పల్లవి :-- ఈ తనువు ఎవరి సొమ్ము తనదని పోషింపా ఆ ఆ ఆ దానము ఎవరి సొమ్ము దాచి దాచి దాచి పెట్ట (2) ప్రాణం ఎవరి సొమ్ము (2) పోకుండా నిల్పంగా విశ్వదాభిరామ వినురవేమ,,, పల్లవి:- ఆకు మీది వ్రాత అందరూ చెప్పగలరా అయ్యా చేతిలోని రాత చూసి వచ్చు మీ నుదుటి మీద రాత మీ నుదుటి మీద రాసిన బ్రహ్మ రాత నీకెట్లా తెలుసెరా విశ్వదాభిరామ వినురవేమ గనులకే ఎరుక రా చరణం :-1 మూడు మూలల బావి లోన ఆరు కునుల చేప వుంది (2) మూలమెరిగి గలమేయన్న ఆ ఆ ఓ ఓ హో యాగంటి లింగ,,, మూలమెరిగి గాలమేయన్న మూడు మూలల బావిలోన ,,,,,,, చరణం :-1 కింద కుంట మీద కుంట (2) నట్ట నడుమ నరులకుంట (2) సచుకుంటా పుట్టు కొంటన్న యాగంటి లింగ ఊరి బయట నేనే ఉంటెన్న యాగంటి లింగ ఊరి బయట నేనే ఉంటెన్న మూడు మూలల బావిలోన,,,,,,, చరణం :- 2 మేఘము లేని వాన కురిసే (2) కట్టలేని చెరువు నిండె హలలు లేని తూము పారేన్న (2) యాగంటి లింగ గడ్డి లేని ఒడ్లు పండెన్న (2) మూడు మూలల బావిలోన,,,,, చరణం :-3 గడ్డినంతా కుప్పాకేసి (2) ధన్యమంతా రాసి పోసి (2) రాసిని నమ్మి కాశీ చూడన్నా యాగంటి లింగ దీని భావం నీకే తెలుసన్న యాగంటి లింగ దీని భావం నీకే తెలుసన్న మూడుముళ్ల బావిలోన,,,,,,, చరణం :- 4 ముని మాపులో ముచ్చటయే(2) వేకువజాములో గర్భినాయే (2) కోడి కూసే కొడుకు పుట్టినా యాగంటి లింగ కొడుకు పేరు నువ్వే పెట్టన్నా యాగంటి లింగ కొడుకు పేరు నువ్వే పెట్టన్నా మూడుములాలబావిలోన,,,,,,, చరణం :-4 ఆకులేని అడవిలో నా (2) తోక లేని మృగము పుట్టే (2) తోక లేని మృగము కడుపున యాగంటి లింగ ఈకలేని పక్షి పుట్టిన్న యాగంటి లింగ ఈకలేని పక్షి పుట్టిన్న మూడు మూలల బావిలోన,,,,,,, చరణం :-5 ధరణిలో యాగంటి పురము(2) రామదాసుడు రాసిన పదము (2) దివ్యజ్ఞానులకైతే తెలుసయ్యా యాగంటి లింగ అజ్ఞానులకు అర్థం కాదయ్యా యాగంటి లింగ అజ్ఞానులకు అర్థం కాదయ్యా మూడు మూలల బావిలోన,,,,,,,,