ఈ 'ROOTS' సంస్థ 'ఎక్కడ ఉంది' అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు.. లేదట..కథారచయిత చెప్పారు.. అందుకే మరీ నచ్చింది నాకు.. అయినా, అదెంత సేపూ?.. ఏ గొప్ప వ్యక్తో, వ్యవస్థో రేపు ఇట్టే ప్రారంభిస్తారు ఎక్కడో.. విలువల కోసమైనా, వ్యాపారం కోసమైనా.. గతంలో ఇలాగే 'పండగ' అని ఒక 'హా(ర్)ట్ ఫిలిం' తీసేను.. పల్లెటూళ్ళో ఒక రిటైరైపోయిన వాడూ, వట్టిపోయిన 'ఆవు' తప్ప ఏ ఆధారం లేని నిరుపేదవాడూ- ఆవుపేడతో 'గొబ్బిళ్ళు' చేసి hi tech city ముందు అమ్మేసి, ఆ డబ్బుతో సంక్రాంతి పండగని అందరికంటే గర్వంగా ఎలా జరుపుకున్నాడో చెప్పే కధాంశంతో.. cutచేస్తే- next year అతి పెద్ద వ్యాపార సంస్థ amazon- on line లో 'గొబ్బిళ్ళు' అమ్మితే- ఘోరమైన సేల్స్.. 😄
@chandrasekharravella30744 жыл бұрын
Avunu ADI nenu chusanu kani ala Pidakalu chesi ammey vallalo undey apayatha...Amazon lo ekkada dorkiddi andi
@nagarajnampelli26604 жыл бұрын
Thank you so much sir... for Choosing My Home to made this beautiful video about my occupation nd My parents are so happy because they are participated in this beautiful Video.....
@sarvagnageetharamana564 жыл бұрын
Nice guruvu garu
@sarvagnageetharamana564 жыл бұрын
Guruvu garu Okkasari story vinandi guruvu garu please
@yoganandamt60474 жыл бұрын
L B Sriram Sir, చాలా బాగా చెప్పారు సార్. కులం అంటే చేసే వృత్తే కాని ఒకటి గొప్ప ఇంకోటి తక్కవేం కాదు. శరీరంలో ఏది అధమం, ఏది ఉత్తమం? అన్నీ కలగలిసిన సమాజమే ఉత్తమం.
@amaravaahinitelugu17904 жыл бұрын
ఈకాలం విద్యార్థులకు ఏమినేర్పితే ప్రయోజకులు అవుతారు అనే సందేహం కలిగినపుడు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఒక పాఠ్య పుస్తకాన్ని పరిచయం చేసినట్లుగా ఈ life is beautiful శ్రీరామ్ గారి హార్ట్ ఫిలిమ్స్ చూపించాలి అనేది ఒక ఉపాధ్యాయునిగా నా అభిమతం. శ్రీరామ్ గారు మీరు ఎన్నో కోణాలను మీ ఫిలిమ్స్ ద్వారా చూపిస్తున్నారు కానీ నాది ఒక కోరిక మన సంస్కృతి సంప్రదాయాల వెనుక దాగివున్న సైన్స్ మూలలను నేటి తరానికి తెలిసేలా ఒక షార్ట్ ఫిల్మ్ తీయగలరు ఎందుకంటె మన ప్రతి చాదస్తం వెనుక ఒక విజ్ఞాన రహస్యం దాగివుంది నేటి తరానికి అది చాదస్తం కాదు సైన్స్ అని భోదపడేలా ఒక చక్కటి హార్ట్ ఫిల్మ్ తీయగలరు ఆచిత్రం నా విద్యార్థులకు పరిచయం చేయాలని కోరిక కాస్త దీనిగురించి ఆలోచించగలరు
@ajaynamilikonda86372 жыл бұрын
ఈ మహానుభావుడి పాదం పద్మములకు వందనాలు మారిపోయిన మనల్ని మళ్ళీ మన మూలాల్ని గుర్తు చేశాడు. హృదయాల్లో పదిలంగా దాచుకునే గొప్ప వ్యక్తి L.B.Sriram gaaru
@hemadurga52344 жыл бұрын
మీ విడియో లు ఎప్పుడు వస్తాయా??...అని ఎదురుచూస్తూ ఉంటాం ...చక్కటి నేపథ్యం తో ఈ తరం వాళ్ళు ఎలా ఉండాలో బలే చూపిస్తారు అండి మీరు ..👌👏👏
@srikanthk23674 жыл бұрын
మీ లఘు చిత్రాలని టి.వి లో వేస్తే బాగుంటుంది వారానికి ఒకసారైనా. జనం మంచి ని చూసే అవకాశం ఉంటుందని ఆశ.
