ఆచార్య వెంకట చాగంటి గారికి ప్రణామాలు ఆ అమ్మాయి ఇతర మతస్థులకు, దైవాన్ని వ్యతిరేకించే వారికి కౌంటర్ గ చెప్పారేమొ ఆచార్య.
@Creator369-p7b17 күн бұрын
వేదం వివరించే పరమాత్ము డుని సింబాలిక్ గా లింగంలో చూస్తూ, ఆ లింగం కు పాలు పెరుగు నెయ్యి సమర్పించి నైవేద్యం పేరుతో రోజు మానవులు వాడాలని తినాలి బలిష్టంగా ఉండాలని ఆ పద్ధతులను పెట్టి ఉండొచ్చు గా.....
@srinivaschiluveru414813 күн бұрын
వెంకట చాగంటి గారికి నమస్కారాలు, మీ సమాధానము కొంచెం ఇబండిని కలిగించింది. ఇక్కడ మీరు ఆ అమ్మాయిని విమర్శించే ధోరణిలో మాట్లాడుతున్నారు, కానీ ఆ అమ్మాయి మన్సులోని బాధ మన పండుగలకి ఈ విధం గా అడ్డము వస్తున్నారో అనేది మాత్రమే చెబుతుంది. ఈ రోజుల్లో హిందువులు గుల్లకి వెళ్ళటమే తగ్గించారు అల్లొంటిది ఇటువంటి మాటలు వింటుంటే అసలు వెళ్ళరేమో అని ఆ అమ్మాయి విచారం. మరి శివునికి అన్నీ రాకాల అభిషేకాలు ఉంటాయి కదా వారి గురించి మీ సమాధానం ఇక్కడ ఇవ్వలేదు. కావున అది కూడా వివరిస్తే బాగుండేది.
@ajeyavijayeendra832512 күн бұрын
అవును, నిజం
@ajeyavijayeendra832512 күн бұрын
తెలుగులో రాసినందులకు నెనరులు. కాకపోతే అక్షర దోషాలు వున్నాయి. ఇబ్బంది, అలాంటిది, గుళ్ళు వగైరా
@ajayvellanki14 күн бұрын
నమస్కారం గురువు గారు, శివలింగం అభిషేకం గురించి మనము ఇంకొంచెం research చేయాలని నా ఉద్దేశం. సాధారణంగా ఈ అభిషేకాలు, గుడిలో శివలింగం, ఇంటిలో శివలింగం లేదా లోహవిగ్రహాలికి చేస్తుంటాము. ఇది మనము ఒక పుణ్య మరియు ఆరోగ్య సంబంధ కార్యం లాగా ఎందుకు చూడకూడదు, అంతేకాదు యజ్ఞం చేసేటప్పుడు ఎలా రకరకాల పదార్దాలు అగ్నిలో వేస్తామో, అభిషేకం చేసేటప్పుడు చాలా పదార్ధాలు మరియు ద్రవాలు పోసి చేస్తాము. అంటే ఇదికూడ ఒక యజ్ఞం లాంటిది అవ్వొచ్చు కదా. నా చిన్న తనం లో ఒక పురాతన ఆలయంలో అభిషేకం చేసిన ద్రవాలు గర్భ గుడి నుంచి రంద్రాల గుండా ఒక రాతి మాడుగులో పడేవి. మేము అందులో నుంచి పంచామృతాలు లాంటి ఆ ద్రవన్నీ తీర్ధము గా సేవించే వాల్లము. చాలా మంది ఈ తీర్ధం వ్యాదులు తగ్గిస్తుంది అని చెప్పేవారు, అంటే కాకుండా ఒంటికి కూడా పూసికొని చర్మవ్యాదులు తగ్గుతున్నాయి అని నాతో అనేవారు. నేను కూడా నా అనుభవం లో అది ఒక ఔషదం ల వాడేవాడిని. ఇంకొక విధంగా చూస్తే, ఇంటిదగ్గార అభిషేకం చేసిన తీర్ధన్ని అందరికీ ఫ్రీగా పంచుతారు, అంటే దానం లాగా దానివలన పుణ్యం కూడా వస్తుంది అని నమ్ముతారు. ఇక్కడ వృదా కూడా చేయకూడదు అని చెప్పతారు. వృదా చెయ్యకుండ చేసిన అభిషకం శాస్త్ర ప్రమాణీకతను మనం ఇంకా మనము పరిశోధించ వలసి వుంది అని నా అభిప్రాయము.
