ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను జూడ (2) అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము (2) ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడ నేనైతిని (2) చక్కజేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ఎరిగి యెరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని (2) మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గు ముఖమున (2) సందియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు|| విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ కొనసాగించువాడా యేసు ప్రభూ (2) వినయముతో నేను నీ వైపు జూచుచు విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు|| కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో (2) హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు|| లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప జూపుము (2) నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||