మార్కండేయుడు చెప్పిన గుడ్లగూబ, కొంగ, తాబేలు కథ | Mahabharatam Stories | Rajan PTSK

  Рет қаралды 57,743

Ajagava

Ajagava

Күн бұрын

ఎక్కువకాలం జీవించినవారెవరు?
అది పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయం. వాళ్ళు ద్రౌపదీ సమేతులై అనేక వనాలు తిరుగుతూ కామ్యకవనం చేరుకున్నారు. అక్కడ ఉండే మునులు, బ్రాహ్మణులు ధర్మాత్ములైన పాండవులను ఎంతగానో ఆదరించసాగారు. అలా కాలం గడుస్తుండగా ఒకసారి శ్రీకృష్ణపరమాత్మ సత్యభామతో కలిసి పాండవులను చూడడడానికి కామ్యకవనం వచ్చాడు. ఆ దంపతులను చూడగానే ద్రౌపదీ, పాండవులు పొంగిపోయారు. కౌగిలింతలు, కుశలప్రశ్నలు అయ్యాక కృష్ణుడు పాండవులతో వారి బలం గురించి, వారి మిత్రపక్షాల బలం గురించి వివరించి, ధర్మం తప్పక జయిస్తుందంటూ ధైర్యం చెప్పాడు. బావా నువ్వుండగా మాకు లోటేమిటి.. మేమంతా నీకు దాసులం. నువ్వెలా అంటే అలా నడుచుకుంటాం అంటూ ధర్మరాజు శ్రీకృష్ణుడికి పరమభక్తితో నమస్కరించాడు. అలావారంతా ఊసులు చెప్పుకుంటూ ఉండగా అక్కడకు మార్కండేయ మహర్షి వచ్చాడు. వేలకొద్దీ సంవత్సరాల వయసున్న ఆ మహానుభావుడు చూడడానికి మాత్రం కేవలం ఇరవై ఐదు సంవత్సరాలవాడిగా కనిపిస్తాడు. ఆ మహానుభావుడికి పరమేశ్వరుని కటాక్షంతోపాటూ, సుదీర్ఘమైన జీవితానుభవం కూడా ఉండటం వల్ల, ఆయనకు తెలియని విషయం లేదేమో అన్నట్లుగా ఉండేది. అటువంటి మునీశ్వరుడు రావడంతో శ్రీకృష్ణుడు, పాండవులతో సహా ఆ ప్రదేశంలో నివసించే మునులంతా కూడా ఎంతో సంతోషించారు. అందరూ ఆ మార్కండేయుని భక్తి శ్రద్ధలతో సేవించారు. అప్పుడు శ్రీకృష్ణుడు మార్కండేయునితో.. “మహర్షీ! మీరు ఎన్నో తరాలను చూసినవారు. వేరెవ్వరికీ లేనంత లోకానుభవం కలవారు. దయచేసి మాకు ప్రాచీన రాజుల చరిత్రల్ని, మహాతపస్సంపన్నులైన ఋషుల గాథల్ని, గొప్పవారైన స్త్రీల కథల్నీ చెప్పండి. అలానే సత్సంప్రదాయాల గురించి కూడా వివరించండి అని అభ్యర్థించాడు. దానితో ఆ మార్కండేయుడు వారందరికీ బోలెడన్ని వృత్తాంతాలను ఎంతో ఆసక్తికరంగా చెప్పసాగాడు. ఆ సమయంలో పాండవులు మార్కండేయుడితో “మహాత్మా! ఇన్ని విషయాలను కళ్ళకు కట్టినట్లు చెబుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఆనందంతో పాటూ ఆశ్చర్యం కూడా కలుగుతోంది. మాకో చిన్న సందేహం. మీకంటే ఎక్కువ కాలం జీవించినవారిని మీరెక్కడైనా చూశారా” అని అడిగారు. అప్పుడు మార్కండేయుడు “చూశాను నాయనల్లారా. ఆ కథ చెబుతాను వినండి” అంటూ ఇలా చెప్పసాగాడు.