@sarada14117 күн бұрын
Thanks andi . Chala baaga chepparu.
@mr.akkannak258917 күн бұрын
వెంకట చాగంటి గారు, మీరు అంటే నాకు గౌరవం వుంది. కానీ. మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్న ను. ఆమె వీడియో లో చెప్పినది ఏమిటి అంటే, హిందువులు కు విగ్రహ ఆరాధన అలవాటు వుంది, విగ్రహం లో దేవుడు ను చూసుకుంటారు, కాబట్టి విగ్రహం కు పగలడం లాంటిది అయితే, దేవుడు కు అయినట్టు భక్తులు బాధ పడతారు అని. మీకు విగ్రహ ఆరాధన వేదాలు లో లేదు నమ్మడం వల్ల , విగ్రహ ఆరాధన తప్పు అనిపిస్తే, మీకు ఇంకొక ప్రశ్న రావాలి. అసలు దేవుడు ను చూడకుండా, కేవలం ఎవరో వ్రాసిన పుస్తకాలు చూసి, చదివి దేవుడు వున్నాడు అని ఎలా నమ్మడం అని? మీది కూడా గుడ్డి నమ్మకమే కదా పుస్తకాలు చూసి దేవుడు ఉన్నాడు అనుకుంటే. దేవుడు ఉన్నది , లేదో తెలుసుకుని అప్పుడు ప్రశ్న అడగండి. మీరు ముందు కళ్ళు తెరచి, అప్పుడు గుద్ది వారికి దారి చూపించండి. పుస్తకాలు చదివి దేవుడు ఉన్నాడు అని నమ్మడం కూడా గుద్ధిదే. అప్పుడు గతం లో ఎవరో కొందరు విగ్రహ ఆరాధన ద్వారా సమాజం లో వ్యక్తులు ను దైవ భక్తి అలవాటు చెయ్యడానికి ప్రయత్నం చేస్తే, అది తప్పు ఎలా అవుతుంది? అది తప్పు అయితే, గుడ్డిగా మత పుస్తకాలు చదివి దేవుడు ఉన్నాడు అని నమ్మకం కూడా తప్పు అవుతుంది. నిజం గా మనకు దైవ భక్తి వుంటే, దేవుడు ను ఎలా ఆరాధన చేసినా, ఏమి తేడా ఉండదు. విగ్రహం కు దండం పెడితే అది దేవుడు కే వెళుతుంది, ఎందుకు అంటే, మన మనస్సు లో దేవుడు మీద భక్తి వుంటుంది తప్పు, అక్కడ వున్న విగ్రహం మీద కాదు. అందుకే, గుడికి వెళ్ళేవారు చాలా ప్రశాంతం గా వుంటారు, దేవుడు మీద దృష్టి వుండటం వల్ల. విగ్రహం అన్నది ఒక మాధ్యమం మాత్రమే. మనస్సు లో దేవుడు మీదే దృష్టి వుంటుంది. మీకు విగ్రహ ఆరాధన అలవాటు లేకపోవడం వల్ల, ఈ విషయం అర్థం కావడం లేదు. నేను విగ్రహం లేకుండా మనసు లోనే దేవుడు ను దండం పెట్టుకుంటాను చాలా సార్లు, మరి కొన్ని సార్లు గుడి కి వెళ్లి విగ్రహం ను దండం పెట్టుకుంటాను. నాకు ఏ వ్యత్యాసం అనిపించదు, రెండు ఒకేలా ఉంటాయి. భక్తి అనేది ప్రధానం.. ఇక శివ లింగం మీద లేక ఇతర దేవుళ్ళు విగ్రహాలు మీద నీరు, పాలు లాంటివి అభిషేకం చెయ్యడం అన్నది మనకు దేవుడు మీద వున్న భక్తి ను చూపించే ఒక ప్రక్రియ మాత్రమే. ఇందులో ఏ తప్పు లేదు. కాకపోతే , అతిగా ఈ పని చెయ్యకూడదు. కొంచెం నీరు, కొంచెం పాలు పోసినా చాలు. మన భక్తి ను ఈ విధం గా నెరవేర్చుకోవచ్చు. అతిగా నీరు పోసిన, అతిగా పాలు పోసిన అవి వృధా అవుతాయి. వాటి వల్ల దేవుడు ఆనందించడు, మనకు కూడా నీరు, పాలు వృధా చేసినట్టు అవుతుంది. భక్తి వుండాలి తప్పు పిచ్చి నమ్మకం , మూర్ఖపు భక్తి వుండకూడదు. అతి ఏది అయినా ప్రమాదమే.
