Рет қаралды 178,406
Ganuda Gunasekaruda | Gunasekaruda Naa Yesayya, Vol-16 | Bro Mathews, Krupa Ministries, Guntur
ఘనుడా గుణశేఖరుడా నా యేసురాజా
ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా ''2''
పాపిని కరుణించితిని పరివర్తన కలిగించితివి
అనురాగ క్షేత్రమందు హరింపచేసితివి ''2''
''ఘనుడా''
1.శుభ వాగ్దానాలెన్నో చేసిన శ్రేయస్కరుడా
సౌభాగ్యములెన్నో ఇచ్చిన భాగ్యవంతుడా ''2''
మాట తప్పని మహనీయుడవు నీవు
ధారాళముగా దయచేసే మహాదాతవు ''2''
''ఘనుడా''
2.సత్య ప్రమాణాలెన్నో చేసిన సర్వశక్తుడా
సద్విషయాలెన్నో నేర్పిన సత్ బోధకుడా ''2''
సర్వ సత్యములో నడిపించే దేవుడవు
కృపా సత్యములు మాకై తెచ్చిన కృపాపూర్ణుడా ''2''
''ఘనుడా''
3.శుభ ఉద్దేశముతో కార్యసిద్ధి కలిగించితివి
పరిపూర్ణునిగా నిలుపుటకై క్రియాశక్తినిచ్చితివి ''2''
మహిమ రాజ్యమునకు నను నడిపే మార్గదర్శకా
అమరత్వమును నాలో నింపే అమరనాథుడా ''2''
''ఘనుడా''