ఆవరణ. ఈ రోజు నేను చదివిన ఒక పుస్తకం గురించి మీతో చెప్పాలనిపించింది. అది బైరప్ప అనే ప్రసిద్ద కన్నడ రచయిత వ్రాసిన నవలకు తెలుగు అనువాదం. ఆ పుస్తకం పేరు ఆవరణ. చాలామంచి కథా వస్తువు. నేటి సమాజానికి అద్దం పట్టే కథ. ఇక కథా గమనం చాలా బాగుంది. కథ విపులంగా చెప్పడం కంటే నవల చదివితే బాగుంటుంది. కొంత మచ్చుకకు రుచి చూపిస్తాను. కథా నేపద్యం కన్నడ దేశంలో ఓ పల్లె. ఆ పల్లెలో ఓ గౌడ కుటుంబం. తండ్రి కూతురు. తండ్రి సాధారణ వ్యవసాయ దారు కొద్దిగా చదువుకున్నవాడు. కూతురిని పట్నం పంపి చదివిస్థాడు. స్కూల్ ఆఫ్ యాక్టింగ్ లో. అక్కడ ఆ అమ్మాయి ఒక ముస్లీం యువకునివైపు ఆకర్షితురాలౌతుంది. ఆ ఆకర్షణకు ఇప్పుడు మనం ప్రేమ అనే పవిత్రమైన పదాన్ని తగిలిస్తున్నాం. అది వేరే విషయం. ఈ ప్రేమను ప్రోత్సహించేది స్వయానా వాళ్ళ ప్రొఫెసర్. ఆయన వామపక్ష భావజాలానికి చెందిన వ్యక్తి. ఈ విషయం అమ్మాయి తండ్రికి చెబుతుంది. ఇక్కడ తండ్రి కూతురుతో అన్న మాటలు నా మనసును కదిలించాయి. అమ్మా ఈ పెళ్ళికి నేను ఎలా ఒప్పుకోమంటావు రేపు నీకడుపున పుట్టిన బిడ్డ నేను కొలిచే దేవుడి గుళ్ళను కూలుస్తూ, విగ్రహాలను ముక్కలు చేసే వాడుగా తయారవడని చెప్పగలవా అంటాడు. అవేమీ పట్టించుకోకుండా వారిద్దరూ పెళ్ళి చేసుకుంటారు. అది కూడా ఆ అమ్మాయిని ముస్లీం మతంలోకి మార్చి. అక్కడ నుంచే అసలు కథ మొదలౌతుంది. అబ్బాయిది సంప్రదాయ ముస్లీముల కుటుంబం. ఆభ్యుదయభావాలను వల్లించిన అమ్మాయి భర్త ఇంట్లో భార్యను బురఖా వేసుకోమని చెబుతాడు. తను పెరిగిన సంప్రదాయాలు అన్నీ వదులుకోవలసిన పరిస్థితి వస్తుంది. అమ్మయి లో ఉన్న అభ్యుదయ భావాలు ఎదురు తిరగమని ప్రోత్సహిస్తుంటాయి. కానీ సర్దుకుపోతూ ఉంటుంది. ఈ సంఘర్షణలలోనే ఆమె మంచి రచయితగా పేరు తెచ్చుకుంటుంది. తన బాధలు ప్రొఫెసర్ తో చెబుతుంది. అతను కూడా దానిని అలుసుగా తీసుకుని ఆమెపట్ల చొరవ చూపిస్తాడు. తీసే సినిమాలు, కధలు అన్నీ ముస్లీం రాజులను సమర్థిస్తూ, హిందువులోని చిన్న చిన్న లోపాలను ఎత్తిచూపుతూ, దేశంలో జరిగే చిన్న చిన్న సంఘఠనలను బూతద్దంలో చూపిస్తూ ఆమె రచనలు కొనసాగుతుంటాయి. ఈ మద్యలో ఆమె తండ్రి మరణించినట్లు వార్త తెలుస్తుంది. తండ్రి మరణించిన నెల రోజుల తరువాత ఆమె ఊరికి వెళుతుంది. తండ్రి గది అన్నీ చూస్తుంది. తండ్రి తాను వెళ్ళిపోయిన తరువాత చదవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్నాడు. చరిత్రమీద మంచి గ్రంథాలయం ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఇంగ్లీషులో మంచి పట్టుసాధించాడు. తాను చదివిన పుస్తకాలలో ఉన్న విషయాలను ఒక నోట్సుగా వ్రాసుకునేవాడు. అవి అన్న చూసిన ఆమే ఆ పుస్తకాలు చదవడం మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ తాను వ్రాసిన చారిత్రక కథలకు తన తండ్రి వ్రాసుకున్న నోట్సుకుచాలా తేడా కనిపించింది. తన తండ్రి సాక్షాలతో సహా సంఘఠనలను వ్రాసి పెట్టుకున్నాడు. అప్పుడు మొదలైంది ఆమెలో ఆలోచన. నిజం తెలుసుకోవాలనే తపన. తన భర్తతో చెప్పి కొంతకాలం పల్లెలో ఉండడానికి నిర్ణయించుకుంది. ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న చరిత్ర వక్రీకరణ, నిజాలను కప్పిపుచ్చి ప్రజలను తప్పుత్రోవ పట్టించేందు కు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రకోణం. దీని వెనుక ఉన్న శక్తులు ఆమెకు ఒక్కొక్కటే కళ్ళముందు కనిపించసాగాయి. తాను నిజాలు వ్రాయడం మొదలు పెట్టగానే ఆమె పై దాడులు, పోలీసుల దౌర్జన్యాలు, మూకల నిరసనలు మొదలౌతాయి. నవల ఆసాంతం ప్రస్తుత భారత దేశపు పరిస్థితిని కళ్ళకు కడుతుంది. ఇంకా చాలా చాలా విషయాలు పాత్రలు మాట్లాడతాయి. ఈ నవల చదవండి మీకే తెలుస్తుంది. విషయం కొంచెం రుచిచూపించాను అంతే. మీకోసం మీ మదన్ గుప్త 19-9-2018
@rangaswamyks8287 Жыл бұрын
You are a good reder I read this book 3 times. Perchased in sapna sir
@suhasinibadnikai69636 ай бұрын
👌🙏🙏
@pradhyumnamuralidharan4168 Жыл бұрын
They should make a web series based on this book.
@prafullachandrashetty0830 Жыл бұрын
The book should be made optional non detailed text for all universities.
sir nijavaglu helbeku andre .. e book prati hindu odidre bere yenu beda sir ... kashmiri file adu idu yenu beda ... idu just book alla sir ... hindu gala jeevana idanna tilkobeku.. yest janakke helide yav nu odata illla idanna highlight madbeku sir
@rangaswamyks8287 Жыл бұрын
Nanu avarana dhuddu kottu kondu 3 bari odhidhe Friends ge kodalla Yakandhre avaru kondu odhali.. Cinema ge 500rs kharchu madthare adhre Pusthaka odhalla adhakke
@rangaswamyks8287 Жыл бұрын
Avarana odhidha Mele 8 dhina Nidhre baralilla
@rashmis42664 жыл бұрын
Super Brother😊
@-sahityamanthana12224 жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು.
@AA-ng6jo4 жыл бұрын
Super sir
@ayyappaalkd57464 жыл бұрын
Nice sir
@-sahityamanthana12224 жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು.
@digvijaysinhsoddha12003 жыл бұрын
Sitaramji goel,Ramswarupji Bhyrappa ji ye insaan nahi Intellectual क्षत्रीय है Inhe navkaal mahrishi kaha jana chahiye