@akv-myideas4u17 күн бұрын
ముందుగా వెంకట చాగంటి గారు చెప్పిన విధానం బాగుంది (యేదానికి అయినా ఆధారం వేదమునే ప్రామాణికంగా తీసుకొని చెప్పాలి). ఇక విషయనికి వొస్తే, యెవరో అమ్మాయి యేదో భావోద్వేగాలకు లోనై అలా చెప్పింది అని అనుకున్నా, దాని మీద ఇంతలా చర్చించాల్సిన అవసరం లేదు. ఇక అసలు విషయనికి వొస్తే, వెంకటాచారి గారు యజుర్వేద అధ్యాయం 40 మంత్రం 8 అని ప్రామణికంగా చెప్పిన మంత్రం, "అవ్రణమస్నావిర" అంటే వ్రుణాలు లేనటువంటిది అని చెప్పారు కానీ పంచామ్రుతాలతో అభిషేకం చెయ్యకూడదు అనేదానికి మాత్రం యెటువంటి ప్రామాణికము చూపలేదు. ఇప్పుడు మనము చెప్పుకుంటున్న మంత్రాలు అన్నీ వేదాలనుంచి వొచ్చినవే అని చెప్పటంలో యెటువంటి సంకోచము లేదు. మరి అటువంటి వేద మంత్రాలలొనే చాలా చక్కగా చెప్పారు, భగవంతునికి పంచామ్రుతాలతో అభిషేకం చెయ్యాలి అని. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అభిషేకం చేసిన పంచామ్రుతాలను ప్రసాదంగా తీసుకోవాలి కాని పడెయ్యరాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో, అభిషేకప్రసాదాన్ని తీసుకొవడం కంటే పడేయ్యటం అన్నది చాలా యెక్కువగా చూస్తున్నాము. అలా పడెయ్యటం కంటే దేవుడికి సమర్పించకుండా ఉండటంలొ అస్సలు తప్పులేదు, అన్నది నా అభిప్రాయము.
@r.v.snageswararao578117 күн бұрын
వెంకట చాగంటి గారికి నమస్కారములు
@littlepranavsworld96324 күн бұрын
Namaskaram guruvugaru Naadi oka sandeham Palatho,perugutho,tenetho,panchadaratho,mari anno vishesha dravyalaku vivida mantaru vedam lo cheppabadi unnayi kada Oka vela aa mantralu lekapoyinatlu ayite vividha punyashetralalo(Kasi,migilina jyotirlingalalo)tappu mantralu ante vedam lo leni mantralu chadavaru kada Anthe kadu chala vishnalayalu kuda tirumanjanamu ani palu,perugu etc vadu taru kada
@sukruthareddy12213 күн бұрын
ప్రతి శివాలయం కింద వ్యవసాయ భూమి ఉండాలి. అభిషేకం చేసిన ధారలు పంటలకి పారించాలి. ఈవిదంగా భూమిని పుష్టిగా మారుతాది.
@wonders.nature8017 күн бұрын
8:14అభిషేకం అనేది సనాతనం నుంచి చేస్తున్నారు కానీ అది వృధా అనడానికి లేదు. దేవుడి కంటే అధికులం కాబట్టి ని సొంత జ్ఞానాన్ని వాడొచ్చు కాని అది తప్పు.జై శ్రీ రామ్.
@sowjanyagajula301017 күн бұрын
Namaste.What is the purpose of bathing in river during mahakumbh? Does it have any astrological or health significance? What exaclty is needed to be done during this time? Looking forward for your valuable information. Thank you
@pnrsinformatics76717 күн бұрын
ఈ శివారాధన, అభిషేక ప్రక్రియ అనాదిగా మన పెద్దలు పురాణాల ద్వారా చెప్తూ ఉన్నారు. అదీ సైంటిఫిక్, ఆధ్యాత్మిక, సామాజిక ప్రయెాజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రక్రియలు. సైటిఫిక్గా ఆలోచించి విశ్లేషించాలిగని ఇలా అభిషేకాన్ని మీలాంటి వాళ్ళు కొట్టిపారేయకూడదు! వేదం ఎంత మందికి అందుబాటులో ఉంది? ఎంతమంది అర్ధంచేసుకోగలరు. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచించి మన ఋషులు విస్త్రుత సామాజిక ప్రయెాజనాలను ద్రుష్టి లోఉంచుకునే మన పూజా మరియు ఉపాసనా విధానాలను, ప్రక్రియలను ప్రవేశ పెట్టారుకదా!.
