Рет қаралды 219,293
రోజూ కనీసం కొన్ని అడుగుల దూరం నడవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు అనే ట్రెండ్ ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది. మన శారీరక శ్రమను కొలిచే స్మార్ట్ వాచ్‌ల ఉపయోగం పెరిగాక దీన్ని నమ్మడం మరింత ఎక్కువైంది.
ఉత్తర ఐర్లాండ్‌లోని అల్స్టర్ యూనివర్సిటీలో ఎక్సర్‌సైజ్ అండ్ హెల్త్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మేరీ మర్ఫీ ప్రకారం... మనం ఒక రోజులో నడిచిన అడుగుల సంఖ్య కన్నా కూడా 'వేగంగా నడవడమే' ప్రధానమైనది. వేగంగా నడవడం వల్ల హృదయ సంబంధమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. నడక వల్ల కలిగే ప్రయోజనాలపై మేరీ మర్ఫీ 20 ఏళ్లకు పైగా పరిశోధనలు చేస్తున్నారు.
#MorningWalk #WalkingBenefits #Health
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu