నీకే నే శరణు నీవు నన్ను కరుణించు యీకడ నా కడ దిక్కు ఎవ్వరున్నారికను 1. కన్నుల జంద్ర సూర్యులు గల వేలుపవునీవు పన్నిన లక్ష్మి భూమి పతి వి నీవు అన్నిటా బ్రహ్మకు దండ్రి అయిన ఆదివేలుపవు యెన్నగ నీకంటే ఘన మెవ్వరున్నారికను 2. దేవతలందరు నీ తిరుమేనయిన మూర్తి ఆవల బాదాన లోకమణచితివి నీవొక్కడవే నిలిచిన దేవుడవు యే వేళ నీకంటే నెక్కుడెవ్వరున్నారికను 3. అరసి జీవులకెల్ల నంతరాత్మవైన హరి సిరుల వరములిచ్చే శ్రీవేంకటేశ పురుషోత్తముడవు భువన రక్షకుడవు యిరవైన నీవే కాక ఎవ్వరున్నారికను (04-194) తాత్పర్యము వేంకటేశ్వరా! నీకే నా నమస్కారము. నువ్వు నన్ను దయతో చూడు. ఇక్కడా,(ఈ లోకంలో), అక్కడ (ఆలోకంలో)నువ్వు తప్పించి ఇంకొక దిక్కు నాకు లేదు. 01. చంద్రుడు, సూర్యుడు రెండు కన్నులుగా కలిగిన దేవుడవు నీవు. శరణన్నవారిని రక్షించుటకు సిద్ధమైన లక్ష్మీ నాథుడవు. భూ నాథుడవు. సమస్త దేవతలలోను బ్రహ్మకు తండ్రివైన మొదటి దేవతవు నీవు. దేవతలందరిలోను లెక్కించగ నీకంటే గొప్పవారెవరు లేరు. 02. నీ శుభమయిన శరీరములో దేవతలందరూ ఉన్నారు. నీ పాదముతో బలిని అణచితివి. భక్తులకోసం నిలబడిన దేవుడవు నీవు ఒక్కడివే. ఏ యుగంలో అయినా, ఏ సమయం లో అయినా నీకంటే ఎవరు ఎక్కువ ఉన్నారు.? (ఎవరూ లేరని భావం) 03. పరిశీలించగా ఈ జీవులందరి అంతరాత్మలలో ఉన్న దేవుడివి నువ్వే. (మనస్సు యుక్తా యుక్తాలను, ధర్మాధర్మాలను ఆలోచన చేసేటప్పుడు మనిషిని మంచి వైపు మరల్చే అంతరింద్రియం అంతరాత్మ ) చక్కటి వరములిచ్చే వేంకటేశుడివి నువ్వే. విష్ణు మూర్తివి నువ్వే. ఈ లోకాలను రక్షించే వాడివి నువ్వే. స్థిరమైన వాడివి నువ్వే. ఇంక ఎవ్వరూ లేరు.
అద్భుతమైన పాట, దానిని మీ గానంలో వినడం మా అదృష్టం. మీకు శతకోటి వందనాలు.
@manisai7156 Жыл бұрын
దివ్యగానం 🙏
@neeraja1232 Жыл бұрын
O karunamurthi okka sari karunichaleva swami
@NarsojiGajabhinkar-cj6nk6 ай бұрын
Super song govinda govinda.
@synelloreblog40533 жыл бұрын
వింటున్నంత సేపు గోవిందస్వామి కంటి ముందే ఉన్నట్టు ఉంది.....
@vijayalaxmimane14973 жыл бұрын
Jai sriman narayan 🙏🙏
@satyanarayana77293 жыл бұрын
ఓం నమో నారాయణాయ
@NarsojiGajabhinkar-cj6nk7 ай бұрын
SUPER SONG
@devendarchoudary48403 жыл бұрын
om Namo narayanaya Namaha
@shilpakesavareddy777 Жыл бұрын
💐💐💐🙏🙏🙏🙏💕💕
@NagarajbNagarajbnr13 күн бұрын
Oh God bless me
@surendragudimitla2113 жыл бұрын
Omnamovenkateswarayanamaha
@CR7LOVER5762 жыл бұрын
Om namo venkatesaya namaha 🙏🏻
@tablakalyan3 жыл бұрын
Ahaa oka mannchi kerthana .,🙏🙏🙏🙏🙏
@padmaa99433 жыл бұрын
నీకే శరణు శరణు శ్రీ వేంకటేశ, శ్రీనివాసా, గోవిందా గోవింద 🙏🙏🙏
@ayyapparajpayyapparajp40323 жыл бұрын
தெலுங்கு மொழியாக இருந்தாலும் கேட்க மிக இனிமையாக உள்ளது.om namo venkatesaa🚩🚩🙏
@shantidamam8281 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mastanreddyvuyyuru62502 ай бұрын
Superb
@yogitirumala55763 жыл бұрын
Chala goppaa ghatram mariyu swararachana ,meeke saadyam sir
@suryaprabhakethanapalli48113 жыл бұрын
స్వామిని ఇంత ఆర్తిగా శరణు కోరితే స్వామి ఎలా కాదనగలరు 🙏. దన్యోష్మి గురువుగారు. ప్రతీ పాటను ఎంతో అద్భుతంగా కూర్చి మాకు అందిస్తున్నారు 🙏. మీకు పాదాభివందనాలు 🙏
VERY GOOD TO GET TO SEE YOU CAN DO THIS BY USING OUR SITE AND HAPPY TO GET TO SEE THE BEST WAY OF DOING THINGS AND THE BEST WAY TO GET TO SEE YOU CAN BE SURE THAT YOU CAN GET THE BEST WAY TO DO THAT YOU CAN GET THE BEST WAY OF DOING THINGS THAT ARE
@yallakaraprasad94952 жыл бұрын
Thankingallthe people whoever responsble. For bringing me to this position.
@nagarajb534 Жыл бұрын
good
@thirumalreddymula8282 жыл бұрын
OM NAMO ALIVELIMANGA PADMAVATI VENKATESHWARA SWAMY 🙏🙏🙏🙏🙏🙏