ప్రతి రోజూ కొన్ని వేల, లక్షల దేవాలయాలలో వారి గాత్రం వినపడుతూనే ఉంటుంది. బాలు గారు అమర గాయకుడు. మీ పదాలకు, సాహిత్యానికి గుండె తో వినిపించిన బాలు గారికి మీ హృదయం నుండి వచ్చిన ఈ బాధాతప్త మాటలు బాలు గారు పై నుండి వింటారు.
@bharadwajemani1904 жыл бұрын
కొన్నిసార్లు భావం గుండె గుమ్మం దాటదు... మాటల దారి కనపడకో.. మది నిండు కుండలా మారినందుకో.. కొన్నిసార్లు వేదనకు రూపం ఉండదు... మౌనం లో నలగడానికో... కంటి నీటిపొరను దాటి చూడలేకో.. కొన్నిసార్లు ఆనందం పట్టలేనిది... నవ్వుల పూవులు చెప్పలేనిది.. అరిచి అల్లరి చేసిన ఆగనిది.. కొన్ని సార్లు మమత మధురిమ అంతు చిక్కదు... పంచే హృదయం ఇంకనివ్వదు.. అనుభవించే మనసుకి తృప్తి ఉండదు... మరికొన్ని సార్లు ప్రేమకు ఆకలుండడు... దప్పిక, తిప్పలు లెక్కలుండవు.. కానీ మా బాలు పాట జనవాహినికో ఔషధం.. ఎన్ని భావాలు భాషనున్నవో.. ఎన్ని రసాలు నటననున్నవో... అన్నిటినీ పలికించే అమృతం... గాన గంధర్వుడా నీ పాటల రసాల డోలలాడించి... నీ గాన ప్రాభవమున మతులెక్కించి.. ప్రతి భావ రసమును మాకు అందించి.. ఆబాలగోపాలన్ని అలరించిన నీకివే మా అశ్రునిరాజనం.. గంధర్వ గానం దేవతలదేనని ఈర్ష్య తో మా నుండి నిన్ను తీసుకుపోయారు.. అయితేనేం నీ ప్రతి పాట మళ్ళీ వింటాం... మళ్లీ మళ్లీ వింటూవుంటాం.. అమృతం నిక్షిప్తం చేశామని ప్రతి తరమూ చాటుతుంటాం.. నీ పాట మధురం.. నీ గొంతు అమరం.. నీ స్థానం సుస్థిరం..నీ కీర్తి అజరామరం!
@vaidhyulamaruthivm59933 жыл бұрын
🙏
@ramanammamallajosyula15484 жыл бұрын
అద్భుతం గా మీ హృదయం తో మాట్లాడేరు. మీ బాధ అందరికీ అర్ధం అయింది. ఎందుకంటే అందరిదీ అదే బాధ.
@rameshkumarsinisetti74924 жыл бұрын
ఆనందం,సంతోషం,బాధ,దుఃఖం,కోపం,ఆవేశం ఇలా అన్నీ కలగలిసిన ఎన్నో వేల పాటలను పాడి, ఈ భువిలో మా మది ముంగిట గాన జ్యోతులను వెలిగించి, దివికేగిన బాలు గారికి అశృతప్త నయనాంజలి.🙏🙏🙏🙏
@అవికిడ్స్4 жыл бұрын
బాలు గారి మాటలు.. ఎలాంటి కార్యక్రమంలో ఐన "సర్వేజనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు" నాకు చాల గుర్తు ఈ పలుకు..
