సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||
@ashokgudimetlaa1185 Жыл бұрын
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి|| గుండె చెదరిన వారిని బాగుచేయువాడని వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి|| నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని ||దేవునికి|| ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవునికి|| దీనులకు అండాయెనే భక్తిహీనుల కూల్చును సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవునికి|| ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును భూమికొరకు వర్షము సిద్ధపరచువాడని ||దేవునికి|| పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవునికి|| గుర్రముల నరులందలి బలము నానందించడు కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవునికి|| యెరుషలేము యెహోవను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవునికి|| పిల్లల నాశీర్వదించియు బలపరచు నీ గుమ్మముల్ మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవునికి|| భూమికి తనయాజ్ఞను ఇచ్చువాడు ఆయనే వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవునికి|| వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని ఏ జనముకీలాగున చేసియుండలేదని ||దేవునికి||
@dgmindia122 жыл бұрын
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా/2/1. ప్రేమతో ప్రాణమును అర్పించినావుశ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే/2/శూరులు నీ యెదుట వీరులు కారెన్నడుజగతిని జయించిన జయశీలుడా /2/సర్వ/2. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవుశృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే /2/ నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా /2/సర్వ/ 3. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను /2/నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా /2/సర్వ/
@hemanthrayalking56352 жыл бұрын
స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా (2) నా ఆధారమైయున్న యేసయ్యా నీకు - కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి|| నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే - ఎంతో కోరతగినవి (2) నీ ధర్మాసనము - నా హృదయములో స్థాపించబడియున్నది - పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి|| శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే - ఎంతో ఉపయుక్తమైనవి (2) నీ శ్రేష్టమైన - పరిచర్యలకై కృపావరములతో నను - అలంకరించితివే (2) ||స్తుతి|| నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే - ఎంతో ఆశించదగినది (2) నీ సింహాసనము - నను చేర్చుటకై నాతో నీవుంటివే - నా గురి నీవైతివే (2) ||స్తుతి||
@PanditiSuresh-xs3df5 ай бұрын
😅
@anandtracks78302 жыл бұрын
కృపామయుడా - నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2) నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా|| ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు (2) నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||
@hemanthrayalking56352 жыл бұрын
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపారతు నిన్నే సర్వ కృపనిధి నీవు - సర్వాధికారివి నీవు సత్యా స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే|| నీ ప్రేమ నాలో || చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2) హృదయం నిండిన గానం - నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2) ఇది నీ బహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో || నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే (2) ఎన్నడు విడువని ప్రేమ - నిను చేరే క్షణము రాధా నీడగా నాతో నిలిచే - నీ కృపాయే నాకు చాలును (2) ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో || నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి (2) కొండలు లోయలు దాటే - మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి - సమాభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ
@NPATIBANDLANAVEEN Жыл бұрын
Nee dayalo nee kruapalo kachitivi intakalami
@paulpaul9694 Жыл бұрын
May God bless u Glory to be God alone
@pathipatiprabhakar90064 жыл бұрын
Praise the Lord pastor PrabhakarRao mellachrvuv kodad
@stephenfinney59412 жыл бұрын
Aradhuda naa yesaya 🙏
@pathipatiprabhakar90063 жыл бұрын
Nice good
@pathipatiprabhakar90063 жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏
@davidraju20192 жыл бұрын
Supper
@vimalarapaka19892 жыл бұрын
Praise the Lord all
@masilamanivalluri80182 жыл бұрын
Very very very very good👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@kothelarajababu6822 жыл бұрын
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర|