నీ ప్రేమా ఎంతో ఎంతో మధురం (2) యేసు యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం (2) ||నీ ప్రేమా|| మరచిపోనిది నీ ప్రేమా నన్ను మార్చుకున్నది నీ ప్రేమా కన్ను రెప్ప లాంటిది నీ ప్రేమా జీవ కాలముండును నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| సిలువకెక్కెను నీ ప్రేమా నాకు విలువ నిచ్చెను నీ ప్రేమా నాకై మరణించెను నీ ప్రేమా నాకై తిరిగి లేచెను నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| తల్లికుండునా నీ ప్రేమా సొంత చెల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమా కన్న తండ్రికుండునా నీ ప్రేమా (2) ||నీ ప్రేమా|| త్యాగమున్నది నీ ప్రేమలో దీర్ఘ శాంతమున్నది నీ ప్రేమలో బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో (2) ||నీ ప్రేమా