@సనాతనధర్మంభగవంతునిధర్మం17 күн бұрын
అనాది అంటే కోటి 97 లక్షల సంవత్సరాల క్రితం నుండి ఉండాలి అనాది అంటే సృష్టి ఆరంభం నుండి ఉండాలి అనాది అంటే వేదంలో ప్రస్తావన ఉండాలి ఉంటే రిఫరెన్స్ ఇవ్వండి జనవరి నుండి పుట్టిందే విగ్రహారాధన తర్వాత హిందూయిజం లోకి వచ్చా విగ్రహారాధన వయసు 3000 సంవత్సరాల లోపల
@uday41719 күн бұрын
Sir First time, I’m feeling like, you have done a video without enough research, పంచామృతాలు మీద సరైన రీసెర్చ్ చేసి వీడియో చేయవలసిందిగా మనవి… and శివాలయంలో అభిషేకం చేసిన పంచామృతాలు మల్లి ప్రసాదం గానే ఇస్తారు, ఇక్కడ వేస్ట్ ఎక్కడ ఉంది? yes ఒక విషయంలో మిమ్మల్ని సమర్ధిస్తాను, నవగ్రహాల దగ్గరా మనవాళ్ళు నానా చెత్తా చేస్తున్నారు అది మహా దోషం, I’m always follow your videos and will do it forever, ఎవరో వేస్ట్ గాళ్లు వీడియో చేస్తే నేను పట్టించుకోను but మీరంటే చాలా అభిమానం గలవాడిని అందుకే comment పెట్టకుండా ఉండలేక పెడుతున్నా, ఓం నమః శివాయ
@mukalachinaramana588216 күн бұрын
నా అభిప్రాయం ప్రకారం "శివ లింగానికి గాని విగ్రహంలు కాని అభిషేకం చేస్తున్నప్పుడు శివ లింగం, విగ్రహం లు నుండి వెలువడు దివ్యమైన ప్రకంపణలు నలువైపులా వ్యాపించి వాటి శ్రేష్ఠత అక్కడ కొలుస్తున్న భక్తులుకు లభిస్తుంది. ఎందుకంటే ఆ శివలింగం, విగ్రహాలు ప్రతిష్ట చేసిటప్పుడు యంత్రాలు, మంత్రాలూ తో చేస్తారు. మంచి పాజిటివిటీ వస్తుంది. ఈ విషయాలు శాస్త్రీయ పద్దతి లో పరిశోధన చేసి కనుగొన్నారు కూడా.
@phanebhushanrao962017 күн бұрын
EMPHATICALLY SHE IS RIGHT
@MURALIKRISHNA-dw5pj17 күн бұрын
మీ మాటలు ఈమధ్య అర్ధంకావడం లేదు సార్. ద్వందం గా ఉన్నాయి.. ఆ అభిషేకాల వల్ల, భూమి లో కొన్ని లక్షల జీవరాసులకు ఆహారం అవ్వవచ్చు గదా. అట్లయితే... దేవతలకు.. మనం యజ్ఞాలు.. ఎందుకు చేయాలంటారు.. వాళ్ళు omni potent, omni present కదా...
@unpluggedalphaa17 күн бұрын
😂 ముందు దేవతలు అంటే ఏంటో తెలుసుకోండి. ఆ తరువాత అడగండి. మీరనుకునే దేవతలు కాదు. యజ్ఞ యాగాలు చేసేది ఎందుకో కూడా తెలుసుకోండి.
