ani aanatichhey krushnudu arjununito

  Рет қаралды 14,823

YVG ANNAMAYYA AKSHARA VEDAM

YVG ANNAMAYYA AKSHARA VEDAM

Күн бұрын

Пікірлер: 26
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 144 ANI AANATICHHEY KRISHNUDU ARJUNUNITO.. 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 PREFACE :-- 🌹🌹 Annamacharya with his divine poetic skills has written many sankeertanas narrating the essence of bhavadgeeta slokas in very simpler words easy to understand and yet delivering the greatest knowledge of Vedanta . 🙏 Before listening to this sankeertana it is highly recommended to read these four slokas of bhagavadgeeta from chapter no 15 The Purushottama Yoga where in the verses 12 - 15 the Supreme Glory of the Lord Was revealed .🙏 15-12 🌹🌹 yad āditya-gataṁ tejo jagad bhāsayate ’khilam yach chandramasi yach chāgnau tat tejo viddhi māmakam 15.12:🌹 Know that I am like the brilliance of the sun that illuminates the entire solar system.🙏 The radiance of the moon and the brightness of the fire also come from Me.🙏 15-13 🌹🌹 gām āviśhya cha bhūtāni dhārayāmy aham ojasā puṣhṇāmi chauṣhadhīḥ sarvāḥ somo bhūtvā rasātmakaḥ 15.13:🌹 Permeating the earth, I nourish all living beings with My energy. 🙏 Becoming the moon, I nourish all plants with the juice of life.🙏 15-14 🌹🌹 ahaṁ vaiśhvānaro bhūtvā prāṇināṁ deham āśhritaḥ prāṇāpāna-samāyuktaḥ pachāmy annaṁ chatur-vidham 15.14: 🌹 It is I who take the form of the fire of digestion in the stomachs of all living beings, and combine with the incoming and outgoing breaths, to digest and assimilate the four kinds of foods.🙏 15-15 🌹🌹 sarvasya chāhaṁ hṛidi sanniviṣhṭo mattaḥ smṛitir jñānam apohanaṁ cha vedaiśh cha sarvair aham eva vedyo vedānta-kṛid veda-vid eva chāham 15.15: 🌹 I am seated in the hearts of all living beings, and from Me come memory, knowledge, as well as forgetfulness.🙏 I alone am to be known by all the Vedas, am the author of the Vedānt, and the knower of the meaning of the Vedas.🙏 ( COURTESY -- BHAGAVADGITA THE SONG OF THE GOD COMMENTARY BY SWAMI MUKUNDANANDA )🙏🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 The above four verses were narrated in the keertana with the simplest words that can be understood by all . 🙏 Who else can write the essence of bhagavadgita in a much simpler way , other than padakavitapitanaha Sri Tallapaka Annamacharya .🙏 Here goes the sankeertana as below :-- 🌹🌹👇 🌹🌹 Thus Sri Krishna Ordained Arjuna ! 🙏 Do Llisten To It and Be Wise enough to Worship Him !!🙏 🌹🙏🌹 🌹🌹 By Descending Onto The Earth to Bear and Sustain all Living Beings Iam That Lord Holding Everything with stratagem !🙏 With Love and Care Iam The Nourisher of All Crops and Grains By Being As The Cool Moon Light , Iam That Lord !!🙏 🌹🙏🌹 🌹🌹 By Being As The Mystic Fire Of Energy Iam dwelling inside every one making their hunger and also to digest the food they eat .🙏 I am the God that dwells and shine in the hearts of all to sharpen their memory and also to blunt their memory.🙏 🌹🙏🌹 🌹🌹 I am the Primordial God that can be comprehended by all Vedas and can be percieved by erudite philosophers.🙏 Along With My Consort SriDevi Having settled at Venkatadri As permanent abode Know that Iam The Lord Venkateswara !!🙏 🌹🙏🌹 OM SRI ALAMELUMANGA SAMETA SRI VENKATESWARA SWAMINEY NAMAHA!! 🙏🙏 ✍️ --VENUGOPAL 🙏
@nookrajlucky9400
@nookrajlucky9400 7 ай бұрын
S Janaki Amma ❤❤❤
@jaganmohan1272
@jaganmohan1272 11 ай бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
i salute to Melody Singer SmT.Janakamma gari lotus foot..