పాడుతా తీయగా ప్రోగ్రాం లో ఇప్పుడు మీరే చేయాలి శాస్త్రి గారు. ఆయన సాంస్కృతిక వారసుడు మీరే కావాలి. మీరు చెప్పినట్టు స్వరాలు సరిచేయడానికి వేరే వారు ఉన్నా, ఉచ్చారణ ఇంకా వేరే చిన్న సంగతులు చెప్పగలిగే జ్ఞానం ఆయన తరవాత మీద గురువు గారు
@srujanaabburu6304 жыл бұрын
Maa intlo pedda dikku ni kolipoyemu..ee maata prati telugu inta vinipistundi.. ninnatinunchi Balu gari paatalu vine dhariyam kooda chaltam ledu. Dukham, badha, kopam, edupu, anni kalipi oka uppena laga vastondi..telugu bhasha goppatanini aayena programs dwara cheppinattu ee prapcham lo evaru cheppeleru 🙏🙏🙏
@vishwa36374 жыл бұрын
సంగీతాన్ని కేవలం ఒక వృత్తి లా భావించిన వారైతే బాలు గారి గురించి ఇంత భాద ఉండేది కాదేమో.. కానీ ఆయన సంగీతాన్ని పూజించారు. డబ్బు కోసం పని చేయలేదు .. ఆయన చేసిన పనికి డబ్బొచ్చింది. పాట విన్నామా ఆపేశామా అన్న స్థాయి నుంచి.. ఒక పాటలో సాహిత్యాన్ని చూడాలి.. భావాన్ని అర్ధం చేసుకోవాలి.. సంగీత దర్శకుడి వేదనని చూడగలగాలి అన్న ఆలోచనని అందరిలోనూ కలిగించారు. గ్రామ ఫోన్ కాలం నుంచి ఇప్పటి దాకా అన్ని తరాల వారికి ఆయన పాటే ఓదార్పు.. ఆనందం.. ఏ మూడ్ లో ఉన్నా ఆయన పాటే కావాలి. సంగీత ప్రపంచంలో ఆయన బ్రహ్మర్షి.. పాటల యజ్ఞలెన్నో చేసిన ఋషి.. తెలుగు అందాన్ని ఎలా చూడాలో నేర్పించారు.. ప్రతి భాషని గౌరవించాలని అర్ధం చేసుకుకొని పాడాలని సూచించారు.. ఏ మ్యూజిక్ స్కూల్ కి వెళ్లకుండా పాడుతా తీయగా చూస్తే చాలు. రెండు రోజుల్లో వార్తలు ఆగిపోతాయి.. సంతాప సభలు జరిగిపోతాయి.. తీరని లోటు లాంటి పడికట్టు మాటలు వినపడతాయి.. ఇవన్నీ ఆయన లేరు అన్న నిజాన్ని మర్చిపోయేలా మాత్రం చెయ్యలేవు. ఆయన్ని బతికించామని దేవుడ్ని అడగాలా? ఆయన పాటని దేవుడెప్పుడు వినలేదా ? శంకారా అన్న పిలుపు ఈశ్వరుణ్ణి చేరలేదేమో? శివైక్యం అయ్యే దాకా పాటకే జీవితనాన్ని అంకితం చేసిన బాలు గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
@narendrag23224 жыл бұрын
Superb Lines
@lakshmidevamma68524 жыл бұрын
All
@kiranalwaysanindian93474 жыл бұрын
గురువు గారు, మీ బాధను అర్థం చేసుకునే అంత వయసు, అనుభవం నాకు లేదు. కానీ మీ సాహిత్యంలో బాలు గారు పాడిన పాటలు విని పెరిగిన వాడిగా మీ బాధ వెనుక ఉన్న అంతరార్ధం తెలుసుకొ గలుగుతున్నాను. బాలు గారి గాత్రం చిరకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
@hemakondaparthy71624 жыл бұрын
No one can replace balu garu.
@muralik55394 жыл бұрын
నేను - మా బాలునీ ఎందుకయ్యా తీసుకుపోయావ్.. ఆయన పాట మాకు చిరకాలం కావాలని నీకు మోరపెట్టుకున్నాం కదా... దేవుడు - బాలు మీకు కొన్ని వేల సంఖ్యల్లో పాటలు పాడి వదిలేసాడయ్యా.. ఇప్పుడైన ఆయన్ని నా పక్కన కూర్చోపెట్టి ఆ గాత్ర మాధుర్యంతో నాలుగు పాటలు పాడించుకోవద్దా... #SPBalasubrahmanyam You may have left us.. Your voice will be with us forever.. I personally keep cherishing your songs for my lifetime.. #ThankYou మృత్యోర్మా అమృతం గమయ... ఓం శాంతిః!!!
@srinivasM19943 жыл бұрын
మొదటి సారి గురు గారు కంటి లో కన్నీరు చూశాను.....
@saikrishnasudabathula9024 жыл бұрын
గురువు గారు మీరే అలా అయిపోతే. మాలాంటి వాళ్ళు తట్టుకోలేరు 😭
@ajitreddy23824 жыл бұрын
Sirivennela sirs lyrics + spb sir voice we will never forget both of u 😭😭😭😭😭
@bhaskaram94224 жыл бұрын
Agreed sir..his voice is part of our life.. Mana Kutumba sabyulu ayana
@SreenuBhooma4 жыл бұрын
దేవుడు దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు.. వేల పాటలను వరాలుగా ఇచ్చి.