@srinivaschiluveru414813 күн бұрын
ఏమో శివలింగము ద్వార మనము చేసే అభిషేకాలు అంత భూమి లోకి పోతాయి. అప్పుడూ కొన్ని జీవాలను మనము బ్రతికిస్తున్నట్లు మరియు సేవ చేస్తున్నట్లేమో ఏమో ఆ శివునికే తెలియాలి. కానీ ఈ పదార్ధాల భూమి లోకి వెళ్లి అవి మనకు భవిష్యత్తులో ఉపయోగ పడతాయి ఏమో. ఈ జనాలు ప్లాస్టిక్ వ్యర్ధాలు భూమిలోకి వెళ్లి మన భూసారానికి నష్టం కలుగుతుంది కదా అయిన ప్లాస్టిక్ వాడతారు. వాటి గురించి ఎవరు పట్టించు కోరు
@NaveenKumar-nf9od17 күн бұрын
Jai shree Rama 🚩🚩
@emandisatishkumar270515 күн бұрын
భగవంతుడు ఒక్కడే ఆ ఒక్కడు ఎవరు అన్నది చాలామందికి సందేశం వస్తుంది నేను చెబుతాను మనసుతో చదవండి రాముడు కృష్ణుడు ఏడుకొండల స్వామి వీళ్లు ఆయా కాలాలలో ప్రపంచాన్ని నడిపించడానికి వచ్చిన అవతారమూర్తులు అలాగే ఏసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్త గురు నానక్ గౌతమ బుద్ధుడు వీళ్లు కూడా ప్రేమ అనే తత్వం నేర్పించడానికి వచ్చిన ధర్మస్థాపానికి వచ్చిన ధర్మ పితలు అలాగే ఎల్లమ్మ దుర్గమ్మ పోలేరమ్మ నూకాలమ్మ మోదకొండమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వీళ్లు ఆయా కాలాలలో ప్రపంచాన్ని నడిపించడానికి వచ్చిన దేవతలు భగవంతుడు ఒక్కడే మనం అమ్మానాన్నలకే కదా పుట్టాము అంతేగాని అమ్మానాన్న సెక్స్ చేసుకుంటే పుట్టాము అని అనుకోము కదా అలాగే అమ్మానాన్నలని మనం చూసాం వాళ్ల అమ్మానాన్నలని చూసే ఉంటాం వాళ్ల అమ్మానాన్నలని చూడలేదు కదా అలాగే మనం పురుషుడిగా పుడితే పురుష లింగం శ్రీ గా పుడితే శ్రీ లింగం లింగం అంటే ఒక ఆకారం అని అర్థం మనం ఒక ఆకారానివి ఆకారమే శివలింగం మనం ఎన్ని జన్మలెత్తినా 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన 1000 ముందుకు వెళ్లిన ఈ రెండిటిలో నుంచి మనం ఈ భూమి మీదకి రావాలి మరి మనందరికీ ఆయనే నిదర్శనం అదే శివలింగం ఆయనే నిరాకారుడు జ్యోతి స్వరూపుడు ఆయనే భూతప్రేత పిచాచాలని సృష్టించి పరిపాలించేవాడు ఆయనే భూతనాథుడు ఆయనే విశ్వనాథుడు ఆయనే మనందరికీ తండ్రి ఆయనే సర్వ ఆత్మలకి తండ్రి ఆయన పేరే ( సదాశివుడు ) సదా అంటే ఎల్లప్పుడూ శివ అంటే కళ్యాణకారి అని అర్థము ఎల్లప్పుడూ లోక కళ్యాణం జరిపిస్తూ ఉంటారు యెహోవా అన్నా అల్లా అన్నా అది ఒక మాయ ఈ మాయని సృష్టించేది ఈ అనే ఈయన జగన్నాటక సూత్రధారి
@raajgnt17 күн бұрын
Respected Chaganti garu In one of early videos of yours You have mentioned there is no idol worship as per vedas Then how come the question of rituals to idols arise as per vedas? I am little confused sir Kindly clarify🙏
@lakshmikonkapaka913917 күн бұрын
OM🙏🙏🙏
@gkr164917 күн бұрын
చాగంటి గారికి నమస్కారాలు, రుద్రాభిషేకం లో పంచామృతాల వినియోగం వేద సమ్మతం కాదా? ఆప్యాయస్వ సమేతుతే, దధిక్రావ్ఞో అకారిషం, ఘృతం మిమిక్షే ఘృతమస్య యోనిర్, యమాయత్వా మఖాయత్వా సూర్యస్యత్వా, మధువాతా ఋతాయతే మొదలైన పంచామృత అభిషేక మంత్రాలు వేదం లోనివి కావా ? దయతో వివరించగలరు.
