మాట ఇచ్చిన యేసయ్య - మమ్ము మరచిపోలేదుగా నీ అరచేతులలో నన్ను చెక్కుకున్నావుగా నన్ను కోరుకున్నావు - నన్ను చేరుకున్నావు నా దీనస్థితిలో నన్ను లేవనెత్తావు బలపరచితివి - ఘనపరచితివి ఘనుడా నీ కృపలో - నడిపించితివి నీకే నా ఆరాధనా నా యేసయ్యా నీకే నా ఆలాపన నీకే నా ఆరాధనా నా యేసయ్యా నీకే నా ఆలాపన నేనొక నూతన క్రియ చేయుచున్నానని ఇది మొదలు నిన్ను దీవింతునని అలసిన ప్రాణమునకు సేదతీర్చినావు నీ ఆత్మతో నన్ను నడిపించినావు నీకే నా వందనమయ్యా - నీకే నా స్తోత్రములయ్యా ఆపదలో నేను చిక్కుకొనగా నీవే నన్ను బ్రతికించినావు నీ వాక్యమే నాకు ఆహారమాయెను నీ వాత్సల్యమే ఆధారమాయెను నీకే నా వందనమయ్యా - నీకే నా స్తోత్రములయ్యా