@jaganmohan1272
@jaganmohan1272 Жыл бұрын
Om namo bhagwate vasudevaya namaha
@Guha472
@Guha472 Жыл бұрын
🙏🙏🙏Govinda Govinda very meaningful sankirtana
@narramadhu2683
@narramadhu2683 4 ай бұрын
Adbutam 🙏🙏🙏🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 Жыл бұрын
Excellent Keerthana Govinda Govinda Govinda Om Namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thank you very much
@VijayaLakshmi-cc3je
@VijayaLakshmi-cc3je Жыл бұрын
@manisai7156
@manisai7156 Жыл бұрын
జై శ్రీ కృష్ణా 🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *#అన్నమయ్య_అక్షరవేదం** ..సంపుటి -- 144* *( **#అనియానతిచ్చె_కృష్ణుడర్జునునితో** ... )* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *ఓం నమో వేంకటేశాయ.* 🙏 *అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు .*💐 ✍️ *-- మీ వేణుగోపాల్ యెల్లేపెద్ది* 🙏 *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 144 కి శుభ స్వాగతం ..*🙏 *ప్రార్ధన ః--* 🌹🌹 *భగవద్గీతను స్వయముగ* *భగవంతుడె దెలిపెనయ్య ! భవసాగరమున్ -* *తెగువన నీదుట నెట్లో ,* *జగతికి బోధించెను నిజ జ్ఞానంబేదో !!* 🌹🙏🌹 ✍️ *--స్వీయపద్యము ( కందము )* *నా భావము ః--* 🌹🌹👇 వేదాంత సారమైన ఆ భగవద్గీతను స్వయముగా భగవానుడే మనకు తెలిపెనని తెలుసుకుందాము ! 🙏 ఈ సంసారమనే సాగరమును ధైర్యముగా ఎలా ఈది ఒడ్డుకు చేరుకోవాలో , ఈ జగతి జీవులందరికీ చక్కగా చెప్పాడు !🙏 నిజమైన సుజ్ఞానము యేదో చక్కగా బోధించాడు స్వయముగా ఆ భగవానుడే !!🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 గీతా సారమును తేటతెలుగు మాటలలో పాటలలో చెప్పుటకు పదకవితా పితామహుడైన అన్నమయ్యకు సాటి ఇంకెవ్వరూ లేరు ! 🙏 ఈ సంకీర్తన వినేముందు , పాడేముందు, చదివేముందు ఈ క్రింది గీతా శ్లోకములను మున్నుడిగా అర్ధము చేసుకుంటే అన్నమ్మయ్య రచనా వైశిష్ట్యము ఎంత గొప్పదో అవగతమవుతుంది .🙏 *15 వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగము లోని 12 - 15 శ్లోకాలను గమనిద్దాము .* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *మున్నుడి ః--* 🌺🌺 *యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।* *యచ్చంద్రమసి యాచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్* *।। 15-- 12 ।।* 🌹 *15.12:* సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. 🌹 చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము.🌹 *గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ।* *పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః* *।। 15 -- 13 ।।*🌹 *15.13:* పృథ్వి యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి, నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను.🌹 చంద్రుడిగా ఉండి, సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.🌹 *అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।* *ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్* *।। 15 --14 ।।* 🌹 *15.14:* నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు ఒంటబట్టించుకొనటానికి, జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను.🌹 *సర్వస్య చాహం హృది సన్నివిష్టో* *మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ ।* *వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహమ్* *।। 15 -- 15 ।।* 🌹 *15.15:* నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి.🙏 అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదార్ధమును తెలిసినవాడను నేనే.🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 ఈ నాలుగు శ్లోకాలనే సంకీర్తన గా అలవోకగా వ్రాసి మనకు అందించారు అన్నమాచార్యుల వారు .🙏 మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా !!🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 ఈ విధముగా సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ,అర్జుననకు ఉపదేశము చేసెను ! 🙏 ఓ జీవులారా మీ యందరూ కూడా ఇది ఆలకించి, వివేకముతో పరమాత్ముని మాటలు గ్రహించుకుని , ఆతనిని భజించండి !