@venkataramanavakati290217 күн бұрын
ఓం
@Ishwara317 күн бұрын
Acharyuniki na namaskaram thankyou for your efforts acharya
@శ్రీలలిత-ఢ6వ16 күн бұрын
మీరు చెప్పినవి నమ్మాలంటె ఆచార్య వినే వారిలొ ధర్మం ఉండాలి + లాజికల్ గ ఆలోచించాలి. ఆచార్యుల వారికి ప్రణామాలు
@dcaokumar865717 күн бұрын
Sir subject cheppandi😊
@ritantareprises796717 күн бұрын
ఒక దయానంద స్వామి ఫాలోవర్ గా ఇదే చెప్పాలి ఒక ఊరిలో ఒక ఆవు ఉంది అది ప్రతిరోజూ ఒక చోటికి వెళ్ళి మట్టిలో పాలు ( వేంకటేశ్వర స్వామి వారి చరిత్ర లో లా) వదిలేస్తోంది దాని యజమానికి ఏమి అర్ధం కాలేదు ఒక రోజు అక్కడ తవ్వి చూస్తే శివలింగం ఉంది మనం ఖచ్చితంగా ఆవు కన్నా తెలివైన వాళ్ళం మనకు వేదం తెలుసు కాబట్టి ఆవు చేసినది పిచ్చి పని యద్భావం తద్భవతి భక్తిలో ఏదైనా రైట్
@ramanakumarbejjipuram536517 күн бұрын
కల్పిత గాధ పుక్కిట పురాణం
@vasudevarao539516 күн бұрын
నమస్తే గురువుగారు శివుడికి అభిషేకం ఎందుకు చెయ్యాలి అనే వాళ్ళ ఇది కూడా తెలియాలి శివుడికి మనం అభిషేకం చేస్తాము అలాగే మన హైందవ ధర్మం పేదవానికి అన్న దానం కూడా ప్రతి నిత్యము చేస్తూనే ఉంటుంది హరే రామ హరే కృష్ణ isckon వాళ్ళే కాదు సాయిబాబా గుడినే కాదు ప్రతి నిత్యం మన హైందవులు లేని వారికి ఉన్న వారికి అందరికి అన్న దానం చేస్తూనే ఉంటుంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే చిన్న పిల్లలకు iskon వాళ్ళ ద్వారా స్కూల్ పిల్లలకు కూడా ప్రతి నిత్యం అందుతూనే ఉంటుంది మన దేశమే కాదు విధేశాల్లో కూడా iskon వాళ్ళు ప్రతి నిత్యం అన్న దానం జరుగుతూనే ఉంటుంది జై శ్రీరామ్
@phanishree55117 күн бұрын
Namaste. Panchaamrutha snanam is not there in Vedas?? I checked few videos of Sringeri swamy using the milk in the Abhisheka. So, I am in doubt whether such system of abhisheka is not at all there in Vedas or restricted to only few occasions? Also, mantras there for pouring of milk, curd, ghee, honey, sugar, and juices. Such mantras not there in Vedas or created later??
@rajeshwarnagula93017 күн бұрын
swamy bit confused 🤔. okko padardam tho abhishekam cheste okko phalitam untundi ani Chaganto koteshwar guru garu pravachanalalo vinna. mari miru ela antunnatemi ?
@vasu.srisailam363817 күн бұрын
శైవం భిన్న ప్రాంతలో రకరకాలుగా ఉన్నది. శివలింగం, నీటితో అభిషేకం ఎందలో చెప్పిన అర్థాలు పొసగ లేదు. నా సత్యాన్వేషణలో తెలుసుకున్నది ఏమనగా. ఏ పురుషుడు ప్రధమంగా పిండoగా జనించడు. ప్రథమంగా స్త్రీ పిండము తయారు అయ్యి Y-chromosone బలము వలన ఆ స్త్రీ పిండమే పురుషునిగా రూపంతరం చెందుతుంది. శాస్త్రం ప్రకారము ఈ దశలోనే జీవుడు పిండములోకి ప్రవేశిస్తాడు. స్త్రీ అంగము పురుష అంగముగా మార్పు చెందు దశయే శివలింగము. నీరు అభిషేకం ఆ శరీరములో ఉండే ప్రాణముగా సంకేతము. అభిషేకము చేయు వారు జీవుడుగా ప్రవేశించిన జ్ఞాన రూపమైన శివుడు. అనగా నేను స్త్రీ కాదు, పురుషుడను కాను, శరీరము కాదు, ప్రాణము కాదు. వీటికి అతితుడైనా జ్ఞాన రూప శివుడను అనే భావతో చేసే క్రతువే శివలింగ అభిషేక పూజ. ఇంత చక్కటి విషయాన్ని పూర్వికులు సంకెతముగా పెట్టుట వారి మహోన్నత జ్ఞానానికి నా నమస్కారములు
@mkbhargavirhymesvibes17 күн бұрын
పరమేశ్వరుని వేద ప్రకారం ఏలా పూజిస్తారు. తెలియ చేయండి. వెంకట చాగంటి గారు.🙏
@వినోదయచిత్తం14 күн бұрын
ముస్లిమ్స్ మక్కా వెళ్లి అక్కడ ఒక పెద్ద రాయి చుట్టూ తిరుగుతారు. దాని గురించి వేదంలో వ్రాసి ఉందా? ఆలా తిరగడం తప్పా? ఒప్పా? దీనిమీద ఒక వీడియో చెయ్యండి🙏
@jagannadharao243917 күн бұрын
అభిషేకం చేసిన ద్రవ్యాలని తప్పకుండా వినియోగిస్తాము. వీటికి అవే విడిగా సేకరించి మేము వినియోగిస్తాము. శివాలయము బుచింపేట.