@harshinielevatorsystems10554 жыл бұрын
👌👌👌 నేను కుమ్మరి, మీరు మన మూలలను చాల చక్కగా చూపించారు...ధన్యవాదములు...
@saratbabukodali94333 жыл бұрын
అద్బుత దృశ్య కావ్యం... వళ్లు మర్చి, కళ్ళు చమర్చి, చూసాం మా కుటుంబం అంత.. కానీ నేను ఎంతగానో ఎదురు చూసిన నా కుల వృత్తి (నాయి బ్రాహ్మణ)ని చూపించలేదు గురువుగారు. మూలం మరువలేని నేను నా వృత్రిని నేర్చుకోలేకపోయాను.. మీ లఘు శీర్షకలు కళ్ల తో ప్రారంబించి మనసు తో చూస్తాను. ధన్యవాదాలు.
@rajathegreat3874 жыл бұрын
చాలా మందికి ఒక స్థాయి వచ్చాకా, తమ మూలాల అంటే ఇష్టం ఉండదు. ఏవృత్తి తక్కువ కాదు..ఎక్కువా కాదు. దేనికి అదే సాటి. గొప్ప ఆలోచన లఘు చిత్రం
@gmkadiyala4 жыл бұрын
Mana moolalalu goppaga/adbhuthanga theliyachesina kadhavidhanam chala bagundi.
@sreenivasulugosukonda45304 жыл бұрын
శ్రీరామ్ గారు మన మూలాలు షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. నేను ఒక రైతు బిడ్డనే. దినందిక జీవితం లో పడిపోయిన నాకు మరలా నా బాల్యం ఆ పొలాలు వరి పైరు ను తిరిగి గుర్తు చేసారు. చాలా కృతజ్ఞతలు. మా పిల్లలకు ఒకసారి పొలం దుక్కి దున్నడం చూపించి చేయిస్తాను. గోసుకోండ కాత్యాయనీ
@krishnareddysuragani74384 жыл бұрын
గురువు గారు మన మూలాల్ని కళ్లకు కట్టినట్టు చూపించిన మీకు పాదాభివందనం... చిన్నప్పటి తీపి గుర్తులను ఒక లఘు చిత్రంగా చూపుతారని ఆశిస్తూ...(గోలి కాయలు, కర్రా బిల్ల లాంటి ఆటల్ని చూపుతూ). కళ్యాణిక్రిష్ణారెడ్డి సూరగాని
@keshavgoud17224 жыл бұрын
అన్ని కులాల వృత్తుల గురించిన వీడియో తీసిన్నందుకు కృతజ్ఞతలు. ఇప్పటి తరానికి చాలా అవసరం సర్.
@venkateswararaomedidhi97614 жыл бұрын
నిజమే సామి...నా మూలం వ్యవసాయం... ఉద్యోగ రీత్యా విదేశాలలో వుండడం వల్ల ఈ ఆనందాలకు దూరమయ్యా... సెలవులకు ఇంటికి వెళ్ళి నా ,ఆ అవకాశం లేదు...ఆ వరి పొలాల్లో చేసిన పనులు, బురద అంటిన బట్టలు.... ఎప్పటికైనా మళ్ళీ నా మూలాలను నేను చేరుకోవాలి...
@veeranjaneyulukommuri38574 жыл бұрын
బతుకు చిత్రాలకు లఘు చిత్రాల రూపంలో ప్రాణం పోస్తున్న మీకు... ఎప్పటికీ రుణపడి ఉంటాం...ఎల్‌బీ సార్...
@munjamanjaiah4050 Жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః. గ్రామీణ కుటుంబ అధ్యాత్మిక జీవనశైలి వర్ధిల్లాలి అని ఆశిస్తూ.. ధన్యోస్మి..