@venkyanu73974 жыл бұрын
గాన గంధర్వునికి అంజలి ఘటిస్తూ....🙏🙏🙏 Stay sti sir.😭
@dechiraju14 жыл бұрын
గంధర్వలకి మరణం లేదు మరి మన గాన గంధ్వుడు బాలు గారి కి .... మరణమే లేదు గానంలో జీవం పోసిన తీర్థం లా నిరంతరం సంగీత ప్రియుల గుండెలకి చేరువలో నే ఉంటారు 🙏
@divyaparvataneni4 жыл бұрын
Aayana vellipoyaru. Chala dhukham vastondi. Kaani avi cheppataniki maatalu levu. Mee matallo aa kaaranaalu, aa badhani chuskuntunnanu. Aayanatho saannihityam pondinanduku entho adhrustavanthulu ❤️🙏🏼
@sravanbala37854 жыл бұрын
You are such a genuine soul to speak so truthfully!
@subrahmanyamvemuri55874 жыл бұрын
గురువుగారు మీరు మా లాంటి వారికీ ధైర్యం ఇవ్వాలి. మీరే అలా అయ్యితే ప్రతీ అభిమానికి వూరట ఎవరు యిస్తారు. వేమూరి సుబ్రహ్మణ్యం, అడ్వకేట్, అనపర్తి
@visud9744 жыл бұрын
Cool sir.. you too a legend that this society need!
@saaicharan57574 жыл бұрын
తెలుగు భాషను బతికిస్తుంది మీలాంటి పెద్దలే 🙏
@BhanuPrakash874 жыл бұрын
Stay strong sir. We are devastated, but trying hard to accept it.
@venu1174 жыл бұрын
Great tribute sir...Om shanti Balu garu...
@ThinkinrRandomly4 жыл бұрын
Mee aarogyam jaagrathha sir...dhairyam ga undandi
@suryaprabhavadlamani1994 жыл бұрын
కొందరు వస్తారు .... వెళ్ళరు 🙏🙏🙏🙏🙏🙏🙏 బాలు వెళ్ళరు !! ఎప్పటికీ వెళ్ళరు!!
@bharatmatakijai99494 жыл бұрын
S mam
@lpa2z464 жыл бұрын
ఆనందాలను అందించే ఆ గొంతు ఆవిరియే పోయింది .. ప్రేమని పంచె పల్లవి పొలిమేర దాటి వెళ్లి పొయింది .. సంతోషాన్నిచ్చే స్వరం స్మశానాన్ని చేరింది .. ఏమో ..మీ అమృత ఆరాధన వినడానికి ఆ దేవదేవుడే పిలుపునిచ్చాడు ఏమో .. SPB garu.. మీ అభిమాని లక్ష్మణ్
@saikumarsharma19474 жыл бұрын
Kallalo neelu vachaay sir......🙏🙏🙏🙏
@VenuGopal-by7ww4 жыл бұрын
జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరామరనజంచ భయం నాస్తి జరామరణజం భయం #RIPSPBSir #NoENDforANYART #NoENDforANYARTIST Proud to Say I Lived in the "Era of SPB"
@షాజహాన్తోసరాగాలు4 жыл бұрын
మీ ఇద్దరు పాటకి రెండు కళ్లు సార్...ఒక కన్ను పోయింది సార్..మీరు సిగరెట్లు కొంచెం తగ్గించాలి ..మీరు బాగుండాలి సార్
@lpa2z464 жыл бұрын
ఆనందాలను అందించే ఆ గొంతు ఆవిరియే పోయింది .. ప్రేమని పంచె పల్లవి పొలిమేర దాటి వెళ్లి పొయింది .. సంతోషాన్నిచ్చే స్వరం స్మశానాన్ని చేరింది .. ఏమో ..మీ అమృత ఆరాధన వినడానికి ఆ దేవదేవుడే పిలుపునిచ్చాడు ఏమో .. మీ అభిమాని లక్ష్మణ్
@Moviesadmirer4 жыл бұрын
ఓం శాంతి బాలు గారు 💔😭
@yourssanthosh524 жыл бұрын
Sir your words made me cry
@veeralakshmimadagala14584 жыл бұрын
Stay strong Sir, we miss him a lot
@leelasridhara92634 жыл бұрын