🙏 🌹🙏🌹 🌹🌹 ఈ విధముగా భగవానుని ఉవాచ వినండి సర్వాంతర్యామినైన నేను , భూమిలోపల సర్వ ప్రాణులనెల్లా , సాకుతున్నది నేనే !! 🙏 ప్రేమతో ఆ చంద్రుడనై , చల్లదనమునూ , నీటినీ ఇచ్చి , పంటలు పండించి , అందరినీ పోషిస్తున్న దేవుడను నేనై యున్నాను ! 🙏 🌹🙏🌹 🌹🌹 జీవులలో జఠరాగ్నినై , వారు తినే వివిధ అన్నములను ,ఆరగింపు అయ్యేటట్లు చేసే దివ్య శక్తిని నేనై యున్నాను ! 🙏 అందరి అంతరాత్మలలోనూ ,వెలుగై భాసిస్తూ ,యెఱుకలు , మరపులు , అన్నీ నేనే కలిగించు వాడనై యున్నాను ! 🙏 🌹🙏🌹 🌹🌹 వేదములు అన్నియూ దేనిని పొగడుచున్నవో అదినేనై యున్నాను . 🙏 ఎంతటి వేదాంత వేద్యులు అయినా తొలుతగా తెలుసుకొనదగిన వాడనునేనై యున్నాను .🙏 మీరందరు చక్కగా భావించగలిగితే , ఇక్కడే శ్రీదేవితో కూడి మీ కోసమే నిలిచియున్న , తిరువేంకటాద్రి నాధుడనూ కూడా నేనే అయి ఉన్నాను .🙏 🌹🙏🌹 *ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !*🙏🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 *( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 144)* ✍️ *---వేణుగోపాల్ యెల్లేపెద్ది*🙏
@srilathagodavarthi454
@srilathagodavarthi454 3 жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏 అందరికి గీతాజయంతి శుభాకాంక్షలు 💐💐💐 ఈ ఒక్క కీర్తనలో గీతాసారం అంతా అందించారు అన్నమయ్య. అద్భుతమైన కీర్తన. 🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
గిత జయంతి శుభాకాంక్షలు మీకు . చాలా సంతోషమమ్మా మీకు నచ్చినందుకు ..
@suryanarayanavaddadi1140
@suryanarayanavaddadi1140 2 жыл бұрын
@@yvgannamayyaaksharavedam6942 9
@niveditah1103
@niveditah1103 3 жыл бұрын
OM NAMO VENKATESAYA 💖✨🙏🌹🌺
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
thank you very much for the like
@MsKalluuu
@MsKalluuu 3 жыл бұрын
గీతాజయంతి శుభాకాంక్షలు🙏🏻🙏🏻🙏🏻
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
ధన్యవాదములు .ంఈ అమ్దరికీ కూడా గీతా జయంతి శుభాకాంక్షలు
@srinivasavarmap6979
@srinivasavarmap6979 3 жыл бұрын
It's very nice YVG sir, thank you very much sir 🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
Thank you so much .. wishing you all a happy gita jayanti ...
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 *సంకీర్తన* 🌹🌹 అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో విని యాతని భజించు వివేకమా // పల్లవి // భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల దీమసాన మోచేటిదేవుఁడ నేను కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై తేమల బండించేటిదేవుఁడ నేను // అని // దీపనాగ్నినై జీవదేహములయన్నములు తీపుల నరగించేటిదేవుఁడ నేను యేపున నిందరిలోనిహృదయములోన నుందు దీపింతుఁ దలఁపుమరపై దేవుఁడ నేను // అని // వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచే ఆది నే నెరఁగఁదగినయాదేవుఁడను శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద పాదైనదేవుడఁను భావించ నేను // అని // 🌹🙏🌹
@m.revanth6454
@m.revanth6454 2 жыл бұрын
🙏😊 జానకమ్మ పాడిన కీర్తనలు మరిన్ని అప్లోడ్ చేయండి
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 жыл бұрын
@@m.revanth6454 tappakunda chestaanandi videos thank you
@m.revanth6454
@m.revanth6454 2 жыл бұрын
@@yvgannamayyaaksharavedam6942 thank you 🙏😊
@kornekishorebabumudhiraj7551
@kornekishorebabumudhiraj7551 3 жыл бұрын
Singing purpose Read 📖
@jaganmohan1272
@jaganmohan1272 10 ай бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 10 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 17 МЛН
SKYLS BG 4 7
25:57
SKYLS
Рет қаралды 35
He Memorized the Qur'an in 10 Months!  || My Tazkiyah Podcast
1:09:17
My Tazkiyah Podcast
Рет қаралды 5 М.
ettu singaarinta mamma ee inthini
7:04
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 27 М.
poddikanennadu podachuno
6:39
YVG ANNAMAYYA AKSHARA VEDAM
Рет қаралды 8 М.
Ani yaana thichche Krishnudu...
5:22
Balakrishna Prasad Garimella
Рет қаралды 73 М.
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 10 МЛН