@kolaveerabhadraswamynaidu12084 жыл бұрын
వృత్తి మనకు దేవుడు దాన్ని మనం వదలకుండా ఉండాలి అని చెప్పకనే చెప్పారు
@MandapatiSatyam4 жыл бұрын
చాలా చక్కటి చిత్రం శ్రీరాంగారు. నాకు ఎంతో నచ్చింది. బయట పొలాల్లో పనిచేసిన ఎద్దులు చీకటిపడగానే వాటంతట అవే ఇంటికి చేరతాయి. రైతు బండిలో నిద్రపోతున్నా సరే! అలాగే పక్షులు. ఎగురుకుంటూ వచ్చి గూటికి చేరతాయి. మరి మనుష్యులందరూ కూడా అలా చేస్తే ఎంత బాగుంటుంది. అభినందనలు. - సత్యం మందపాటి
@revuriprasanthi43332 жыл бұрын
ప్రతి మనిషి జీవితం లో రూట్స్ అనే పదం వుంది.కానీ ఎదుటివారికి చెప్పటానికి మాత్రమే ఉపయోగిస్తాము మన రూట్స్ మనం chusukovalante కష్టానికి వంగాలిగా.తనువు,మనసు. ఎలా వంచాలో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించి మరోసారి మా మనసులు మురిపించి మరిపించారు . అన్నగారికి నా నమోవాకాలు
@koppireddykamaraju8174 жыл бұрын
ఒక మాట అద్భుతం అయ్య, పుట్టింటి కి వచ్చిన అమ్మాయి దగ్గర డబ్బులు .......... Great sir
@rajuguggilla95684 жыл бұрын
నమస్కారం ఆచార్యుల వారికీ , 🙏🙏 ధన్యవాదాలు మీరు ఈ లఘు చిత్రాన్ని చేసినందుకు ,వృత్తి దారుల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తూనే భారతి,భరత్ అనే పేరులతో ఈ సమాజానికి కులంఅనేది కేవలం వృత్తి అని చూపెట్టినందుకు మాట్లాడటానికి మాటలు లేవు అద్బుతంగాఉంది ధన్యవాదములు.
@srivanisailaja193 жыл бұрын
అద్భుతం🙏🙏🙏నిజంగా ఇలాంటి సంస్థ ఎవరైనా స్థాపిస్తే ఎంత బావుంటుందో❤❤❤
@tsrvenkat4 жыл бұрын
ఈ షార్ట్ ఫిల్మ్ చూశాక నా కు ఎంతో ఉపయోగించిన చిన్ననాటి పలక, డొక్కు సైకిల్, విసనకర్ర, గొడుగు, పడక్కుర్చీ వంటివి గుర్తుకొచ్చాయి. థాంక్స్.
@penamakuriradharani39064 жыл бұрын
🙏👏👏👏బాబాయిగారు, మాట్లాడటానికి మాటలు లేవు....అద్బుతంగాఉంది...ఇలాంటి అద్భుతాలు మీవల్లే సాధ్యం...ఉగాది శుభాకాంక్షలు...
@YUGESH17292 жыл бұрын
Yes exactly
@hanumanvaraprasadreddy74553 жыл бұрын
మూలాలని మరువకూడదని ఈ చక్కటి లఘు చిత్రం గుర్తు చేస్తుంది. అభినందనలు ఎల్బీ శ్రీరామ్ గారికి
@rajasekharmodugumudi87104 жыл бұрын
ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు సర్.. కాన్సెప్ట్ అమోఘం.... చాలా మంచి ఐడియా..... మీ నటన అద్వితీయం.. ఆఖరి శ్రీ శ్రీ గారి మాటలు..ఇరగతీశారు మీరు.. మా గౌడ కుల వృత్తి అయిన కల్లుగీత ను కూడా మరువకుండా చాలా చక్కగా చూపించారు.. Hats off to you sir.. Very Great Concept..
@hafiz72834 жыл бұрын
LBS Garu I am a cabin crew, i have seen the world but no wonder i am watching now ur videos standing in front of burj Khalifa in Dubai, love ur videos sir, thank u
@lankasrinivas2434 жыл бұрын
అద్భుతమైన సందేశాత్మక చిత్రం ఎల్. బి.శ్రీ రామ్ గారు . జలసాలలో కళ్ళుమూసుకొని వృద్దాప్యం లో కూడా కళ్ళు తెరిచి "మూలాల "గురించి ఆలోచించని వారికి ఇది మంచి సందేశం .
