"యేసయ్యా నీ నామ గానం యేసయ్యా నీ నామ గానం - నే పాడెద జీవితాంతం శోధన వేదన భాదలు కలిగిన - నే పాడెద శాంతి గీతం హల్లెలూయా - ఆమెన్ - హల్లెలూయా (4) జీవాధిపతియైన దేవా - నిత్య జీవం నా కొసగినావా (2) జీవజలమై, జీవాహరముగా - పరమునే విడచినావా (2)IIహల్లెII నీ మాటే నా నోట పాడగా - ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా (2) ప్రకటింతునయ్యా, నీ సిలువ వార్త - ప్రాణమున్నంత వరకు (2) IIహల్లెII"