Рет қаралды 68,762
Sripada Srivallabha Charithamrutham (TELUGU) -20
ORIGINAL SANSKRIT SCRIPT BY : Sriman Sankar Bhatt
visit sites :
www.nutrientfo...
www.sripada.co/
voice , Singer , musician : Jayanth Varma
Licensed by : Lord Dattatreya Spiritual Society
Telugu Script was Handed over By : Late Sri Malladi Govinda Deekshitulu
Background Image source from : pixabay.com
www.flickr.com
www.pexels.com/
Background images are licensed under a Creative Commons License 3.0 - Attribution-ShareAlike 3.0 Unported (CC BY-SA 3.0) creativecommons.org/licenses/...
some changes were made in used content.
script : అధ్యాయము 20
విస్సావధాన్ల వృత్తాంతము - భాగము 1
శ్రీపాదుల వారి దివ్య మంగళ స్వరూప వర్ణన
నేను ఉదయముననే శ్రీపాదుల వారి దర్శనార్ధము కురుంగడ్డకు వచ్చితిని. శ్రీపాదుల వారి శరీరము నుండి దివ్యకాంతులు వెదజల్లబడుచుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతిస్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్య సన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభుస్వరూపము, నిరాకారతత్త్వము, సాకారమై, సగుణమై మానవాకారముతో కళ్ళయెదుటనే కన్పించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్త్వమును ముంచెత్తుచుండెను.
శ్రీపాదులవారు అనుగ్రహముతో తమవద్దకు వచ్చి వారికి నమస్కరించుకొనుమని మమ్ము సైగచేసిరి. వారు చేసిన సైగ వెంబడి వారి దివ్య హస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములుద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీ చరణములను భక్తితో స్పృశించితిని. ..............