@yannapurna98414 жыл бұрын
అవునండి ఆ ఆనందానుభూతి ఖరీదైన జీవితంలో కనిపించదు. మీ ప్రతి షార్ట్ ఫిల్మ్ గొప్ప సందేశంతో తీస్తారు...మీకు నా ధన్యవాదాలండీ....👏👏🙏
@santhadevipappu10112 жыл бұрын
చలా బాగుంది. ఇలాంటి సంస్థ దాన్ని ఆదరించె మనుషులు వుండాలి. శ్రీరామ్ గారు ఓకే విలువల విప్లవం తెస్తున్నారు
@yannapurna98414 жыл бұрын
అద్భుతమైన సందేశమండీ👌👏🙏💐
@NCreations7924 жыл бұрын
మనసంతా చాలా నిండుగా అనిపించింది సర్... మీ షార్ట్ ఫిలిమ్స్ అన్ని మట్టి వాసన కొడుతుంటాయి... తెలుగులో ఎలాగో ఇలాంటి సినిమాలు తియ్యరు షాట్స్ ఫిలిమ్స్ అయిన తీస్తున్నారు... 🙏🙏🙏
@praveenamurla75732 жыл бұрын
అనుక్షణం మన మూలాన్ని మరువకూడదు అనే మీలాంటి వారు ఇంస్ప్రెషన్.. సార్ 🙏🙏🙏👌
@ajithcherukuri20724 жыл бұрын
మనసుకి హత్తుకునే ఒక మంచి లఘు చిత్రం...👏 మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు lb శ్రీరామ్ గారు...
@Anjs.b17967 ай бұрын
చాలా బాగుంది అన్నీ వృత్తులు చూపిస్తున్నారు చేనేత చూపించడం లేదు అని అనుకుంటున్న చూపించారు చాలా బాగుంది ..
@janakivanam98024 жыл бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు..మూలాలు మరవ నప్పుడే మనిషి లో మానవత్వం బ్రతికి ఉంటుంది.. చాలా బాగుంది శ్రీ రామ్ గారూ..🙏
@n.syamalasrinivas51264 жыл бұрын
L B శ్రీరామ్ గారు అందించిన roots మన మూలాలు ఒక అద్భుతం. నేను చూసిన అన్ని చేతి వృత్తులను ఇందులో చూపించారు. ఈ వీడియో ద్వారా మా అబ్బాయి కి ఒకేసారి అన్ని వృత్తులను చూపించగలిగాను. అలాగే ఎవరైనా ఎంత ఎత్తుకు ఎదిగినా, వారి ,వారి పూర్వీకుల ఉనికి ఎక్కడినుండి మొదలైనది వాటిని ఎలా మరిచి పోకుండా మననం చేసుకోవాలో చాలా బాగా చూపించారు.మంచి సందేశం ఇచ్చారు. ఒక్కసారిగా మనసు ప్రశాంతము అయినది. ఈ short ఫిల్మ్ కి అందించిన music మంచి గ్రామీణ వాతావరణం గుర్తు చేసేలా చాలా బాగుంది. L B గారు, మీరు ఇలాంటి వీడియోస్ చేయాలి, మేము వాటిని lessons లా మా పిల్లలకి చూపించాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని శ్రీనివాస్....
@sumanthkakumanu53 Жыл бұрын
చాలా అందమైన అనుభూతి sir!!!!యువతరానికి చాలా గొప్ప సందేశం ఇచ్చారు
గురుభ్యోనమః మన మూలాలు మరోక్కసారి గుర్తు చేశారు.ఉగాది శుభాకాంక్షలు .✍️👏🙏
@jayakumarmasada81974 жыл бұрын
హృదయాన్ని హత్తుకుంది. మనం ఎంత ఎదిగినా మన మూలాలు మరిచిపోకూడదు అని చాలా బాగా చెప్పారు.🙏🙏🙏
@pprasad72934 жыл бұрын
మీకు ఉగాది శుభాకాంక్షలు సార్.మీరు చూపించిన కథ కూడా ఉగాడి పచ్చడి అంత కమ్మగా ఉంది.మన మూలాలు మర్చిపోకూడదు అన్న మీకాన్స్ ప్ట్ సూపర్.Than you sir.
@manikantha12894 жыл бұрын
నా చిన్నతనం లో మా అమ్మ వాళ్ళ ఊరిలో....కుండను చెయ్యటం చూశాను... ఆయన అలా చేస్తుంటే......అలా కళ్ళు అప్పగించి చూసే వాడిని సర్..మళ్ళీ ఇప్పుడు వీడియో లో చూసాను....చాలా బాగుంది సర్....మూలాల మర్చిపోకూడదు....thanku సర్...
@shivasave3 жыл бұрын
అన్ని వృత్తులు గొప్పవే అనే మంచి మెసేజ్ మిరు చక్కగా చూపించారు.