@satyanarayanaboda762117 күн бұрын
నమస్తే గురువు గారికి 🙏. శివలింగం మీద పోసిన పాలు, పెరుగు, నెయ్యి లాంటివి ప్రసాదంగా భకులకే ఇస్తే ఎలావుంటుంది కొన్ని ఆరోగ్యాని అభివృద్ధి చేసే మూలికలు, దృవ్వాలని కలిపి. భక్తులు దేవుడిమీద శ్రద్ద కొద్దీ ఇస్తారు కాదనకూడదు. అంటే పదిమంది భక్తులు పదిరకాల కూరలు తెచ్చి ఇస్తే మనం మంచి ఆరోగ్యకరమైన కూర తయారుచేసి భక్తులకే పంచిపెడతామనమాట. గురువుగారి అభిప్రాయం ఏమిటో దీనిమీద తెలియచేయగలరు. ఏపి ప్రసాదం ఏమేమి iingrediants, either milllets also, వేసి తయారుచేసి ఇవ్వొచ్చు. 🤔😊🙏🙏🙏
@gollaprolumanojkumar16 күн бұрын
శాస్త్రి గారు మాకు వంశ పరాంపరంగ హనుమాన్ సేవ శ్రీరామ నవమి వేడుకలు లో మాకు ఉంటుంది, ఇప్పుడు ఊరు పెరిగిపోయింది, అసలు హనుమన్ సేవ రోజు స్వామి వారు శ్మశానం దాటి పొవచ్చ లేద అనేది సందేహం, పొలాలు తరువాత రెండు ఇళ్ళ వారు ఉన్నారు, అక్కడ కి పోవాలంటే మద్యలో శ్మశానం ఉంది, పొవచ్చ లేదు ఇంకా ఏమైనా పూజలు చేసి తీసుకొపోవాల,
@Sriram1129417 күн бұрын
మరి అన్ని ఆలయాలలో దేవతా మూర్తులకు అభిషేకాలు, శివాలయాల్లో రుద్రాభిషేకం చేస్తారు కదా ఎందుకు చేస్తారు
@rachapallinambachary858517 күн бұрын
🚩🇳🇪🙏
@krishnaprasadvunnava707217 күн бұрын
స్వయంగా రాముడే ప్రతిష్టించిన శివ లింగం రామేశ్వరం లో ఇప్పటికి ఉంది. విగ్రహారాధన లేకపోతే ఇన్ని గుళ్ళు ఎలా వెలిశాయి. ఆర్య సమాజం స్థాపకులు దయానంద సరస్వతి విగ్రహారాధన కు వ్యతిరేకి. ఒక రకంగా ముస్లిం మత భావలే తొంగి చూస్తాయి. మీ దృష్టిలో పంచభూతాలే దేవతలు, వాటి ద్వారానే మీ క్రతువు లన్నీ జరుగుతాయి. ఒక సారి మీరు పునరాలోచన చేయాలి.
@anandavidya711317 күн бұрын
Shiva sees his creation As Energy.but not the forms of Energy.so symbolically we collect the juse of fruits or any other offerings and do Abhishek to shiva.this has a thayhvik meaning.
