Рет қаралды 3,581
నీ ప్రేమను మరువలేను యేసయ్య
పల్లవి : నీ ప్రేమను మరువలేను యేసయ్య
నీ స్నేహమును విడువలేను (2)
ఎవరు చూపలేని ప్రేమను చూపినావు
ఎందరు విడచినను నీవు నన్ను విడవలేదు (2) ||నీ ప్రేమను॥
1. మంచివాని కొరకు చనిపోవుట ఎంతో అరుదు
ఏ మంచి లేని నన్ను ప్రేమించి
నాకొరకై వచ్చితివి
నేను పాపములో ఉండగానే నాకై సిల్వలో ప్రాణం పెట్టితివి (2) ॥నీ ప్రేమను॥
2. ఒకని తల్లి ఒకనిని ఆదరించునట్లు
నీవు నన్ను ఆదరించుచుంటివి
ఒకవేళ తల్లైనా మరచునేమోగాని క్షణమైనా నీవు నన్ను మరువలేదు (2) ॥నీ ప్రేమను॥
3. ఏ కష్టాలు కన్నీరు కరువు లైన
నీ ప్రేమ నుండి ఎడబాపలేవు (2)
ఎడబాపలేని సిల్వ ప్రేమతో నీవు నన్ను బంధించితివి
॥నీ ప్రేమను॥