@rakeshbellam12924 жыл бұрын
కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం శాలల మగ్గం సహస్ర వృత్తులు సమస్త చిహ్నాలు నా వెనుతెంచే నా విరచించే నవీన గీతికి నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం...... ఎల్ బి శ్రీరామ్ 🙏
@sonubbq5454 жыл бұрын
ఈ తరం పిల్లలు ఇలాంటి వీడియో లో చూసి వాళ్ళ కుల వృత్తి గురించి వాటి ప్రాధాన్యం గురించి తెలుసుకునే భాగ్యం కలిగించిన మీకు ధన్యవాదాలు.. మీ మేడం గారికి మా కుల వృత్తి అయిన చేనేత లో భాగం చేసినందు కు గర్విస్తున్నాను, అన్ని కులలవారు ఏ స్థితి లో ఉన్న తమ మూలాలు మర్చి పోకూడదు అనే ఓ గొప్ప సందేశాన్ని అందించారు.. చివరగా మీ మాటలతో నా కళ్ళు చెమ్మగిల్లాయి.. ధన్యవాదములు సార్..
@pulipuli2416 Жыл бұрын
అన్ని కులాల వృత్తుల గురించి వీడియో తీసినందుకు మీకు కోటి దండాలు గురువుగారు
@kasiramakrishna72032 жыл бұрын
హాయ్ యల్ బి శ్రీరామ్ గారూ మీకు నాహృదయపూర్వక నమస్కారాలు. కాస్త ఆలస్యమైనా మీ వెబ్ సీరీస్ చూస్తున్నాను. మీరొక అద్భుతం. మీకు ఆ శ్రీరామ చంద్రుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మీరు ఇంకా మానవ సంబందాలు ప్రేమాభిమానాలు విలువలు కల వెబ్ సీరీస్ జనరంజకంగా తీయ్యాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను
@santoshkumar-qh2ii4 жыл бұрын
నేను చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చిన తరువాత మట్టి వడబోసి మా నాన్నగారు చేసిన కుండలు కుండీలు లోపల పెట్టి , ఆదివారం పూట నేను కూడా ప్రమిదలు చిచ్చుబుడ్లు చేసేవాడని, ఇప్పుడు అవేమీ లేవు. మట్టి కుండ లేదు మట్టి ప్రమిద లేదు. కానీ ఒకటే బాధ ఇప్పుడు నా కొడుకుకి నా వృత్తి గురెంచే చరిత్రగా చెప్పుకునే దోర్బాగ్యం పట్టింది. కానీ వాడికి కనీసం వాటి గురించి చెప్తాను. కులం అంటే మనిషిని వేరు చేసేది కాదు బతుకుతెరువు అంతే . అన్ని కులాలు అన్ని అవసరాలే. ఇది ఎక్కువ అది తక్కువ కాదు. ధన్యవాదాలు LB SRI RAM గారు
@rishinaidu10094 жыл бұрын
మాది వ్యవసాయ కుటుంబం..ఆదివారాల్లోమా నాన్న కూడా పొలం వెళ్లి పనులు చేసే వాడిని. గడ్డి కోసేవాడిని..ఆయన చేస్తుంటే చూసే వాడిని..నాన్న లేరు..కానీ నాన్న ఆరోజులు గుర్తొచ్చి కన్నీళ్లు ఆగడం లేదు..మనం రైతు లం.. రా అనేవారు..మన చెమట భూమిలో పడాలి రా అనేవారు..అవును మనం భూమి పుత్రులమ్.. ఎంత మారినా ఎదిగినా మూలాలు మరచిపోకూడదు..మిస్ యూ నాన్న...థాంక్యూ lb sir
@sureshsripada23314 жыл бұрын
ముందుగా మీ మాత పితరులకు శిరః పూర్వక పాదాభివందనం. ఇలాంటి ఒక మనసును కదిలించగలిగే చిత్రాలను రూపొందించే మహా మనీషిని మాకు అందించినందుకు. అయ్యా మీరు తీసే లఘు చిత్రాలు చిన్న పాప నవ్వులలా మనసుకి ఆనందంగా ఎంతో హాయిగా ఉంటాయి. మీ ఈ ప్రయత్నం చిరకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ మీ అభిమాని.