Пікірлер: 63
@abcallbestcreations466
@abcallbestcreations466 3 ай бұрын
పురాణాల లోని కథలు చెప్పడం అనే మంచి అంశాన్ని ఎన్నుకున్నారు.అభినందనీయులు.💐💐💐
@mattamvijaykumar4432
@mattamvijaykumar4432 Ай бұрын
Jai ser rama ram ram.❤❤🎉🎉
@GunKri
@GunKri Ай бұрын
కృష్ణా 🙏
@k.l.n.h6253
@k.l.n.h6253 4 ай бұрын
జై శ్రీ రామ్🙏🏼 రాజన్ పి.టి.ఎస్ .కే గారు.
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 4 ай бұрын
నేను చిన్నప్పుడు చదువుకున్న కథ,,,, మరలా ఇంత చక్కగా విన్నందుకు సంతోషంగా ఉంది😊🙏🙏🙏
@paadammahesh8395
@paadammahesh8395 4 ай бұрын
గురువుగారు మీరేం చెప్పినా మేము మహా అధ్బుతంగా ఊహించుకుంటాము.. ఊహాలోకాన్ని మించిన ఆనందం ఉంటుందా❤❤ 🕉️🕉️
@shivoham24
@shivoham24 4 ай бұрын
శివోహం శివోహం.. మీ సాహిత్య సేవ అమోఘం రాజన్ గారు.. ❤
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 3 ай бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@kolasatyaprasad5906
@kolasatyaprasad5906 4 ай бұрын
Very good Information
@వాసుదేవాయ
@వాసుదేవాయ 3 ай бұрын
మహాద్భుతం గురువు గారు ఈ కథ లు మీరు చెప్తుంటే ఎంత సేపైనా వినాలనిపిస్తుంది ధన్యులము మేము .🙏
@rammohangoli2592
@rammohangoli2592 Ай бұрын
Very nice
@prasadn1288
@prasadn1288 4 ай бұрын
చాలా బాగుంది
@satyagun1
@satyagun1 3 ай бұрын
మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ కూడా తెలియ జేస్తే మంచిది. 🙏
@ramakrishnamahamkali7830
@ramakrishnamahamkali7830 4 ай бұрын
Sri Gurubyonamaha jai Sri gana nada Jai Sri shanmukha nada Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram 🙏🙏🙏👏👏👏
@anjanicreations8356
@anjanicreations8356 4 ай бұрын
విక్రమార్క కథలు సిరీస్ పెట్టండి గురువుగారు
@geetadevi7210
@geetadevi7210 3 ай бұрын
Yes Vikramarkudu kathalu cheppandi.
@sss898
@sss898 3 ай бұрын
Yes
@venkataratnam3242
@venkataratnam3242 3 ай бұрын
Good story
@mojjadabhujangarao4977
@mojjadabhujangarao4977 4 ай бұрын
సార్ మీకు నమస్కారములు, మీరు వీలు కుదిరితే పిడపర్తి దక్షిణామూర్తి గారి జీవిత విశేషాల పై వీడియో చేయండి సార్.. ధన్యవాదాలు రాజన్ గారు 🙏🙏
@prakashrao8077
@prakashrao8077 4 ай бұрын
Can’t thank you enough. Best wishes
@lalithavamshee8792
@lalithavamshee8792 3 ай бұрын
🙏
@arivu2533
@arivu2533 4 ай бұрын
Dear Brother......please be consistent in hosting videos....🙏🙏🙏
@bulliappalarajuch3595
@bulliappalarajuch3595 3 ай бұрын
Kathalu cheppe vidhanam chala chala bagundi sir.
@KK-fw9vi
@KK-fw9vi 4 ай бұрын
గురువు గారికి నమస్కారములు. ఎన్నో కల్పములు చూసిన మార్కండేయ మహర్షి సప్త చిరంజీవులలో ఎందుకు లేరు. అవకాశం ఉంటే చెప్పగలరు.
@sumangali9800
@sumangali9800 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@nivasn5050
@nivasn5050 4 ай бұрын
Kasi majili kathalu continue cheyandi.Memu roju nidrapoye mundhi avey vini padukuntamu .so pleasee continue cheyandi
@pashammadhukarreddy9118
@pashammadhukarreddy9118 3 ай бұрын
Good
@VamsiKrishna-zb5mj
@VamsiKrishna-zb5mj 4 ай бұрын
Sir mahabharatam sloka tatparya unna vyasa Mahabharatam telugu Ah publication konali andi?
@Ajagava
@Ajagava 4 ай бұрын
గీతాప్రెస్ వారిది తీసుకోండి. సుమారు 7000 పేజీలతో 7 సంపుటాలుగా అందుబాటులో ఉంది.
@VamsiKrishna-zb5mj
@VamsiKrishna-zb5mj 4 ай бұрын
@@Ajagava sir Mee old videos lo backside chusanu 18 volumes Mahabharatam undi adi complete ga untunda andi ?
@srinivasgunda9786
@srinivasgunda9786 3 ай бұрын
JAISRIMANNARAYANA 🙏
@shobhavenkataramanaiah3411
@shobhavenkataramanaiah3411 4 ай бұрын
Very good information
@gsvsubramanym4482
@gsvsubramanym4482 3 ай бұрын
🌹🌹చాలా బాగున్నది సార్ 🎉
@ManaTeluguthalli
@ManaTeluguthalli 15 күн бұрын