He is a Arjun in music world and now he is with Lord Krishna then he will be back again soon
@ramajanasena35064 жыл бұрын
పోయినోళ్లందరు మంచోళ్ళు, ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపి గురుతులు. ౼ ఆచార్య ఆత్రేయ
@jyothiraojyothirao67714 жыл бұрын
Great viceo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 balu ji
@nandishg14394 жыл бұрын
2020 em baledu sir rip legendary singer balu sir
@theretrocafe7954 жыл бұрын
@sirivennela1955 మీ స్థితి : ఏ యోగమనుకోను నీతో వియోగం ఏ పుణ్యమనుకోను ఈ చేదు జ్ఞానం తపస్సనుకోలేదు నీతోటి స్నేహం మోక్షమనుకోలేను ఈ మహాశూన్యం నేలపై నిలపక నెయ్యమై నడపక చేరువై ఇంతగా చేయి విడిచేందుకా అరచేత కడదాక నిలుపుకోలేవంటూ నిజము తెలిపేందుకా గాలికొడుకా ఇలా చూపేవు వేడుక . #SPB
@goutham2444 жыл бұрын
❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️ ప్రతీ మాట వాస్తవం
@udaykumar-xw7si4 жыл бұрын
Meeru ayana gurinchi cheppina prati maata mutyam Andi.. jeerninchukoleni vishayam . Maaku eeroju black day
@yourssanthosh524 жыл бұрын
Shabdam leni sangeetham...balu leni paata
@etelaniranjan4 жыл бұрын
😔 maatalu levu sir
@venkateswararaobandaru1574 жыл бұрын
Return if possible Balu Garu 🙏
@balreddybaddam78344 жыл бұрын
Edupu osthundii sir😭😭😭💔
@bakowsky39134 жыл бұрын
Meru baadha paduthunte maku maku yedupu vasthundi sir 😭😭😭😭😭💔💔
@mahivibesatoztalkies92504 жыл бұрын
Anna vadhanna inka matladi edpinchodhu RE BORN BALU GARU
@KHR-JSP4 жыл бұрын
శివోహం ఓం శాంతి 🙏🙏😭
@SpirichualKreatures4 жыл бұрын
*******అమర్ రహే !!******* ప్రేమ పంజరమై గానం మిగిలిందా? పావురమే నింగికెగసిందా? గానంతో రసహృదయాల దగ్గరే ఉందా? పల్లవి చరణాలకందనంత దూరమైందా? గానగంధర్వున్ని చేజిక్కుంచుకుందామని గంధర్వ లోకం ఎత్తు వేసిందా? అమృతం అసలు రుచి తెలుసుకుని అమర సభ అపహరించుకుపోయిందా? ఏమో మరి !! వార్త విన్న తెలుగు తల్లికి సుస్తీ చేసి మూలుగుతోంది జీరబోయిన గొంతుతో గానసరస్వతి శోకరాగమందుకుంది ఓ పెద్దదిక్కును కోల్పోయిన ప్రపంచం విషాదంలో మునిగింది ఆయన ఉట్టిచేతులతో పైకివెళ్లినా చేతుల్లో నింపిన గానమహాసముద్రాన్ని చూసుకుంటోంది !! భాష ఉనికి కోల్పోకుండా పోరాడిన వీరయోధుడాయన !! ప్రతిభ ఎక్కడున్నా వెతికిపట్టి ప్రశంసల్లో ముంచెత్తిన నాయకుడాయన !! ఆయన పాటలే కాదు.. ఆయన మాటలూ తీయనే పండితపామరులకు దొరికిన స్వర అక్షయపాత్రాయన ! ప్రతి భావాన్ని పాడించి ప్రతి రాగాన్ని ఆడించి తన సారాన్ని జోడించిన గొప్ప విదూషకుడాయన !! తిరిగిరాని లోకాలకెళ్ళినా తరిగిపోని ఆస్తినిచ్చి వెళ్ళిన ఓ పెద్దమనిషాయన !! ప్రియమైన బాలు!! అమర్ రహే !!
@TrivikramSurya4 жыл бұрын
గాత్రం మూగబోయింది! గానం బ్రతికే ఉంది. #RIPSPBSir 💔😥