@sureshbabu-yw4sj4 жыл бұрын
సార్ మీ ప్రతి చిన్న సినిమా లో పెద్ద విషయం దాగివుంటుంది దేశసేవా చేసే వ్యక్తులలో ఒక్కొక్కరికి ఒక దారి ఉంటుంది. అందులో మీరు ఎంచుకున్న ఈ దారి చాలా అద్భుతమైనది. దేశం మారాలంటే వ్యక్తి వ్యక్తిత్వంలో మార్పు రావాలనే మీ ఆలోచనకు నమస్కరిస్తున్న సార్
@shiva27212 жыл бұрын
ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భరత మాత ను ... అన్నట్టు.... ఏ ఉద్యోగం చేసిన, ఏ స్థాయి లో ఉన్న మరవకు రా మన “ మూలాలు “ అని బాగా చెప్పేరు. నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻
@rohithvarmamr84544 жыл бұрын
మన సమాజం లో ఉన్న పేదల సామాజిక వృత్తి గురించి బాగా చూపించారు ఆ పనిలో ఉండే విలువ చాలా గొప్పది సర్..ధన్యవాదాలు..
@allabakash9049 Жыл бұрын
యల్ బి శ్రీరామ్ సార్ మీరు గ్రేట్... మూలాలు శీర్షిక గ్రేట్
@srikanthnarukulla53514 жыл бұрын
LB sir మొదట చూసిన వీడియో roots- మన మూలాలు , నేను ఊ ర్లో నే పుట్టి పెరిగాను అన్నీ కుల వృత్తులు చూస్తూనే పెరుగుతున్నా ను అయిన కూడా మీరు చేసిన ఈ అందమైన, అర్థవంతమైన కథా మనసుకు ఎంతో నచ్చింది. ఒక్కసారిగా ఆలోచిస్తూనే ఉండిపోయాను.... చూసిన వెంటనే లైక్, షేర్, కామెంట్ చేస్తున్నాను...
@raghavulun23002 жыл бұрын
Excellent short film stating that donot forget our roots hatsoff to LBS Garu
@chaitanyar86884 жыл бұрын
ఉగాది కానుకగా ఈ short film release చేసినందుకు కృతజ్ఞతలు LB శ్రీరామ్ గారు.
@sharmah81474 жыл бұрын
🕉Simply Superbఅయ్యా, ఓ శ్రీరామా, LB SriRama; 🕉 *నమస్తే_సదా_వత్సలే_మాతృ_భుామే*
@krishnaveni92914 жыл бұрын
ఇలాగే బుర్రకథ కళాకారులు తోలు బొమ్మలు కూడా చూపించండి. ఈ తరం పిల్లలు కూడా తెలుసు కోవచ్చు.
@NCreations7924 жыл бұрын
మంచి ఆలోచన....👍
@ChandraSekhar-zx3pk4 жыл бұрын
I too thought the same. Veda Patha shala, burra katha.. Should have been included
@bulletvijay20924 жыл бұрын
LB శ్రీరాములు గారు మీ షార్ట్ ఫిల్మ్స్ చాలా మొరల్గా ఇన్స్పరేషన్ గ వుంటాయి సార్ మీరు రజకులు చాకలి వారి గురించి ఒక ఫిల్మ్ చేయండి సార్
@vignankumar334 жыл бұрын
ప్రపంచమంతా విస్తరించిన తెలుగు వాళ్ళకి ఎంతో ప్రేమగా చిత్రించిన మీ లఘు చిత్రాలు ద్వారా ఎన్నో విశేషాలు తెలియచెప్పడం అభినందనీయం
@lbsriram69164 жыл бұрын
అదే నేనూ ఎంతో అదృష్టంగా భావిస్తూంటాను!! ఒక సినీ నట,రచయితగా- సగటు సామాజిక వ్యక్తిగా,వ్యాఖ్యాతగా- నా నటననీ,మాటనీ,బాటనీ,భావాన్నీ, వ్యక్తీకరణనీ- తరాల,తరతమాల తేడా లేకుండా- నా తప్పుల్ని పక్కకి తోసేస్తూ, నా తెలియని తనాన్ని క్షమించేస్తూ- ఒక 'దిగువ తరగతి అతి తక్కువ తెలివితేటల' మామూలు మనిషిని- జాతీయంగా,అంతర్జాతీయంగా 'ఇంత-ఎంతో 'మంది- నన్ను మీ చుట్టంగా,ఆంతరంగికుడిగా కలిపేసుకుని- ఇంత ఆత్మీయతా,ఆప్యాయతా కురిపిస్తున్న ఈ ఒక అపురూప ప్ర'క్రియ' ఏదైతే ఉందో- దీని కర్త, కర్మ కూడా మీరే!! దీనికి నాకేం అర్హత ఉందని మాత్రం పంచాయితీ పెట్టను!! "ఓహో! అయితే మేం నీకు ఇచ్చిందంతా వెనక్కిచ్చేసి ఫో, పన్చూసుకో"అంటే- 'ఢాం'మని నిద్దట్లో పోతాను!! నాకు దైవదత్తంగా అబ్బిన ఈ అదృష్టాన్ని- "ఇలాగే నికరంగా నిలబెట్టెయ్ దేవుఁడా"అని మనసులోనే అగరొత్తి వెలిగించి కోరుకుంటూంటాను_/\_
@vignankumar334 жыл бұрын
దైవదత్తం ఐనా శక్తి ని సామన్య ప్రజలకి ధారదత్తం చేయగలిగే మనసునే అంతా మంధీ కలిపేసుకుంది మన పద్దతులు భోజనాలు పెల్లిల్లు ఇలా ప్రతీది చుపిన్చిన మీరు సదా గౌరావనీయులు.
