నాట్యమాడి పాట పాడవో తమ్ముడా ఏసు రాజు పుట్టాడని - గంతులేసి ఉల్లసించవో చెల్లెల రక్షణ దొరికిందని // 2// ఆర్భాటంగా ఉత్సాహంగా పాటలు పాడుదాం నీవు నేను కలిసి వెళ్లి క్రీస్తుని చాటుదాం //2// నాట్యమాడి పాట పాడవో తమ్ముడా ఏసు రాజు పుట్టాడని - గంతులేసి ఉల్లసించవో చెల్లెల రక్షణ దొరికిందని 1.బెత్లెహేములో మరియ గర్భములో బాల యేసు ఉద్భవించినాడు - పరలోక దూత సైన్యముతో ఆర్భాటించగా దిగివచ్చిరి //2// చీకటి గల లోకంలోన వెలుగంట వచ్చేనంట మనము కూడా దూతలతో ఆరాధించెదం //2// ఆర్భాటంగా ఉత్సాహంగా పాటలు పాడుదాం నీవు నేను కలిసి వెళ్లి క్రీస్తుని చాటుదాం //2// నాట్యమాడి పాట పాడవో తమ్ముడా ఏసు రాజు పుట్టాడని - గంతులేసి ఉల్లసించవో చెల్లెల రక్షణ దొరికిందని 2.రాజులకు రారాజు పుట్టాడని గొల్లలకు దూత తెలిపే శుభమని - వింతైన చుక్క చూచి జ్ఞానులు రక్షకుని పూజింప వచ్చిరి //2// బంగారము తెచ్చారంట సాంబ్రాణి బోళం ఇచ్చారంట మనము కూడా మన హృదయం అర్పించేదం//2// ఆర్భాటంగా ఉత్సాహంగా పాటలు పాడుదాం నీవు నేను కలిసి వెళ్లి క్రీస్తుని చాటుదాం //2// నాట్యమాడి పాట పాడవో తమ్ముడా ఏసు రాజు పుట్టాడని - గంతులేసి ఉల్లసించవో చెల్లెల రక్షణ దొరికిందని.
@edupulapatiramesh53393 күн бұрын
@@paulbilly777 tq bro
@ravilimmaka2532 күн бұрын
అక్షరం కూడా తప్పు లేకుండా బాగా రాసావ్ బ్రదర్. ❤❤❤
@tejadokula26118 күн бұрын
చాలా బాగుంది.సువార్త చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది.Beautiful Gospel song
@ArjunTimothy6 күн бұрын
Excellent song super voice god bless you bro.....
@vanthalakoteswararao79726 күн бұрын
Super song.
@ANILANNALYRICS8 күн бұрын
చాలా బాగుంది ఈ పాట బృందానికి దేవుడు బహుగా దీవించును గాక!
@FrndsCollege8 күн бұрын
I love the way this song blends traditional Christmas sounds with modern elements.