Рет қаралды 6,665
జీవుడు ఒక శరీరాన్ని ధరించడం, అది క్రమంగా రూపుదిద్దుకొని పరిపూర్ణతను పొందడం అది గర్భ దశలో ఎలా ఉంటుంది అనేది కూడా వివరించడం ఋషుల వాజ్ఞ్మయంలో కనబడే ఒక ఆశ్చర్యకర విజ్ఞానం.
ఉపనిషత్తులలో గర్భోపనిషత్తు అని ఒకటి ఉంది. గర్భంలో ఉన్నప్పుడు మానవుడు ఎలా ఉంటాడు? అనేదానిని వర్ణిస్తున్నది ఈ ఉపనిషత్తు. ఇదే పిండోత్పత్తి ప్రకరణము అనే పేరుతో వివరించారు.
ఎవరు ఎవరికోసం పాపపుణ్యాలు చేసినా అనుభవించవలసినది మాత్రం వాడికి వాడే. ఎవరూ పంచుకోరు.
బయటి వాయువుల చేత మర్చిపోయినటువంటి సత్య జ్ఞానాన్ని గుర్తు చేయడమే ‘సంస్కారముల ఆంతర్యం.
ప్రతివారూ గర్భోపనిషత్తును మననం చేయాలి - రమణమహర్షి.
మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ముక్తికై ప్రయత్నించడానికి ఈ జన్మలో క్షణం కూడా వ్యర్థం చేయకుండా సాధన చేయాలి అనే స్పృహ కలుగుతుంది.