@abhimanyu16834 жыл бұрын
కమ్మరి చట్రం, కుమ్మరి మగ్గం సహస్ర వృత్తుల సమస్త చిహ్నం. నా వినుతించే నవీన గితికి భావం భాష్యం ప్రాణం, ప్రణవం.... సూపర్ సార్...శ్రీశ్రీ గారిని స్మరింప చేశారు
@hemadurga52344 жыл бұрын
మీకు,మీ కుటుంబ సభ్యులకు శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి... "హార్ట్ ఫిల్మ్స్"... పేరుకు దగ్గట్టే మనసుకి హత్తుకుని ఆలోచింప చేస్తున్నాయి...డబ్బుకు మాత్రమే విలువున్న ఈ రోజుల్లో మనుషులకు విలువలు నేర్పుతున్నాయి మీ ఫిల్మ్స్.. ...చాలా సంతోషం అండి.. ప్రపంచం అంచు దాకా వెళ్ళి నా .... మొదటి అడుగు వేసిన ఇంటి గడపను మర్చిపోకూడదు... 👌👌👌👌👌
@k.m.presents46063 жыл бұрын
గురుదేవోభవ!చాలా బాగుంది గురువుగారు
@subbarayuduprathapavenkata81974 жыл бұрын
ఆకాశాన్నంటినవాళ్లు భూమిని చూడడానికి ఇష్టపడరు. చిట్ట చివరి రెమ్మ మీది ఆకు కూడా తనకు మూలం వేరు అన్నది మరవకూడదు. మా అందరి మూలాల్నీ ఒక్కసారి స్పృశించేలా చేశారు. తెలుగులకు మూలమైన ఉగాదినాడు ఇవ్వాల్సిన బహుమతే ఇచ్చారు! అభినందనలు!!
@sreekanthbiyyamkar35614 жыл бұрын
అద్భుతః గురువుగారు మీ లఘు చిత్రం చూడడం పూర్తయ్యేసరికి హృదయం ద్రవించి తెలీకుండానే ఒక్క కంటి నుండి రెండు చుక్కలు అలా రాలిపడతాయి, నేనూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నవ్విస్తూ కూడా రెండు కళ్ళనుంచి ఎప్పుడు రప్పిస్తారని.
@kolaveerabhadraswamynaidu12084 жыл бұрын
అది లెక్క ఉన్న వాతావరణం పరిసరాలను బట్టి మన కట్టు మన బొట్టు మన మాట మారిపోతుంది అంటే ఇదే
@aksharam20134 жыл бұрын
సార్.. మీరు ఈ వయసులో కూడా మా హృదయాలను తాకే షార్ట్ ఫిలిమ్స్ తీసి మమ్మల్ని సంతోష పెడుతున్నందుకు చాలా సంతోషం. మీరు కలకాలం మమ్మల్ని నవ్విస్తూ మీరు నవ్వుతూ సంతోషంగా ఉండాలి..
@VidyaSagar-ko3rs3 жыл бұрын
Still u r fighting for against struggling days...Great Sir....Age is just a Number...
@anugnagunturu24784 жыл бұрын
eppudu comment cheyyakapoina ....ee short film kaadhu kaadhu ee 'heart film' ki naa gundey ankitham😍..inkokka '♥️' aa chivarlo unna diologue ki..
