రుచి చూచి ఎరిగితిని - యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి - నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే - స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ - దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా - ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ - ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా - అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ - ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి - పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక - ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను - అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
@kaatamaraaju732310 күн бұрын
చాలా బాగా పాడారు బ్రదర్....మీ స్వరంలో ఒక రకమైన ఆకర్షణ ఉంది.టోటల్ గా ఓరియంటల్ style లో పాడారు.సంగీతం వచ్చిన వారిలాగా ఉన్నారు .God bless you.