Рет қаралды 129,813
Bhagavatstuti - భగవత్స్తుతి
మాయాయవనికాచ్ఛన్నమజ్ఞాధోక్షజమవ్యయమ్ ।
న లక్ష్యసే మూఢదృశాం నటో నాట్యధరో యథా ॥ (శ్రీ.భా.1-8-19)
భగవానుడు ఎందుకు దృష్టికి గోచరించడు? అను విషయము ఈ శ్లోకములో ఇట్లు చెప్పబడినది. ఓ అధోక్షజా? ఓ శ్రీకృష్ణా? మాయ అనే ఆవరణలో నీ స్వరూపము కప్పబడి ఉండుటచేత దేహాత్మాభిమానము కల అజ్ఞానులు నీ స్వస్వరూపమును దర్శింపలేకున్నారు. రంగస్థలమందున్న నటుడు తెరలోపల ఉండుట చేత ఎవరికి కనపడనట్లు అజ్ఞానులకు నీవు దర్శన యోగ్యుడవగుటలేదు. సర్వవ్యాపకుడవయిననూ చక్షురాది ఇంద్రియములకు నీవు సాక్షాత్కరించేవాడవు కావు. అజ్ఞానురాలనగు నేను నిన్నెట్లు తెలుసుకోగలను...? ఓ కృష్ణా! నీవు నాశము లేనివాడవు. అట్టి నీకు నమస్కారము చేయుచున్నాను.