@santoshnakka74314 жыл бұрын
అద్భుతం శ్రీ రామ్ గారు.. మీకు మా తాత వయసు ఉంటుందేమో, నాకు 29.. నాకు చాలా బాగా నచ్చింది మీ వీడియో.. మీ కొత్త సీరియల్ అమృతం ద్వితీయార్థం కూడా చూస్తున్న... మీరు బావుండాలి, నవ్వుతూ, నవ్విస్తూ.. మీ సంతోష్ కుమార్ నక్కా...
@sateeshramana98954 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం, మన మూలాల గురించి ఆమూలాగ్రం మరచిన ఎందరో మహానుభావులు కనీసం ఇది చూసైనా మన మట్టితో మమేకమై పాశ్చాత్య దేశాలలో బ్రతుకుతున్న వారు మన మూలాలను బ్రతికిస్తే... మీరు చేసిన ఈ ప్రయత్నం.. రేపటి మరో మహోదయం...
@srravinuthalakiranbabu85664 жыл бұрын
Great sir సూక్ష్మం లో మోక్షం అంటే ఇదేనేమో.చిన్న చిన్న సంఘటన లో ఎంత అర్థం దాగి ఉందో?
@satyaprakash-fq6vs4 жыл бұрын
మనసును హత్తుకునలా మానవాళ్ళికి దగ్గరగా మరో మహనీయుని ధ్రృశ్యం
@probharata4 жыл бұрын
సర్ ఎల్బి శ్రీరామ్ గారు , మీ లఘు చిత్రం మాకు మధురానుభూతిని కలిగించింది , ఈ ప్రపంచంలో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ కాదు, అని మరోసారి మీరు ఈ లఘు చిత్రం ద్వారా అందరికీ తెలియజేశారు, మీకు ధన్యవాదాలు
@venkatapathinaiduguntur65042 жыл бұрын
Ti
@PANDUPANDU-iu6xg4 жыл бұрын
మెమర్బుల్ వీడియో సర్ విలువలు ఉన్న మీ వీడియోస్ కి ధన్యవాదాలు🙏🙏🙏 కమ్మరి కొలిమి. కుమ్మరి చక్రం.జాలరి పగం.సలెల్ల మగ్గం.సహస్ర వృత్తుల సమస్త చెక్నలు నా వెనుతిచే నా విరాజిచే నవేనా గితికి నవేనా రితికి భావం భాగ్యం ప్రాణం ప్రాణవం 🙏 మా నాన్న రైతు కూడా గ్రేట్ వీడియో మాన గ్రేట్ మూలాలు మరచిపోకూడదు
@tavanatisiddamma9494 Жыл бұрын
Sri Ram Garu You are a great creator of Natural feelings .... You give real enjoyment of Nature by seeing your heaartful shirt stories
@nagarajnampelli26604 жыл бұрын
This Video is shoot at My Home about my occupation...tq so much sir🙏🙏
@saiaru89894 жыл бұрын
Guruvugaaru mi prathi video maaku life lessons .....andhuku meeku 👏🏻👏🏻👏🏻👏🏻 Mi next lesson kosam Wetting 🙏
@srichaitanya31494 жыл бұрын
చెట్టు కి వేర్ల ఎంత ముఖ్యమో. మన జీవితం కి ఎది ముఖ్యమని భలే చూపించారు
@geologgingindustryltd28224 жыл бұрын
న చిన్న నాటి స్మృతులు అన్నీ గుర్తు కు వచ్చాయి సర్ మీకు చాల చాల థాంక్స్
@kandhulanageradhrababu76732 жыл бұрын
చాలా గ్రేట్ మూవీ ని చాలా గ్రేట్ డైరెక్టర్ ఎల్బీ శ్రీరామ్ గారు చాలా బాగా అందించారు.
@venkataramanaayalasomayaju18734 жыл бұрын
ఎన్నడో మరచిపోయిన జ్ఞాపకాలను గుర్తు చేశారు కదండీ, అధ్భుతః. శత కోటి ధన్యవాదములండీ..
@chandrasekharravella30744 жыл бұрын
Chala manchi concept Andi..Manshulni marchipothunna e rojullo ..Mana mulali gurinchi marchipokunda undali Anna me alochanaku Padabivandanalu.. at least once in a month ela mana mulalaku velli mana Pani manam chestey Mana viluva Manisha viluva telsthndi 🙏🙏🙏🙏👏🏾👏🏾👏🏾
@srividyasingamaneni98204 жыл бұрын
Eagerly waiting sir.....meeru chese okko short film oka aanimuthyam sir🙏🙏