Рет қаралды 398,396
వైభవంగా విరాజిల్లిన వెంకటగిరి సంస్థానం ఘనత చరితలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది.ఇక్కడ ఉన్న రాజుల కాలం నాటి సౌదాలు వెంకటగిరి విశిష్టతను సాక్షాత్కరిస్తున్నాయి.రాజుల కాలం నుండి జరపబడుతున్న పోలేరమ్మ జాతర ఈ పుడమికి మకుటాయమానం.కమలమ్మ గారి మైసూర్ పాక్ ఆహార పరంగా,చీరలు వస్త్ర పరంగా వెంకటగిరికి కీర్తిని చేకూర్చాయి.
ప్రాచీన నేపథ్యం గల ప్రసిద్ధి చెందిన తినుబండారం వెంకటగిరి కమలమ్మ గారి మైసూర్ పాక్ పోలేరమ్మ వారి గుడి ఎదురుగా ఉన్న బాబ్జి గారి చెంచులక్ష్మి కిరాణా దుకాణంలో లభిస్తుంది. సాధారణ మైసూర్ పాక్లకు ఈ మైసూర్ పాక్కి వ్యత్యాసం ఉంది.శనగ పిండి కాకుండా జీడిపప్పు మిశ్రమం వినియోగించడం విశేషం.ప్రధాన ముడి పదార్థానికి తోడు పంచదార,స్వచ్ఛమైన నెయ్యి ఉపయుక్తం కాబడి కలరూపు పొందిన మైసూర్ పాక్ని రుచి చూస్తే కమ్మని అమితమైన మధురంతో హిమము వలే కరిగి జిహ్వమ్ తనివి చెందుతుంది.కొన్ని దశాబ్దాల క్రితం కమలమ్మ గారు సొంత సూత్రీకరణలో ఈ పదార్థాన్ని తొలిసారి తయారు చేశారు.దరిమిలా పలువురుకీ తయారీ విధానం నేర్పారు.అలా నేర్చుకున్న వారిలో బాబ్జి గారి పూర్వికులు ఉన్నారు.తమ పెద్దల వద్ద తయారీలో శ్రేష్ఠత పొందిన బాబ్జి గారు సంప్రదాయ పద్ధతిలో రూపుదల్చుతూ మైసూర్ పాక్ మాధుర్యాన్ని అందరికీ పంచుతున్నారు.
గూగుల్ లొకేషన్ :-
g.co/kgs/r5zPX8
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.