
మహబూబాబాద్ లొ కొరివి మండలం లొ కంది కొండ గుట్ట దానిగురించి పూర్తి వివరాలు వీడియోలో అంధుచండి బ్రో సూపర్ అడివి
@gvenkateswarlu8346
@gvenkateswarlu8346 Жыл бұрын
చాలా బాగుంది
@anithachowdary1234
@anithachowdary1234 Жыл бұрын
👌
@gvenkateswarlu8346
@gvenkateswarlu8346 Жыл бұрын
మీరు చూపించే గుడులు యక్కడ వెతికి పెడతారో అర్దమ్ కవ ట లేదు
@madhoolatha5428
@madhoolatha5428 Жыл бұрын
Srinivas garu bagunnara. Chala rojula tarvata enta manchi video pettaru. maaku kuda meetho ravalani undi. Super video. Thank you. Every week kotha video pettandi. Take care of your health. God bless you.
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
sure madam. thanq
@ravikanth639
@ravikanth639 Жыл бұрын
Amazing Anna....
@balus7610
@balus7610 Жыл бұрын
Yekkada undi. Video supar bro
@gvenkateswarlu8346
@gvenkateswarlu8346 Жыл бұрын
Hai sar
@chsrini007
@chsrini007 Жыл бұрын
మాల్యాద్రి అంటారు వాడుక భాషలో మాలకొండ అంటారు ఇది కందుకూరు దగ్గర ఉంటుంది ఈ మాల్యాద్రి కి దగ్గరలో మొగిలిచెర్ల దత్త క్షేత్రం ఉన్నది నేను ఒకసారి దర్శించు కున్నాను ఎంతో మహిమాన్విత మైన కొండ మాల్యాద్రి. అక్కడ లేని వృక్షాలు లేవు లేని పండ్ల చెట్లు లేవు అన్నిరకాల జీవులు ఉంటాయి ఎన్నో తీర్థాలు ఉన్నాయి
@user-fd4or7be8j
@user-fd4or7be8j Жыл бұрын
Super video
@avrvlogs1574
@avrvlogs1574 Жыл бұрын
నేను కూడా మీతో రావచ్చా..... నాకు చాలా ఇంట్రెస్ట్
@venusomula9763
@venusomula9763 Жыл бұрын
Superb
@sukumarduddu5330
@sukumarduddu5330 Жыл бұрын
SUPER BRO
@user-rf7bw7tv1r
@user-rf7bw7tv1r Жыл бұрын
Superb.....
@MaiMahenderMudiraj
@MaiMahenderMudiraj Жыл бұрын
Hi Anna super ❤ Video
@malleamkondarambabu2136
@malleamkondarambabu2136 Жыл бұрын
Hi
@girijareddytirumala1012
@girijareddytirumala1012 Жыл бұрын
Annaya Ladak bike trip pettandi anna, group ga kalisi vellataaaniki fix cheyyandi anna plssssss
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
sure madam
@macnx3637
@macnx3637 Жыл бұрын
1000 sarlu Aina vasta ekkada
@dakkipurammllikarjuna3953
@dakkipurammllikarjuna3953 Жыл бұрын
Hi Bro nice
@dakkipurammllikarjuna3953
@dakkipurammllikarjuna3953 Жыл бұрын
I will also come
@sureshb7580
@sureshb7580 Жыл бұрын
Good to see your video after a long time Mastaru. Watching it now. Meeru busy ga untaru kada sir so ardamcheskuntunamu....but at least week or 2 weeks ki okati upload cheyandi. People wait for ur videos.
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
thanq sir
@suryakumar-en9tc
@suryakumar-en9tc Жыл бұрын
Yes true Please make sure to upload once a week.
@avnvramanath1986
@avnvramanath1986 Жыл бұрын
Mala konda Lakshmi Narasimhaswamy, it is different I think
@macnx3637
@macnx3637 Жыл бұрын
Elanti place lo ontariga velte...aa kick verabba
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 Жыл бұрын
Jai mallem kondeswara swamy ki
@SumanYadav-nk1rs
@SumanYadav-nk1rs Жыл бұрын
I want to visit this place sir please share location thank you 🙏
@kcj832
@kcj832 Жыл бұрын
Hello బ్రో మితో ఇలా ట్రావెల్ చేయాలి అని ఉంది ఇలా నేచర్ లో మకు కూడా trekking chala eshtam మేతో patu రావాలి అంటే అల సంప్రదించాలి?
@ontariyatrikudu
@ontariyatrikudu 9 ай бұрын
Instagram lo massages cheyandi
@dakkipurammllikarjuna3953
@dakkipurammllikarjuna3953 Жыл бұрын
Please givee chanance one chance
@gvenkateswarlu8346
@gvenkateswarlu8346 Жыл бұрын
నాకు ఒక్క సారి మీతో threek చూడాలి
@srinivassamala22
@srinivassamala22 Жыл бұрын
Anna ..... antha baanea vundhi kaani Anna........ channel name ontari yatrikudu kaakunda GUMPU YAATRIKUDU ani change chesthea inka baaguntundhi bro..........
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
bad idea. channel walpaper chudu brother artham avutundi
@srinivassamala22
@srinivassamala22 Жыл бұрын
@@ontariyatrikudu bad idea maadhi kaadhu... needhi..... channel name ontari okati petti, chesthundhu gumpu mandhi ni veskoni safe ga....... if you are doing videos not alone create another channel and post the videos in that channel.... don't make the viewers fools by doing that.......
@anthonyswamy4
@anthonyswamy4 Жыл бұрын
​@@srinivassamala22 neeku nachakapothe chudaku bro . simple ga. Bye the way em job chesthuntaaru meeru?
@bayyanaresh6524
@bayyanaresh6524 Жыл бұрын
అన్నయ్య మాకు ఒక ఛాన్స్ ఇవ్వరా మీతో వచ్చే భాగ్యం కల్పించరా plz
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
sure brother
@bayyanaresh6524
@bayyanaresh6524 Жыл бұрын
అన్నా మేము వెళ్తాము అడ్రస్ చెప్పరా plz
@ontariyatrikudu
@ontariyatrikudu Жыл бұрын
karteekamadalo ikkada spl brother appudu nenu ikkada 3 days vintanu. details description lo vunchanu
@giribabu308
@giribabu308 10 ай бұрын
Enduku bro malli re-upload cheyyadam. Malli inko saari velli oka 1hr video ayina pettandi chuustam 😂
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 73 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 18 МЛН
Visiting Places in Mallem Konda #mallemkonda #badvel
15:00
SMV Travel & K
Рет қаралды 20 М.
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 11 МЛН