ilanti channel inkokati you tube charithralone ledu idikadha mana puranaala goppathanam mana thelu basha goppathanam Meru cheppe vishayalu cheppe paddathi adbhutham Rajan garu meru markandeyudila chiranjeevi ga bhoomi mede undi thelugu basha sahithyaniki unna goppathananni mana puranalaloni goppa goppa vishayalanu mundhu tharalaku cheppi vaariki gnanam panchalani aa. eeswarudni manspoorthiga korukuntunnanu 🙏🙏🙏
@anasurisrinivas7700
@anasurisrinivas7700 3 ай бұрын
Jai sriram
@sureshgotluri3363
@sureshgotluri3363 3 ай бұрын
Thanks 🙏 namaste
@leelanaren2844
@leelanaren2844 3 ай бұрын
కాసి మజిలీ కధలు దయచేసి
@raveendrasvn1
@raveendrasvn1 4 ай бұрын
Thank you 🙏
@kalyanappikatla8737
@kalyanappikatla8737 4 ай бұрын
Katha chala bavundi guruvugaru
@SaiKrishna-nb1wn
@SaiKrishna-nb1wn 4 ай бұрын
ధన్యవాదములు
@saisaikumar6183
@saisaikumar6183 4 ай бұрын
Super
@KirankumarValireddi
@KirankumarValireddi 3 ай бұрын
🚩ఓంనమః శివాయ🚩🙏🙏
@satyanarayananeelam9174
@satyanarayananeelam9174 3 ай бұрын
🎉
@balakameshwararaoayyalasom723
@balakameshwararaoayyalasom723 3 ай бұрын
Namasthe Sir
@raveendrasvn1
@raveendrasvn1 4 ай бұрын
Please place QR CODEof your GPay on the screen to enable transfer from cross payment platforms. Thank
@krishnaraju913
@krishnaraju913 3 ай бұрын
🙏🙏🙏
@sowmyadokuparti
@sowmyadokuparti 3 ай бұрын
Full story description lo petandi if possible please
@prayenify
@prayenify 4 ай бұрын
Sir! అజగవ కి పినాకం కి తేడా ఏమిటి ? రెండింటిని శివ ధనస్సులుగా చెబుతారు!! Thanks for clarifying
@yekkalurjahangeer3008
@yekkalurjahangeer3008 4 ай бұрын
🌹🙏🌹 namaste sir
@vamshikrishnamarupak
@vamshikrishnamarupak 4 ай бұрын
Namaskaram❤
@prasannaveerlanka1975
@prasannaveerlanka1975 2 ай бұрын
2 K ❤ like 🎉 50282 ❤view 🎉😊🙏🌺 మీకు నా అభినందనలు 👍🤝🤗
@unknownauthor417
@unknownauthor417 3 ай бұрын
2:31
@BattuSairam-y4n
@BattuSairam-y4n 3 ай бұрын
కాకభూషూండూ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు ఆయన మూడు కల్పాలు చూశారు విష్ణువు యొక్క అవతారాలు ఎన్నో చూశారు సాక్షాత్తు వశిష్ఠ మహర్షి నే రాముడిని తీసుకువెళ్ళి ఆయనకు పరిచయం చెపించారు కాక భూషుడి గారు ఇలా అన్నారు నేను ఎన్నో రామ అవతారాలను చూసా అందులో నువ్వు 24 వ వాడివి అని స్పష్టంగా చెప్పారు నిజంగా ఆయన బ్రతికిన కాలం బహుశా ఎవరు ఉండక పోవచ్చు అని నా అభిప్రాయం
@LokeshSuvarna-t2i
@LokeshSuvarna-t2i 3 ай бұрын
🚩🚩🚩🛕🪔🪔🇮🇳🙏
@sujthal5593
@sujthal5593 4 ай бұрын
E kadha Vadipatti Padmakar garu Jaganatha క్షేత్ర గురిచి chapparu kani Sree Krishnanulu gee geevitham chalichina pidapa 1st manuvu కాలంలో జరిగినట్లు chapparu
@SameerDharmasastha
@SameerDharmasastha 4 ай бұрын
ಚಾಲಾ ಬಾಗುಂದಿ
@sravanivadlamani2028
@sravanivadlamani2028 4 ай бұрын
కాశీయాత్ర ఎప్పుడు
@Nammi.ThavitirajuThavitiraju
@Nammi.ThavitirajuThavitiraju 3 ай бұрын
కాసి మాజీ లీ కదా లు వు.. మార్చ పోయి రు
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 4 ай бұрын
Gori, thuglak, changeej and now jalaga permanent seats in narakam😂😂😂
@sujthal5593
@sujthal5593 4 ай бұрын
Nanu తప్పుగా vrasunta nanu kamichandi
@mohanvasu198
@mohanvasu198 4 ай бұрын
🙏🙏
@VIDHU_MIND
@VIDHU_MIND 4 ай бұрын
🙏
@jaggarao2312
@jaggarao2312 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 51 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 59 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 43 МЛН
"ఉపాయం": చిట్టి కథలు తొమ్మిదవ కథ | "Idea": Chitti Kathalu Ninth Story
5:35
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 11 МЛН