వానలో తడుస్తున్న మనిషి కథ ను విన్నాను! కథ చదవటానికి ముందు రచయిత పరిచయం,మీరు చదవబోయే ఈ కథ కు ఉన్న గొప్ప తనం అదే ఇతర భాషల లోకి ఈ కథ అనువాదం అన్నీ చాలా గొప్పగానే ఉన్నాయి! కానీ, కథలో కుక్క కరిస్తే "శనగలు"తినకూడదని అంటారు రచయిత! అదీ ఎంతమాత్రం నిజం కాదు! మన ఊర్లలో కుక్క కరిస్తే నాటు వైద్యం చేస్తారు! గాయం తగ్గేంత వరకూ పత్యం ఉండాలంటారు! అందులో భాగంగానే "ఉలవలు"కూడా తిన వద్దంటారు! అవి "తింటే" కుక్క లాగ అరిచి చనిపోతారని కూడా హెచ్చరిస్తారు! ఇదీ ఆధునిక వైద్యం పై వాతావరణాన్ని పూర్తిగా మార్చి వేసింది! కనుక, ఈ కథ లోని ఈ అంశం తెరమరుగు అయ్యింది! ఐనా, శనగలకు బదులు ఉలవలు ఉండాలని ఈ పెద్ద రచయితకు వినయ పూర్వకంగానే తెలియజేస్తున్నాను!
@SwathiPantulaАй бұрын
@@venkateswarlusajja8212 రచయిత యవ్వనంలో ఉన్న ఒక మనిషి మనసులో ఉన్న సంఘర్షణను, సందిగ్ధాలను , మనస్థితిని ఈ కథలో చిత్రించారు. చిన్నతనంలో అతడిని కుక్క కరవడం వల్ల కొన్ని అపోహలతో తల్లి అతడిని కట్టడి చేసింది. అక్కడ శనగలు లేదా ఉలవలు ఏదైనా కావచ్చు. ( Protein food) . మనసు పడ్డ మావయ్య కూతురు కూడా తక్కువ చేసి చూసింది. చదువు మీద శ్రద్ధ వహించలేదు.తండ్రి కి కొడుకు మీద నమ్మకం లేదు. ఉద్యోగం ఎవరిస్తారు అని వెటకారం చేస్తాడు. చాలామంది అప్రయోజకుడు అన్నారు. ఇవన్నీ వానలే. తడవకుండా భద్రంగా కిటికీ తలుపులు కూడా మూసుకుని గదిలో కూర్చున్నాడు అంటారు రచయిత ఒక దగ్గర. ఇల్లు వదలి బైటికి వచ్చాక కూడా నచ్చిన మనిషికి ( nurse)తన ప్రేమను తెలియజేయలేని సందిగ్ధం. ఆమెకు ఆసరికే వివాహం అయిపోయిందేమో అన్న ఊహ. అయితే ఒక వర్షం కురిసిన రాత్రి అతడు వర్షంలో తడిసాడు, తినేందుకు శనగలు కొనుక్కుని జేబులో పోసుకున్నాడు. అనుకోని పరిస్థితిలో అతడు తిరిగి ఆమెను కలిసాడు. వివాహానికి అంగీకారం సూచనాప్రాయంగా తెలియ జేసింది. సందిగ్ధాలు, అపోహలు , ఆత్మ న్యూనతా భావం, లోకం ఎత్తిపొడుపు మాటలు.... ఇన్ని వానలనూ లెక్కచేయకుండా అతడు ఇప్పుడు హాయిగా తడుస్తున్నాడు.