పల్లవి : ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా విజయవీరుడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీనజనాల దీపముగ వెలుగుచున్నవాడ ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత వున్నతమో వర్ణించలేము స్వామీ నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) 1. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము (2) ఇహమందు పరమందు నాకు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేస్సయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) 2. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన గణమైన నీ నామమందు హర్షించి భజియించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీ వుంటే భయమే లేదయ్యా (2) 3. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై వున్నావులే (2) నిర్మలమైన నీ మనసే నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా (2)
@suvarthajanumala32934 ай бұрын
All glory be to God praise the lord hallelujah hallelujah 🙌🙌🙌🙌🙌🎶🎶
@kattemvidyasagar87214 ай бұрын
Praise the lord brother Glory to God 🙌🙌🙌🙏🙏🙏
@MahimajyothiGolla4 ай бұрын
Glory to god🙌🙇♀️
@DanduJyothiDanduJyothi4 ай бұрын
Amen
@CalvaryKrupaSuvartha4 ай бұрын
Good
@ranibenharoffical3 ай бұрын
Praise the lord Anna 🎉🎉🎉🎉🎉🎉
@MeryBlessy4 ай бұрын
Glory to god🙌
@vinoduneesu21024 ай бұрын
Praise the lord brother
@murugesanmurugesan11243 ай бұрын
Lerecs
@ShesharaoGorre-o9b4 ай бұрын
❤❤
@SharonPushpa254 ай бұрын
🙌Glory to god👏Amen!!🙇♀️Thank you lord for your presence🕊️🕊️