Рет қаралды 1,309,454
వరి నాట్లు వేసే మెషిన్ కొనుగోలు చేసిన తండు రాము గారు.. తన పొలంతో పాటు ఇతర రైతుల పొలాల్లోను నాట్లు వేసి ఉపాధి పొందుతున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల పరిసరాల్లో నాట్లు వేస్తున్నారు. తాను, తన ఫ్రెండ్ కలిసి 14.5 లక్షల ధరతో మెషిన్ కొనుగోలు చేశామని.. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో నెల రోజులుగా సుమారు 100 ఎకరాల్లో నాట్లు వేశామని చెప్పారు. ఒక్కో ఎకరం నాట్లు వేసినందుకు రైతు నుంచి 4 వేలు తీసుకుంటున్నామని.. కూలీల కొరత సమస్యకు నాట్ల యంత్రం మంచి పరిష్కారం చూపుతోందని చెప్పారు. మెషిన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో పంచుకున్నారు. మొత్తం వీడియో చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. మార్కెట్లో అనేక కంపెనీల మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు తెలుపుతూ మరో వీడియో తెలుగు రైతుబడిలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : వరి నాటు యంత్రం కొన్నం.. 100 ఎకరాల్లో నాట్లు వేసినం | Rice Transplanter | రైతు బడి
#RythuBadi #వరినాటుయంత్రం #RiceTransplanter