@marri.harikrishna220817 күн бұрын
కుంభ మేళా గురించి వేదాలలో ఉందా అనే విషయం,దాని పూర్వపరాల గురించి దయచేసి ఒక వీడియో చేయండి. ప్రశ్న రూపంలో వీడియో పంపలేక పోతున్నాను.
@hanuma-ji5on17 күн бұрын
Sadhguru kooda ide cehpparu, bausa a vishaynne same to same guru garu play chesina video loni ammayi cheppindi.
@SuryaNarayanaSharma117 күн бұрын
Intelligent chowrastha channel ku interview ivvandi. He is asking intelligent క్వశ్చన్స్ for you...
@srimalyala17 күн бұрын
మరి మనం వాటిని ప్రసాదము గా తీసుకుంటాము కదా
@seshavataramcsv407117 күн бұрын
ఇది మానవ శరీరానికి చేయవలసిన సంరక్షణ మరిచి పోకుండా రోజు గుర్తు చేసే ప్రణాళిక
@vidvan657417 күн бұрын
చాలా బాగుంది
@namasivayachikkam67117 күн бұрын
Not up to your mark of clarification. Sir
@ramanaj889417 күн бұрын
ఇంతకీ ఆ నాస్తికులు ఇతరులు విమర్శలకి సమాధానం ఎట్లా చెప్పాలో
@AryasamajamVeparala17 күн бұрын
నిత్యాగ్నిహోత్రం చేసుకోమని చెప్పండి. అగ్నిహోత్రం వలన వాతావరణం శుద్ధి అవుతుంది. ఇది సైంటిఫిక్ ప్రూఫ్
@t.srinivas704417 күн бұрын
పగిలిన విగ్రహము పూజకు పనికిరాదు అంటారు, అందుకే అభిషేకము చేస్తారు అనుకుంటాను.
@omsathish117 күн бұрын
ఇలాంటి ప్రామాణికమైన విషయాలు సరిగ్గా చెప్పేవారు లేక హిందూత్వం పైనా చాలా మందికి నమ్మకం పోతుంది చాలా బాగా వివరించారు నమస్కారం గురువు గారు
@lakshmijyothirmai373817 күн бұрын
Actually this was told by Sadhguru...She just copied and said what he stated... kzbin.info/www/bejne/iqa2aXVvhNqslc0si=XC__s1jNvflUwS8a
@ABRS210916 күн бұрын
Meeru kevalam vedalani namme vallu. I don't agree with you in this matter.
@PammiSatyanarayanaMurthy17 күн бұрын
నమస్కారం.శివలింగం నిరాకార పరమాత్మకి గుర్తుగా ఏర్పాటు చేశారు.ఒక రాతి గుండుని ముక్కు ముఖం లేని లింగం రూపంలో తయారు చేసి చూపారు.ఆయన విశ్వ రూపుడు.భగవద్గీతలో నాకు జనన మరణాలు లేవు అని చెప్పారు.అటువంటి నిరాకార రూపానికి అభిషేకం చేయడం అజ్ఞానం,అధర్మం.అలాగే ఎవరికీ జన్మించని ఆయన్ని ఒక గర్భం నుంచి జన్మించినట్టు గర్భగుడిలో ఉంచడం మరో అధర్మం.ఇటువంటి అనేక అధర్మాలు ఆచరిస్తున్న మూలంగానే ప్రపంచంలో అనేక రకాల ఘోరాలు జరుగుతున్నాయి
@aavakayawood16 күн бұрын
పెద్దలకు నమస్కారం నేను కేవలం ఐదవ తరగతి వరకు ప్రభుత్వ బడిలో చదివిన వ్యక్తిని నాకు వేదాలు ఉపనిషత్తులు తెలీదు కనీసం అష్టోత్తరం కూడా చదవడం తెలియదు మీ కామెంట్ ని చదివాను నాకు ఒక సందేహం వచ్చింది శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించాడు భగవంతుడు నిరాకారం అన్నారుగా మీరు మరి శ్రీరాముడు భగవంతునికి రూపం లేదు అని చెప్పొచ్చు కదా మరి శ్రీరాముడు రాతి గుండు ని శివలింగ ప్రతిష్టించడం ఎందుకు మరి ఇప్పుడు శ్రీరాముడు చేసింది అధర్మమా ధర్మమా
@శ్రీలలిత-ఢ6వ15 күн бұрын
శ్రీ రాముడు వేదాన్ని అనుసరించారు శివలింగ ప్రతిష్ఠ చెయ్యలేదు.