Рет қаралды 33,231
Dappulu Dappulu Roo Mama Nagulayya Full Song | Relare Ganga | Daruvuyellanna | Daruvula Rajkumar | Daruvula Rajkumar
Lyrics: Daruvu Yellanna
Singer: Relare ganga
Music: Ravi Kalyan
Mixing: Kalyan keys
DOP: Ajay Kodam
Poster&Editing: Daruvula Rajkumar
Special Thanks: Anthadupula Nagaraju
#telugufolksongs #latestfolk #relareganga #daruvularajkumar
పల్లవి : డప్పులు డప్పులురో ఓ మావా నాగులయ్య
జోడా డప్పులురో నా మావా నాగులయ్య
వేయి గొంతులురో ఓ మామ నాగులయ్య
లక్షల డప్పులురో నా మామ నాగులయ్య
రాజధాని గడ్డ మీద రాణా బేరిని మోగించా
తరలి పోదామురో ఓ మామ నాగులయ్య
తరలించుదామురో నా మామా నాగులయ్య
ఇది మంద కృష్ణ పిలుపు రో ఓ మామా నాగులయ్యా
ఇగ దండై కదలాలి రో ..నా మామ నాగులయ్యా | 2 |
చరణం :
1) పల్లె పల్లె - ఉయ్యాలో
గల్లీ గల్లి - ఉయ్యాల
పండుగలు - ఉయ్యాలో
దండిగ జేసె - ఉయ్యాల
పెండ్లి జేసె - ఉయ్యాలో
పెద్ద మనిషి - ఉయ్యాల
సావుకేడ్సి - ఉయ్యాలో
సాగనంపే - ఉయ్యాల
ప్రేమగళ్ల పేదోళ్ల సప్పుడోయ్ ఉయ్యాలా... ఛల్
గజ్జెలు కట్టాలి రో...ఓ మామ నాగులయ్య
గంతులు వెయ్యాలి రో..నా మామ నాగులయ్యా
| డప్పులు |
2) యేండ్ల నుండి - ఉయ్యాలో
ఎట్టి జేసె - ఉయ్యాల
సబ్బండ జాతికి - ఉయ్యాలో
సాకిరి జేసే - ఉయ్యాల
మనసుగల్ల - ఉయ్యాలో
మనుషులోయ్- ఉయ్యాల
కోటలో వాట కు - ఉయ్యాలో
కొట్లాడ వోతుంటే - ఉయ్యాల
వాల్లకు తోడుగ ఉయ్యాలో
ఊరంత కదిలింది ఇయ్యాలా ...ఛల్
ఇగ జనజాతర సాగేరో - ఓ మామ నాగులయ్య
జజ్జనకరి వెయ్యరో నా మామ నాగులయ్యా
ఇది మంద కృష్ణ పిలుపు రో ఓ మామా నాగులయ్యా
ఇగ దండై కదలాలి రో ..
నా మామా నాగులయ్య
| డప్పులు |
3) కారం చెడు - ఉయ్యాలో
కత్తు లోయి - ఉయ్యాల
నీరుకొండ - ఉయ్యాలో
నిప్పులోయ్ - ఉయ్యాల
పదిరికుప్పం - ఉయ్యాలో
పరుగులో - ఉయ్యాల
ఇవి తెలంగాణ - ఉయ్యాలో దద్దరవులోయ్ - ఉయ్యాల
దోపిడి దొంగల ఉయ్యాలో -గుండెలదురవెయ్యాలో
ఛల్ |
సీటీకేలు వెయ్యాలి రో - ఓ మామా నాగులయ్య
సిర్రాలు జులుపాలి రో -
నా మామ నాగులయ్య
ఇది మంద కృష్ణ పిలుపు రో ఓ మామా నాగులయ్యా
ఇగ దండై కదలాలి రో ..
నా మామా నాగులయ్య
| డప్పులు |